breaking news
Sri Rama maha yagam
-
ఘనంగా ముగిసిన శ్రీరామ మహాయఙ్ఞం
-
వైభవంగా శ్రీరామ మహాయజ్ఞం
భద్రాచలం: భద్రాద్రి శ్రీరామ మహాయజ్ఞంలో భాగంగా శుక్రవారం అత్యంత వైభవంగా అగ్నిప్రతిష్ట ప్రారంభమైంది. విశాఖపట్నం జిల్లా కొండకొప్పాక అష్టలక్ష్మీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామమహాయజ్ఞంలో అరుదైన ఘట్టానికి తెరలేచింది. యాగశాల ప్రవేశం చేసిన వేదపండితులు, అర్చకులు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. హరణితో(కర్రలతో చిలకటం ద్వారా) అగ్నిహోత్రం సృష్టించి, దానిని ప్రధాన హోమగుండంలో వేశారు. శ్రీమద్రామాయణం పుస్తకాలను తలపై ఉంచి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ అనే నినాదాలు ఆ ప్రాంగణంలో మార్మోగాయి. నిర్వాహకులైన పీతాంబరం రఘునాథాచార్య స్వామి చేతుల మీదుగా ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఆలయ ఈవో జ్యోతి, ఏఈవో శ్రావణ్ కుమార్ తదితరులకు కంకణధారణ చేశారు. యజ్ఞం తిలకించేందుకు తెలంగాణ, ఏపీల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.