breaking news
Sujala sravanti
-
ఈ లైనింగ్ దండుకునేందుకే!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి సమీపంలోని కమ్మవారిపల్లి వద్ద హంద్రీృనీవా రెండో దశ ప్రధాన కాలువ 340 కిలోమీటర్ల నుంచి 341 కిలోమీటర్ల మధ్య స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) విధానంలో వేసిన లైనింగ్. చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని తయారు చేస్తారు. కాలువకు రాతి పొర ఉన్న ప్రదేశంలో మాత్రమే.. కాలువ సైడ్ స్లోప్స్ (ఏటవాలు ప్రాంతం) క్రమానుగతంగా ఉండేలా సరిచేసుకుని (సెక్షనింగ్ చేసి), ఆ తర్వాత 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత 38 ఎంఎం మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేయాలి. కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ సైడ్ స్లోప్స్ క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో మాత్రమే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తున్నారు. ఇంత అడ్డదిడ్డంగా లైనింగ్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని.. లైనింగ్ పనుల్లో ఇదో వింత అని ఇంజినీరింగ్ అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా, కాలువకు కనిష్ఠ స్థాయిలో నీటిని విడుదల చేసినా.. ఈ లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం ఖాయమని.. భారీ ఎత్తున ప్రజా ధనం వృథా కావడం తథ్యమని తేల్చి చెబుతున్నారు. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ బీఎస్సార్ ఇన్ఫ్రా మేనిజింగ్ డైరెక్టర్ బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దాంతో పనులు నిబంధనలకు విరుద్ధంగా, నాసిరకంగా చేస్తున్నా ప్రశ్నించడానికి వాటిని పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు సాహసించలేక పోతుండటం గమనార్హం. ఫలితంగా ప్రవాహ వేగం, ప్రవాహ సామర్థ్యం పెంచాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. హంద్రీృనీవా కాలువ లైనింగ్ పనుల్లో జరుగుతోన్న అక్రమాలకు ఇదో మచ్చుతునక. రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేస్తూ అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి పని స్వభావం (స్కోప్ ఆఫ్ వర్క్) మార్చేసి.. పనులు వేగంగా పూర్తి చేయాలనే సాకు చూపి.. అడ్డగోలుగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తున్నారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటర్‌కు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీృనీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లిస్తుండటంపై ఇంజినీరింగ్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి/పుట్టపర్తి: హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ), కుప్పం బ్రాంచ్ కెనాల్ (కేబీసీ) లైనింగ్ పనుల్లో నాణ్యత ఎంత అంటే నేతి బీరలో నెయ్యంతే! టెండర్లో అధిక ధరకు అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించిన ముఖ్యనేత.. ఆ కాంట్రాక్టు విలువలో పది శాతం రూ.196.89 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించి.. నీకింత నాకింత అంటూ పంచుకుతిన్నారు. ఆ తర్వాత ఆ పనులను కాంట్రాక్టర్లు నిబంధనలు తుంగలో తొక్కి నాసిరకం పనులు చేస్తున్నా,అధికారులు ప్రశ్నించలేకపోతున్నారు. కారణం..ఆ కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు అండదండలు ఉండటమేనని చెబుతున్నారు. భారీ వర్షం వచ్చినా, సామర్థ్యం మేరకు కాలువకు నీటిని విడుదల చేసినా నాసిరకంగా చేసిన లైనింగ్ కొట్టుకుపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కాలువకు సిమెంట్ లైనింగ్‌ను రైతులు వ్యతిరేకించినా, సీఎం పట్టించుకోలేదు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ నుంచి 400–500 కి.మీ వరకు 5 ప్యాకేజీలుగా విభజించి, ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లతో (రూ.520.75 కోట్ల విలువైన 3 ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్ సోదరుడి వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు.. రూ.451.44 కోట్ల విలువైన 2 ప్యాకేజీల పనులు చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు) అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 0–75వ కి.మీ వరకు పనులను 2 ప్యాకేజీల కింద విభజించి, ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు రూ.319.6 కోట్లతో అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు పనులను రూ.480.22 కోట్లతో ఆర్నెళ్లలో పూర్తి చేయాలనే నిబంధనతో సీఎం చంద్రబాబు సన్నిహితునికి చెందిన ఎన్సీసీ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు రూ.196.91 కోట్లతో అప్పగించారు.రూ.602 కోట్లు వెచ్చించి ఉంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను రూ.1,968.92 కోట్లతో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండటం వల్ల.. చిన్న పాటి వర్షం కురిసినా.. కాలువలో కనిష్ఠ స్థాయిలో ప్రవాహం ఉన్నా లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం ఖాయమని.. దాని కోసం వెచ్చించిన ధనమంతా వృథా అవుతుందని జల వనరుల శాఖలో సుదీర్ఘ కాలం సేవలు అందించి, పదవీ విరమణ చేసిన చీఫ్ ఇంజినీర్ ఒకరు చెప్పారు. లైనింగ్ చేస్తే భూగర్భ జల మట్టం అడుగంటిపోతుందని.. బోరు, బావులు ఎండిపోతే.. ఏళ్ల కొద్దీ సాగు చేస్తున్న పండ్ల తోటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ఆయన ఎత్తిచూపారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకుని, లైనింగ్ చేయకుండా పిల్ల కాలువలు తవ్వడానికి రూ.602 కోట్లు వెచ్చించి ఉంటే.. హంద్రీ–నీవా తొలి దశ, రెండో దశ కింద 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉండేదని మరో రిటైర్డు చీఫ్ ఇంజినీర్ చెప్పారు. ఆయకట్టుకు నీళ్లందించి ఉంటే రైతుల జీవన ప్రమాణాలు పెరిగేవని.. హంద్రీ–నీవా లక్ష్యం సాకారమయ్యేదన్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లైనింగ్ టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ప్రస్తావనే లేదు. టెండర్ పేర్కొన్న దానికి భిన్నంగా పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదం పొంది.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపి, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదిస్తే ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు నోరు మెదపలేక పోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ సైడ్ వాలు (స్లోప్)ను క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యాంగా అత్తెసరు మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చేసుకుంటూ ముఖ్య నేతతో కలిసి దోచుకుతింటున్నారు.లైనింగ్ పనులు జరుగుతున్నది ఇలా..⇒ ఇన్క్లెయిన్డ్ రోలర్‌తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచకుండా పొక్లెయిన్ బకెట్‌తో తూతూ మంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారు. దాంతో మట్టి ఎక్కడికక్కడ జారిపోతోంది. ⇒ గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్టుగా పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచే ఇప్పుడు కంకర తయారు చేస్తున్నారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో నుంచి ఇసుకను తెస్తున్నారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం), ఎం–20 (1 పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎం ఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేస్తున్నారు. ⇒ కాలువకు ఇరువైపులా మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మీకుల ద్వారా సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ చేస్తున్నారు. మట్టిజారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేస్తున్నారు. దీని వల్ల లైనింగ్ ఎక్కువ కాలం నిలబడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎం–25, ఎం–20 కాంక్రీట్‌లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుక పైకి తేలి స్పష్టంగా కనిపిస్తోంది. ⇒ క్షేత్ర స్థాయిలో అధికారులు పనులను సక్రమంగా పర్యవేక్షించడం లేదు. కొంత మంది అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నా, నాసిరకంగా ఇష్టారాజ్యంగా సబ్ కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. వాళ్లు పెద్ద కాంట్రాక్టర్లు.. వాళ్లను ప్రశ్నిస్తే మా ఉద్యోగాలు పోతాయని తన పేరును బహిర్గతం చేయొద్దంటూ ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో వాపోయారు. నాణ్యత, నియంత్రణ విభాగం అధికారులు ఆ పనుల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘సుజల స్రవంతి’ టెండర్లలో 17.5 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండు ప్యాకేజీల పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.17.50 కోట్లు ఆదా అయ్యాయి. మొదటి ప్యాకేజీ పనుల అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే 0.24 శాతం తక్కువకు వీపీఆర్–పయనీర్–హెచ్‌ఈఎస్ (జేవీ), రెండో ప్యాకేజీ పనులను 0.67 శాతం తక్కువకు గాజా–ఎన్సీసీ(జేవీ) సంస్థలు దక్కించుకున్నాయి. టెండర్ ప్రక్రియపై పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఎస్ఈ శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి నివేదిక పంపారు. ఈఎన్సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని ఎస్‌ఎల్‌టీసీ సోమవారం సమావేశమై టెండర్ ప్రక్రియను పరిశీలన అనంతరం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న ఆ సంస్థలకు వర్క్ ఆర్డర్ జారీ చేయనున్నారు. భారీ మొత్తంలో ఆదా పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. వద్ద నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.50 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. తొలి దశలో రూ.2,022 కోట్లతో పనులను ఇప్పటికే ప్రారంభించింది. ఇదే పథకంలో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో చేపట్టిన గ్రావిటీ కెనాల్లో 3.150 కి.మీ. నుంచి 23.200 కి.మీ. వరకూ కాలువ తవ్వకం, పాపయ్యపాలెం ఎత్తిపోతలతోపాటు 0 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకూ లిఫ్ట్ కెనాల్ పనులకు మొదటి ప్యాకేజీ కింద రూ.2,512.96 కోట్ల ఐబీఎంతో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్‌ను శనివారం అధికారులు తెరిచారు. రూ.2558.20 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.24 శాతం తక్కువకు అంటే రూ.2,507.04 కోట్లకు కోట్ చేసిన వీపీఆర్–పయనీర్–హెచ్‌ఈఎస్(జేవీ) సంస్థ ఎల్–1గా నిలిచింది. దాంతో మొదటి ప్యాకేజీలో ఖజానాకు రూ.5.93 కోట్లు ఆదా అయ్యాయి. లిఫ్ట్ కెనాల్ 40 కి.మీ. నుంచి 102 కి.మీ. వరకూ చేపట్టే పనులకు రెండో ప్యాకేజీ కింద రూ.1,722.39 కోట్ల ఐబీఎంతో టెండర్ పిలిచింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్‌ను శనివారం అధికారులు తెరిచారు. 1,763.73 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–గా నిలిచింది. అదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.67 శాతం తక్కువకు అంటే రూ.1,710.82 కోట్లకు కోట్ చేసిన గాజా–ఎన్సీసీ (జేవీ) పనులను దక్కించుకుంది. దాంతో ఖజానాకు రూ.11.57 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక బిడ్‌లో ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధరలతో పోల్చితే.. మొదటి ప్యాకేజీలో రూ.51.16 కోట్లు, రెండో ప్యాకేజీలో రూ.52.91 కోట్లు వెరసి రూ.104.07 కోట్లు ఆదా అయ్యాయి. -
ఉత్తరాంధ్ర శోభ- పోలవరం, సుజల స్రవంతి
సందర్భం రాష్ట్ర విభజన పెను సవా ళ్లను మిగిల్చింది. ఈ 13 జిల్లాల్లో 7 జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించి, రా యలసీమలో 4, ఉత్తరాం ధ్రలో 3 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజె క్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే పూర్తి చేయడం ఇందులో భాగ మే. కానీ జరుగుతున్న పరిణామాలు ప్రజానీకాన్ని నివ్వెరపరుస్తున్నాయి. పోలవరంతో ప్రయోజనాలు ఎన్నో: గోదావరి డెల్టా ఆయకట్టులో 10.5 లక్షల ఎకరాలకు 2 పంట లకు నీరు అందుతుంది. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో 7.2 లక్షల ఎకరాలలో కొత్తసాగుకు నీరందుతుంది. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటిని తరలించి 13 లక్షల ఎకరాల సాగు స్థిరీకరణకు దోహ దం చేయవచ్చు. విశాఖపట్నం ఇంకా 540 గ్రామా లకు తాగు, పారిశ్రామిక అవసరాలకు 25 టీఎంసీల నీరు ఇవ్వవచ్చు. 80 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి చేర్చడం ద్వారా, శ్రీశైలం నుంచి నీటి విడు దలను తగ్గించి, ఆదా అయిన 45 టీఎంసీల నీటిని తెలంగాణ, రాయలసీమలకు వినియోగించుకోవచ్చు. ఇంకా 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 308 టీఎంసీలు మనం వినియోగంలోకి తీసుకురా వచ్చు. తూర్పు గోదావరి జిల్లాలో 2.57 లక్షల ఆయ కట్టుకు, విశాఖజిల్లాలో 2.67 ఎకరాల ఆయకట్టుకు నీటిని; కాకినాడ, విశాఖలకు పోలవరం ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల సేద్యపు నీటి రంగం అవసరాలకు 7,214 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘సుజల స్రవంతి’ పథకానికి 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటి విడ తగా రూ. 50 కోట్ల నిధులు విడుదల చేశారు. టెం డర్లు పిలవడం కూడా జరిగింది. ఆ తరువాత వచ్చి న కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ దీనికి తిలోదకాలిచ్చింది. అయినా పోలవరం మనం పేర్కొన్న 7 జిల్లాలకు వరప్రసాదమే. ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు అం దిస్తుంది. కానీ నేడు చంద్రబాబు పోలవరానికి ఒక గ్రహణంలా మారారు. ఆయన ప్రభుత్వం పట్టిసీమ పథకాన్ని తలకెత్తుకున్నది. ఆయనకు పోలవరం చేపట్టడం ఇష్టంలేదు. బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించడం వల్ల కృష్ణానది వైపు ఉన్న ఆయకట్టు, రాయలసీమలకు సేద్యపు నీటి అవసరాలు నిలిచిపోతాయి. ఉమ్మడి రాష్ట్రంలో మన వనరులన్నీ హైదరాబాద్ చుట్టూ తిరిగాయి. ఇప్పుడు ఒక మహానగరంగా అభివృద్ధి అయ్యే లక్షణాలు విశాఖపట్టణానికి ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు పరిశ్రమలను నెల కొల్పి విశాఖను అభివృద్ధి చేయవలసిన సమయం లో పోలవరం ప్రాజెక్టును కనుమరుగు చేయడానికి ప్రయత్నించడం ఉత్తరాంధ్రకు ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ముఖ్యమంత్రి ఉరుకులూ, పరుగులూ రాజధాని దిశగానే సాగుతున్నాయి. అంటే రాజధాని యోచనను వ్యతిరేకించడం ఇక్కడ ఉద్దేశం కాదు. అభివృద్ధినంతా రెండు, మూడు జిల్లాలకే పరిమితం చేస్తే ఎంత ముప్పో విభజనతో చూశాం. కాబట్టి రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక హోదా కల్పిం చడానికి చంద్రబాబు కేంద్రంతో పోరాడే ప్రయత్నం చేయకపోవడం పుండు మీద కారం చల్లినట్టే. పోల వరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేపట్టి పూర్తి చేయడం ద్వారా ఆ ప్రాంతాల అభి వృద్ధికి పునాదులు వేసుకోవచ్చు. వనరులు ఉన్న ప్పటికీ అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురి కావడం ఎవ రికైనా ఆవేదన కలిగిస్తుంది. దీనినే ఉత్తరాంధ్ర సామాజిక కార్యకర్తలు, మేధావులు, నిపుణులు తీవ్రంగా పరిగణించాలి. ఈ ప్రాంతం పట్ల జరిగిన నిర్లక్ష్యం వల్లనే తీవ్రవాద ఉద్యమాలు ముందుకొ చ్చాయి. సహజ సిద్ధమైన పోరాట సంప్రదాయం కలిగిన ఉత్తరాంధ్ర ప్రజలు, చైతన్యవంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజానీకంలో చోటు చేసుకున్న అసంతృప్తిని గమనించి మరో విభ జన ఉద్యమానికి దోహద ం చేయాలి. ఇప్పుడిప్పుడే గ్రేటర్ రాయలసీమ వాసుల్లో ఇలాంటి భావనే చోటు చేసుకుంటున్నది. ప్రత్యేక తెలంగాణ వలెనే మరో ‘గ్రేటర్ రాయలసీమ’ మరో ‘ఉత్తరాంధ్రప్ర దేశ్’ ఉద్యమాలు రాకుండా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలు చేపట్టాలి. (ఉత్తరాంధ్ర నీటి సమస్యలపై రేపు విశాఖపట్నంలో విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్న సందర్భంగా) (వ్యాసకర్త ‘కదలిక ’సంపాదకుడు)