breaking news
Sunflower crops
-
గిన్నిస్‌లో పొద్దుతిరిగింది
పొద్దు తిరుగుడు పువ్వు. సూర్యరశ్శిపై ప్రేమతో తదేకంగా ఆదిత్యుడినే చూస్తే అతను ఎటువైపు మళ్లితే ఆ దిశగా తిరుగుతూ తన ప్రేమను ప్రదర్శించే పొద్దు తిరుగుడు పువ్వు. సూరీడు కిందకు వాలేకొద్దీ సరిగా కనిపించట్లేడని అనుకుందో ఏమో ఇంకాస్త పైకి నిక్కి నిక్కి చూసింది. అలా అలా పైపైకి ఎదిగింది. ఆపకుండా ఎదుగుతూ ఏకంగా 35.9 అడుగుల ఎత్తుకు పెరిగింది. అమాంతం అంతెత్తుకు పెరిగి నేరుగా గిన్నిస్ ప్రపంచ రికార్డుల పుస్తకంలోకి ఎక్కేసింది. ఉక్రెయిన్ నుంచి అమెరికాకు వలసవచ్చిన 47 అలెక్స్ బాబిక్ ఈ మొక్కను కంటికి రెప్పలా కాపాడుతూ దాని బాగోగులు చూసుకుంటున్నారు. టెలిఫోన్ స్తంభం అంత ఎత్తుకు పెరిగిన ఈ మొక్కకు బుధవారమే గిన్నిస్ ప్రపంచ రికార్డ్ అధికారులు అధికారిక రికార్డ్ ధృవీకరణ పత్రాన్ని జారీచేశారు. దీంతో దీని పెంపకం దారు అలెక్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మొక్కకు ముద్దుగా ‘క్లవర్’అని పేరు పెట్టుకున్నారు. అనుకోకుండా మొదలైన ఈ మొక్క పోషణపర్వాన్ని అలెక్స్ ఆనందంగా మీడియాతో పంచుకున్నారు.ఇష్టంతో మొదలై..‘‘ఉక్రెయిన్‌లో చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు, దారుణమైన రేడియోధారి్మకత విషాదం కారణంగా 14 ఏళ్ల వయసులో నేను 1991లో అమెరికాకు వలసవచ్చా. అయినాసరే నాకు స్వదేశం ఉక్రెయిన్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఉక్రెయిన్ జాతీయ పుష్పం అయిన పొద్దుతిరుగుడు పువ్వులను పెంచాలని నిర్ణయించుకున్నా. అందుకే ఏడేళ్ల క్రితం సన్‌ఫ్లవర్ మొక్కల పెంపకాన్ని మొదలెట్టా. నేను పెంచిన మొట్టమొదటి పొద్దుతిరుగుడు మొక్క 13 అడుగుల ఎత్తు పెరిగింది. తర్వాతది 15 అడుగులు.ఆ తర్వాతది 19 అడుగులు. దీంతో అసలు ఈ మొక్కలు ఎంత ఎత్తు పెరుగుతాయి? ఇంకా ఎత్తు పెంచాలంటే ఏం చేయాలి? అనే కుతూహలం, ఉత్సహం నాలో పెరిగాయి. ఆ ప్రేరణ నుంచి పట్టిందే ఈ మొక్క. నా పదేళ్ల కొడుకు సైతం మొక్క పెంపకంలో ఎంతో సాయపడ్డాడు. ఈ మొక్కకు క్లవర్ అని పేరు పెట్టింది కూడా వాడే. నాలుగు ఆకులు జతగా ఉండే క్లవర్ జాతి పెద్ద ఆకును ఈ మొక్క మీద పెట్టి మంచి జరగాలని రోజూ కోరుకునేవాడు. మేం ఏరో ఒకరోజు చనిపోతాం. కానీ ఈ మొక్క గురించి అందరూ మాట్లాడుకుంటారు. నా పిల్లలు వారి పిల్లలకూ ఈ మొక్క ఘనచరిత్రను చెబుతారు’’అని అలెక్స్ అన్నారు. అందరి సమక్షంలో కొలతసెపె్టంబర్ మూడోతేదీన ఈ మొక్క ఎత్తును అందరి సమక్షంలో అధికారికంగా కొలిచారు. స్థానిక వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని తోటపని నిపుణులు, అలెన్ కౌంటీ తూనికలు, కొలత విభాగాధికారులు, గిన్నిస్ రికార్డ్ ప్రతినిధి, ఫోర్ట్ వేనీ కొమిట్స్ మైనర్ లీగ్ ఐస్ హాకీ బృంద మస్కట్ ఐసీ డీ ఈగల్ సహా చాలా మంది ఈ మొక్క ఎంత ఎత్తు పెరిగిందా? అని చూసేందుకు ఎగబడ్డారు. 35 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉందని తేల్చారు. ‘‘గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టామన్న ఆనందానికి అంతేలేకుండా పోయింది. నా కుమారుడు ఎగిరి గంతేశాడు. ఈ మొక్క నేను వలసదేశంలో తలెత్తుకు తిరిగేలా చేసింది. రికార్డ్ అనేది నిజంగా ఎంతో భావోద్వేగంతో కూడింది’’అని అలెక్స్ ఆనందం వ్యక్తంచేశారు. పాడవ్వకుండా చుట్టూ కంచె ఎవరూ ఈ మొక్కను తాకకుండా చుట్టూ కంచె ఏర్పాటుచేశారు. ఈ మొక్క పడిపోకుండా 35 అడుగుల పొడవునా చుట్టూ తోడ్పాటుగా మూడు నిచ్చెల నిర్మా ణాన్ని సిద్ధంచేశారు. ఇది సరిగా పెరుగుతుందో లేదో తెల్సుకోవడానికి మరో భారీ నిచ్చెనను దీనిని బిగించారు. ఇంటి పెరట్లో అంతెత్తున పెరుగుతున్న మొక్క అలెక్స్ కుటుంబంలో భాగంగా మారిపోయింది. ‘‘2022లో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలయ్యాక స్వదేశంపై ప్రేమ మరింత పెరిగింది. మారణహోమం అంతమవ్వాలని మేం కోరుకుంటున్నాం’’అని అలెక్స్ అన్నారు. చరిత్రలో సన్‌ఫ్లవర్ మొక్క.. ఉక్రెయిన్‌లో పొద్దుతిరుగుడు సాగు ఎక్కువ. అక్కడి నుంచి భారత్‌కు సైతం సన్‌ఫ్లవర్ నూనె దిగుమతులు ఎక్కువే. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలోనూ పొద్దుతిరుగుడు పువ్వు ప్రస్తావన వచి్చంది. యుద్ధం మొదట్లో ఉక్రెయిన్ శివారుభూభాగంలోకి రష్యా సైనికులు చొరబడినప్పుడు అక్కడి ఒక ఉక్రెయిన్ మహిళ అడ్డుకుంది. రష్యా సైనికుడితో.. ‘‘కొన్ని పొద్దుతిరుగుడు గింజలు నీ జేబులో వేసుకో. ఇక్కడ నువ్వు చచి్చపోయి పాతిపెడితే ఆ గింజలు మొలకెత్తి మొక్కగానైనా మళ్లీ పుడతావు’’అన్న వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అయింది. 1996లోనూ అణ్వస్త్ర నిరాయుధీకరణ కార్యక్రమంలో భాగంగా పెర్వోమిస్క్ క్షిపణి స్థావరంలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మంత్రులు సన్‌ఫ్లవర్ మొక్కలనే నాటారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ఘటన తర్వాత నేలలో రేడియోధారి్మకత గాఢత తగ్గించే లక్ష్యంతో అక్కడ ఈ మొక్కలనే శాస్త్రవేత్తలు నాటారు. అలెక్స్ మొక్క కథ త్వరలో ‘బ్లూమ్’పేరిట డాక్యుమెంటరీగా రానుంది. – ఫోర్ట్ వేనీ -
కరోనా టైం లో జాబ్ పోయింది వ్యవసాయం చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడు
-
పొద్దుతిరుగుడు పంట లాభాలు రావాలంటే పాటించాల్సిన మెళకువలు
-
సాగుకు సమయమిదే
చింతపల్లి: మన్యంలో గిరిజన రైతులు పొద్దు తిరుగుడును సాగు చేసేందుకు ఇదే సరైన సమయమని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అనురాధ తెలిపారు. ఆరోగ్యవంతమైన నూనె పంటల్లో పొద్దుతిరుగుడు ప్రధానమైనది. వార్నిష్, సబ్బుల తయారీలో కూడా పొద్దుతిరుగుడును వినియోగిస్తారు. అన్నిరకాల భూముల్లో ఈ పంటను సాగుచేయవచ్చు. ఏజెన్సీ ప్రాంతానికి మోర్డారు రకం అత్యంత అనుకూలంగా ఉన్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్ సీజన్లో జూన్ రెండవ వారు నుంచి ఆగస్టు రెండవ వారం వరకు సాగుకు అనుకూల వాతావరణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏడీఆర్ డాక్టర్ అనురాధ అందించిన వివరాలు.. సాగు పద్దతి పొద్దు తిరుగుడు సాగుకు ముందుగా భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని మెత్తగా తయారు చేయాలి. హెక్టారుకు 12 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలను ఒకటిన్నర అంగుళాల లోతులో నాగలి చాళ్లలో వేసుకోవాలి. అంతకన్నా లోతులో వేసుకుంటే మొలక సరిగా రాదు. చాళ్ల మధ్య దూరము 2 అడుగులు, మొక్కల మధ్య 12 అంగుళాల దూరం వేసుకోవాలి. హెక్టారుకు 60 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. పొద్దు తిరుగుడును వేరుశనగలో మిశ్రమ పంటగా 8 నుంచి 12 వరసలకు రెండేసి వరుసల చొప్పున వేసుకోవాలి. భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలోను, నత్రజని ఎరువులో సగం విత్తుకునేటప్పుడు, మిగిలింది పంట మొగ్గ మీద ఉన్నప్పుడు వేసేకోవాలి. విత్తిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. వేరుశనగలో మిశ్రమ పంటగా వేస్తే వరుసలు తూర్పు, పడమర దిక్కున వేయాలి. లేకుంటే పొద్దుతిరుగుడు వరుసల నీడ వేరుశనగపై పడి పంటకు నష్టం జరుగుతుంది. ఈ పంటకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిలువ ఉండకూడదు. ఈ పంట పరస్పరాగ సంపర్కము మూలంగా గింజకడుతంది. పంట పూత దశలో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య పువ్వు మీద చేతితో గాని, మెత్తని గుడ్డతో గాని సున్నితంగా రుద్దినట్లయితే పరాగ సంపర్కము బాగుండి గింజ బాగా కట్టి దిగుబడి పెరుగుతుంది. సాధారణంగా క్రిమి కీటకాలు, తెగుళ్లు ఆశించవు. పచ్చగొంగళి పురుగు ఆశించినట్లయితే దీని నివారణకు 35 ఈసీ మందు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట చివరి దశలో పిట్టల భారీ నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలి. వర్షాధార పంటగా ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి పెరుగుతుంది. పొద్దుతిరుగుడు సాగుతో గిరిజనులు మంచి లాభాలు పొందవచ్చని ఏడీఆర్ తెలిపారు. -
అకాల వర్షం
కల్హేర్, న్యూస్‌లైన్: జిల్లాలో శుక్రవారం అకాల వర్షం కురిసింది. దీంతో ప లుచోట్ల పంటకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా చెట్లు నేల వాలాయి. కల్హేర్ మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. అదేవిధంగా ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం కురువడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఇదిలాఉండగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్హేర్, మార్డి చోట్ల పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. వర్షంతో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖేడ్‌లో గంటపాటు.. నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం సా యంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. సాయంత్రం వేళ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో పాటు గంట సే పు వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యు త్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. చల్లబడిన వాతావరణం మెదక్ మున్సిపాలిటీ: మెదక్‌లో శుక్రవారం సాయంత్రం కురి సిన చిరుజల్లులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపగా, సా యంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఐదు గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఓ మో స్తారు వర్షం కురిసింది. కాగా వేసవి సమీపిస్తున్న తరుణంలో కురుస్తున్న వర్షం వల్ల మరింతగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దుబ్బాకలో చిరుజల్లులు దుబ్బాక: దుబ్బాకలో చిరు జల్లులతో కూడిన వర్షం కురిసిం ది. గురువారం రాత్రి ఈదురు గాలులతో పాటు చిన్నపాటి వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కూడా చిరుజల్లు లు కురిశాయి. అయితే గత ఐదు రోజులుగా ఈదురు గాలు లు వీస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా గే వర్షాలు కురిస్తే మామిడి, ఇతర పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్థం చేస్తున్నారు. కురిసింది వాన జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌లో శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. సాయంత్రం సన్నని జల్లులతో ప్రాంభమైన వాన ఆ తరువాత ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారుగా కురి సింది. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. ప్రధానంగా బ్లాక్ రోడ్డుతో పాటు జాతీయరహదారిపై బాగారెడ్డి విగ్రహాం వద్ద నీరు నిలిచిపోయింది. సుభాష్‌గంజ్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు వచ్చిచేరింది. గురువారం రాత్రి కూడా సన్నని జల్లులు పడ్డాయి. ఎగిరిన రేకులు న్యాల్కల్, న్యూస్‌లైన్: మండలంలో శుక్రవారం రాత్రి వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు లు ఎగిరిపోయాయి. అదేవిధంగా మండల పరిధిలోని హుస్సెళ్లి గ్రామ సమీపంలో గిరిజనులు వేసుకున్న గుడిసెలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాల య్యాయి. కర్నాటక రాష్ట్రం జబ్గి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు గ్రామంలో చెరకు నరకడానికి వచ్చారు. గ్రామ సమీపంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఉన్నట్లుండి గాలి వాన రావడం, గుడిసెలు కొట్టుకపోవడంతో పప్పు, బియ్యం ఇతర సామగ్రి కూడా పూర్తిగా పాడైపోయాయి. అంతే కాకుండా కమలాబాయి చేయి విరిగి పోగా చెట్టు కొమ్మ విరిగి మీదపడిన సంఘటనలో రెండేళ్ల బాలునితోపాటు మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యా యి. ఉన్నట్లుండి ఒకే సారి గాలితో కూడిన వడగండ్ల వాన రావడంతో గిరిజనులు భయందోళనకు గురై పరుగులు తీశా రు. వారు పూర్తి నిరాశ్రయులు కావడంతో గ్రామానికి చెంది న ఎండీ అఫీజ్,ఎండీ.మైపూజ్ మాస్టార్ వారికి స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. అంతే కాకుండా వారికి బియ్యం ఇతర వస్తువులు అందజేశారు.