భార్యను, ఆమె ప్రియున్ని చంపేశాడు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో పాటు ఆమె ప్రియున్ని నేవి ఆఫీసర్ కిరాతకంగా చంపేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నేవీలో పనిచేస్తున్న దృవ్ కాంత్ విమల్ ఠాకూర్ కు సుష్మితతో ఐదేళ్ల క్రితం వివాహమైంది.
జుహు ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న వీరు కొంతకాలం వరకు అన్యోన్యంగానే ఉన్నారు. అయితే ఉద్యోగ పనుల నిమిత్తం ఎక్కువ కాలం డ్యూటీలోనే ఉండే ఠాకూర్ గత నెల విధుల నుండి తిరిగి రాగానే సుష్మిత విడాకుల పత్రాలు చేతిలో పెట్టింది. తను అజయ్ కుమార్ వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతనితోనే కలిసుండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. సుష్మిత ప్రపోజల్‌కు ఠాకూర్ కూడా ఒప్పుకున్నాడు.
ఈ క్రమంలో వారం క్రితం ఠాకూర్ ఉద్యోగానికి వెళ్లి బుధవారం తిరిగొచ్చాడు. అయితే భర్త ఇంకా డ్యూటీలోనే ఉన్నాడని భావించి సుష్మిత తన ప్రియుడితో అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన అజయ్‌కుమార్ మెడను నరికి, భార్యను దిండుతో నొక్కి ఠాకూర్ చంపేశాడు. అనంతరం టై తో ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు కానీ టై తెగిపోయింది. నెత్తురు మరకలతో ఉన్న ఠాకుర్ ఉదయాన్నె అపార్ట్మెంట్ బయటకు వచ్చి పోలీసులను పిలవాల్సిందిగా కోరాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.