breaking news
Swiss Federal Tax Administration
-
భారత్ చేతికి మరిన్ని స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: వార్షిక ఆటోమేటిక్ సమాచార మారి్పడి (ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలకు సంబంధించిన 5వ సెట్‌ను భారత్‌కు స్విట్జర్లాండ్ అందించింది. వీటిలో వందల కొద్దీ ఖాతాల వివరాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో కొందరు వ్యక్తులు, కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన అకౌంట్లు అనేకం ఉన్నట్లు వివరించాయి. భారత్‌కు స్విట్జర్లాండ్ అందించిన వివరాల్లో ఖాతాదారు పేరు, చిరునామా, దేశం, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, ఖాతాల్లో బ్యాలెన్స్ మొదలైనవన్నీ ఉన్నట్లు పేర్కొన్నాయి. గత నెల సెపె్టంబర్లో సమాచార మారి్పడి చోటు చేసుకోగా తదుపరి విడత సెట్‌ను స్విట్జర్లాండ్ 2024 సెప్టెంబర్‌లో భారత్‌కు అందించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రిటర్నుల్లో తమ ఆర్థిక వివరాలన్నీ సక్రమంగా పొందుపర్చారా లేదా అనేది పరిశీలించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుని, పన్నులు ఎగ్గొడుతున్న కుబేరుల ఆటకట్టడానికి ఉద్దేశించిన ఏఈఓఐ కింద భారత్‌కు తొలిసారి 2019 సెపె్టంబర్లో మొదటి సెట్ వివరాలు లభించాయి. మరోవైపు, ఈ ఏడాది మొత్తం 104 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాల మారి్పడి జరిగినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) తెలిపింది. 78 దేశాలతో సమాచారం ఇచి్చపుచ్చుకున్నట్లు పేర్కొంది. 25 దేశాల నుంచి తాము వివరాలు తీసుకున్నప్పటికీ ఆయా దేశాల గోప్యత ప్రమాణాలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో లేనందున తాము తమ సమాచారమేమీ ఇవ్వలేదని వివరించింది. -
లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు
బెర్న్: భారత విచారణ బృందాలకు సమాచారం అందించే అంశంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, ఆయన భార్య మినాల్‌ల నుంచి సమాధానం కోరుతూ స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం(ఎఫ్‌టీఏ) గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. దౌత్య సహకారం కోసం సోమవారం జారీ చేసిన ఈ నోటిఫికేషన్లలో ఒకటి లలిత్ మోదీకి, మరొకటి మినాల్ మోదీ అలియాస్ మినాలినీ మోదీకి పంపారు. వీటిపై స్పందించేందుకు వారికి పదిరోజుల గడువునిచ్చారు. స్విట్జర్లాండ్‌లో వారిద్దరికి సంబంధించిన అధికార ప్రతినిధుల పేర్లను తెలపాలంటూ అందులో కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.