‘అర్జున’ అందుకున్న సింధు
న్యూఢిల్లీ: హైదరాబాద్ స్టార్ షట్లర్ పి.వి.సింధు... ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అందుకుంది.
ఐబీఎల్ ఫైనల్ కారణంగా ఆగస్టు 31న రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ అవార్డుల వేడుకకు సింధు గైర్హాజరైన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన సాయ్ గవర్నింగ్ బాడీ సమావేశం సందర్భంగా జితేంద్ర... అవార్డు ప్రతిమతో పాటు రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని ఆమెకు అందజేశారు.