breaking news
Survey work
-
ఫార్మసిటీ ఏర్పాటుకు సంబంధించి సర్వే పనులు..
కందుకూరు: ఫార్మసిటీ ఏర్పాటుకు సంబంధించి సర్వే పనులు శనివారం ప్రారంభమయ్యాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పలువురు ఫార్మా సంస్థల అధినేతలతో కలిసి కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో భూములను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా సర్వే ఇన్ ల్యాండ్ రికార్డ్సు ఏడీ దేవరాజ్ ఆధ్వర్యంలో ఏడుగురు సర్వేయర్లు గల బృందం సర్వే నంబర్ 288లోని భూముల్లో సర్వే పనులు చేపట్టింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ సర్వే నంబర్లో 2,747.6 ఎకరాలకు గాను అసైన్డ్, పట్టా భూములుపోగా 2,139.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఆ సర్వే నంబర్లోని భూముల సరిహద్దులను నిర్ణయించే పనిలో సర్వే బృందం నిమగ్నమైంది. -
నాలుగు లేన్లపై రయ్.. రయ్!
* హైదారాబాద్-శ్రీశైలం రహదారికి మహర్దశ * ఆర్అండ్బీ నుంచి జాతీయ రహదారిగా మార్పు * ప్రారంభం కానున్న రోడ్డు విస్తరణ పనులు * ముమ్మరంగా జరుగుతున్న సర్వే పనులు ఆమనగల్లు: శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారికి మహర్దశ కలగనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(నాయ్) ప్రస్తుతం ఉన్న రెండులైన్ల రహదారిని నాలుగులైన్లు గా విస్తరించనుంది. హైదారాబాద్ నుంచి ఆమనగల్లు, డిండి మీదుగా శ్రీశైలం దేవస్థానం వర కు సర్వేపనులు ముమ్మరంగా కొనసాగుతున్నా యి. పనులు కూడా త్వరలో ప్రారంభంకానున్నట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. హైదారాబాద్ నుంచి నల్గొండ జిల్లా డిండి మధ్యలో నాలుగుచోట్ల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా నంద్యాల వరకు ఉన్న ఆర్అండ్బీ రోడ్డును 765వ జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీచేసింది. కాగా, రంగారెడ్డి జి ల్లా మహేశ్వరం చౌరస్తా నుంచి ఆమనగ ల్లు మీదుగా నల్గొండ జిల్లా డిండి వరకు 85కి.మీ రోడ్డును మొదటి విడతలో నా లుగులైన్ల రోడ్డుగా మార్చేందుకు ప్రభుత్వం రూ.341 కోట్లు మంజూరు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల ముందు రోడ్డు పనులకు టెండర్ దక్కించుకున్న ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణసంస్థ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ప నులకు సంబంధించి గత కొన్ని రోజు లుగా స ర్వేపనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయి తే ఈ ప్రాంతం వ్యాపారపరంగా అభివృద్ధి చెం దే అవకాశం ఉందని ఈ ప్రాంతప్రజలు భావిస్తున్నారు. చకచకా విస్తరణ ప్రస్తుతం ఏడు మీటర్లు ఉన్న బీటీరోడ్డును 10 మీటర్లకు పెంచనున్నట్లు అధికారులు వివరిం చారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తం భాలు, విద్యుత్ లైన్లు, ఆలయాలు, జాతీయ నే తల విగ్రహాలను తొలగించేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. కల్వర్టును వెడల్పు చేసేం దుకు సర్వేలు చేస్తున్నారు. ముఖ్యంగా కందుకూరు, కడ్తాల, మైసిగండి, కర్కల్పహాడ్, విఠాయిపల్లి, ఆమనగల్లు, వెల్దండ, జయప్రకాశ్నగర్ తండా, వంగూరు గేటు, డిండి ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డివైడర్లను ఏ ర్పాటు చేయనున్నట్లు ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. డిండిప్రాజెక్టు వద్ద రూ.9కోట్లతో వంతెన నిర్మించనున్నారు. నాలుగులైన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా బీటీరోడ్డుకు ఇరువైపులా ఐదు అడుగుల మేర మట్టిరోడ్డు వేయనున్నారు. ఆందోళనలో చిరు వ్యాపారులు హైదారాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చి రువ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యం గా ఆమనగల్లు, కడ్తా ల గ్రామాల్లో రోడ్డుకు ఇ రువైపులా చిన్నచిన్న కిరాణాదుకాణాలను ఏ ర్పాటుచేసుకుని చాలా మంది జీవనోపాధి పొం దుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు జరిగితే తామంతా ఉపాధి కోల్పోతామని ఆవేదన చెందుతున్నారు.