breaking news
tadikonda rajaiah
-
'నా అనుమతి లేనిదే నియోజకవర్గానికి రావద్దు'
సాక్షి, వరంగల్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు మరోసారి వివాదస్పదంగా మారాయి. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన చేసిన హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించినవనే చర్చ మొదలైంది. ‘ఎమ్మెల్యేకు తెలియకుండా ఎమ్మెల్సీ, ఎంపీ, జడ్పీ చైర్మన్, మంత్రి.. ఇలా ఎవరూ నియోజకవర్గాలకు రావొద్దు.. వారంతట వారే వస్తే గ్రూపు రాజకీయాలను ప్రోషించినట్లుగా భావించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.. పార్టీ గమనిస్తోంది.. ఎంతటి నాయకులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఈసారి ఆయన తన స్వరాన్ని మరింత పెంచారు. ఇంతకాలం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య నెలకొన్న విబేధాల కారణంగా ఒకరిపై పరోక్ష వ్యాఖ్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నా యి. అయితే సోమవారం రాజయ్య మాట్లాడుతూ తన ఆహ్వానం లేనిదే నియోజకవర్గంలో ఎవరూ తిరగొద్దంటూ వివిధ పదవుల్లోని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడడంతో ఈసారి ఆయన ఎవరినీ హెచ్చరించినట్లన్న చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతోంది. అధికార పార్టీలో కలకలం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కలకలం రేపాయి. నియోజకవర్గానికి ఎవరు రావాలన్నా ఎమ్మెల్యే అనుమతి తప్పని సరని ఆయన హుకూం జారీ చేయడం గమనార్హం. ‘పార్టీలు, నాయకులకు అభిమానులు ఉండొచ్చు. కానీ, దానిని అడ్డం పెట్టుకుని గ్రూపు రాజకీయాలకు పాల్పడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. (ఆ తేదీనే ఎన్నికలు జరుగుతాయ్: ట్రంప్) సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.3 కోట్ల సీడీఎఫ్ నిధులు, రూ. 2.5 లక్షల వేతనం విరాళంగా ఇచ్చానని చెప్పుకొచ్చిన ఆయన.. ఇటీవల హైదరాబాద్‌లో కొందరు చెక్కులు ఇచ్చారని, అక్కడ ఇస్తే సముద్రంలో చెంబుతో నీళ్లు పోసినంత సమానమంటూ చెప్పడంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కొంతకాలంగా గ్రూపు రాజకీయాలు, విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రెండు గ్రూపుల వారిని వేర్వేరు సమయాల్లో తరలించడం అప్పట్లో వివాదస్పదంగా మారింది. అయితే ఈసారి ‘ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్మన్, మంత్రి.. నిబంధనలు పాటించకుండా వస్తున్న ఎంతటి పెద్ద నేతలైనా వారిపై చర్యలు తప్పవు.. వారంతా ఎమ్మెల్యే కనుసైగల్లో, ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు నియోజవర్గంలోకి రావాలి... అలా కాకుండా ఎవరొచ్చినా గ్రూపు రాజకీయాలకు ప్రోత్సహించినట్లే, గ్రూపు రాజకీయాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించడం గమనార్హం. ‘ఎవరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.. పార్టీల్లో ఉన్నప్పుడు నిబంధనలకు కట్టుబడి ఉండాలి.. అందులో అధికార పార్టీకి నిబంధనలు మరింత కఠినంగా ఉంటా యని గ్రహించాలి’ అని సూచించారు. పా ర్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వా జుజరు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని రాజయ్య హెచ్చరించడం టీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. -
కోటలో తొలిసారిజెండా పండుగ
సాక్షి, హన్మకొండ : కాకతీయుల కోట వేదికగా స్వాతం త్య్ర వేడుకలు కనుల పండువగా జరగనున్నాయి. 68వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఖిలావరంగల్ ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 9గంటలకు కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్‌మహల్ మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను డిప్యూటీ సీఎం సన్మానిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తొలి స్వాతంత్య్ర వేడుకలకు వేదికగా ఖిలావరంగల్‌ను ఎంపిక చేశారు. ఏర్పాట్లు పూర్తి.. పోలీసులు, సైనిక దళాల కవాతు చేసేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీఐపీలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలకు ఈ వేడుకలు తిలకించేందుకు అనువుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థలాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు కళారూపాలను, ఆ తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాలను ప్రదర్శిస్తారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలకు ఉపముఖ్యమంత్రి ప్రశాంస పత్రాలను అందిస్తారు. ఈ వేడుల సందర్భంగా పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ భద్రతా వ్యవహారాలను ఏఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు ఓఎస్డీలు, పది మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 20మంది ఎస్పైలతో పాటు వివిధ విభాగాలకు చెందిన కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటారు. ఇండోర్ స్టేడియంలో అట్ హోం వేడుకలు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సాయంత్రం 5గంటలకు హన్మకొండ ఇండోర్ స్టేడియంలో అట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, పాత్రికేయులు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్, అతిథి మానసిక వికలాంగుల కేంద్రం, ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, కరీమాబాద్ సీవీ హైస్కూల్, హసన్‌పర్తి సూజాత విద్యానికేతన్ హైస్కూల్, మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సెయింట్ థామస్ గ్రామర్ హైస్కూల్, నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలభవన్, శ్లోకా హైస్కూల్‌కు చె ందిన విద్యార్థులు కళా ప్రదర్శలను ఇస్తారు. గర్వించదగ్గ రీతిలో వేడుకలు : కలెక్టర్ ఖిలావరంగల్ : కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటలో 68వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లా ప్రజలు గర్వంచదగ్గరీతిలో జరగనున్నాయని జిల్లా కలెక్టర్ కిషన్ తెలిపారు. ఖిలావరంగల్ కోటలో పంద్రాగస్టు వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ కిషన్, నగర పాలక సంస్థ క మిషనర్ సువర్ణపాండదాస్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ప్రాంతాలలోనే 68వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణరుుంచిందని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేడుకలు కోటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖుష్‌మహల్ పక్కనే ఉన్న స్థలంలో జాతీయ పతాకావిష్కరణ జరుగుతుందని తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు, సామన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో అడిషనల్ ఎస్పీ యాదయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రక రణ్, ఆర్డీఓ మాధవరావు ఉన్నారు.