breaking news
Srisailam-Hyderabad highway
-
శ్రీశైలం-హైదరాబాద్ హైవే బంద్!
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను తెలంగాణపై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌లోని ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద జాతీయ రహదారి రోడ్డు తెగిపోయింది. డిండి ప్రాజెక్టు అలుగుపోయడంతో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో 765 హైవేపై హైదరాబాద్- శ్రీశైలం వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ మీదుగా మళ్లించారు. వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి.కొట్టుకుపోయిన హైదరాబాద్- శ్రీశైలం నేషనల్ హైవే ఏమయినా ఇజ్జత్ ఉందా సోయి లేని సంజయ్? @bandisanjay_bjp లక్షల కోట్లు టోల్ వసూల్ చేసి మోడీ సర్కార్ కట్టే రోడ్ల నాణ్యత ఇట్లా ఉంది 👇👇pic.twitter.com/KRoYsnFWBY— MBR (@BharathMBNR) October 30, 2025రైల్వే ట్రాక్‌లపై వర్షపు నీరు..మరోవైపు.. ఎడతెరపి లేని వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా చిగురుటాకులా వణికింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో సుమారు రెండు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునిగింది. రైల్వే ట్రాక్‌పై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా, జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. ముందు జాగ్రత్తగా వేగం నియంత్రించి నెమ్మదిగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు.హైదరాబాద్ - శ్రీశైలం రాకపోకలు బంద్...హైదరాబాద్ శ్రీశైలం రోడ్డులో విపరీతమైన వాహనాల రద్దీ ఉంటుంది...వారందరికీ చేరే వరకు ఈ పోస్ట్ షేర్ చేయండిఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలోని హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకపోయిన నేషనల్ హైవే రోడ్ pic.twitter.com/wsY6AjyY3X— Bhaskar Reddy (@chicagobachi) October 29, 2025లోతట్టు ప్రాంతాలు జలమయం హుజూరాబాద్ డివిజన్లోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హుజూరాబాద్‌లోని డిపో క్రాస్ రోడ్ వద్ద గల కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. హుస్నాబాద్‌లో పలు దుకాణాలు, ఇండ్లలోకి వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణ వరద నీటితో కుంటను తలపించింది. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా వరంగల్‌లో పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. డోర్నకల్ రైల్వేస్టేషన్ జలమయం | #Dornakal #RailwayStation #Submerged #CycloneMontha pic.twitter.com/PjCJy5ENJK— Sakshi TV Official (@sakshitvdigital) October 29, 2025 -
యురేనియం అనుమతులపై నిరసన
నల్లమలలో శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై రాస్తారోకో మన్ననూర్(అచ్చంపేట): యురేనియం వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీలకు అనుమతులు ఇవ్వడంపై నాగర్‌కర్నూల్ జిల్లా పదర, అమ్రాబాద్ మండలాల నల్లమల ప్రజలు ఆందోళనబాట పట్టారు. శనివారం మన్ననూరు వద్ద శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై 3 గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కల్ముల నాసరయ్య, వైస్ ఎంపీపీ సంబు శోభ వెంకట రమణ మాట్లాడుతూ యురేనియం తవ్వ కాలతో 100 కిలోమీటర్ల వరకు రేడియేషన్ ప్రభావం ఉంటుందని, దీనివల్ల ప్రజలకు ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే అవకాశ ముందన్నారు. సీఎం కూతురు, ఎంపీ కవిత 2009లో నల్లమలను సందర్శించినప్పుడు ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా చెంచులకు అం డగా ఉండి డీబీర్స్‌కు అడ్డుకుంటామని చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఒక దశలో పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగింది. అమ్రాబాద్ సీఐ శ్రీని వాస్, ఎస్ఐ జాంగీర్ యాదవ్, ఈగలపెంట ఎస్ఐ కృష్ణయ్య.. మాజీ ఎమ్మెల్యేతోపాటు పలువురు నాయకులను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, మండు టెండను సైతం లెక్క చేయకుండా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళన కారు లకు జరిగిన స్వల్ప ఘర్షణలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివాజీతోపాటు మరి కొంతమంది అస్వస్థతకు గురయ్యారు.


