చిన్నారిపై నుంచి దూసుకుపోయిన ఆటో
జవహర్నగర్ (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలోని షామీర్పేట మండలం జవహర్ నగర్లో వేగంగా వచ్చిన ఆటో ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. స్థానికంగా నివసించే వరికుప్పల స్వాతి (7) రాత్రి 9 గంటల సమయంలో తినుబండారాల కోసం ఇంటికి ఎదురుగా రోడ్డు పక్కనే ఉన్న షాపు వద్దకు వెళ్లింది.
ఇంతలోనే అటువైపు వేగంగా వచ్చిన టాటా ఏస్ ఆటో చిన్నారిపై నుంచి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చిన్నారి స్వాతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.