breaking news
S.Ravi teja
-
రవితేజ, బాలచంద్ర ప్రసాద్ ముందంజ
ఆర్బీవీఆర్ఆర్ స్మారక చెస్ టోర్నీ ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాజా బహుదూర్ వెంకట్రామ్రెడ్డి(ఆర్బీవీఆర్ఆర్) స్మారక రాష్ట్ర సీనియర్ చెస్ టోర్నమెంట్లో తొలి రోజు ఎస్.రవితేజ,బాలచంద్ర ప్రసాద్‌రెడ్డి తొలి రౌండ్లో విజయాలను నమోదు చేసుకున్నారు. రాష్ట్ర చెస్ అసోసియేషన్(ఏపీసీఏ) ఆధ్వర్యంలో దోమలగూడలోని ఏవీ కాలేజిలో శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో ఎస్.రవితేజా(1) రాజా రిత్విక్(0)పై విజయం సాధించింది. కృష్ణతేజ(1) శ్రీరోహిత్(0)పై, బాలచంద్ర ప్రసాద్(1) మనీష్ చౌదరి(0)పై, జె.మల్లేశ్వర్రావు(1) వి.సాహితి(0)పై, చక్రవర్తిరెడ్డి(1) సి.హెచ్,లాస్య(0)పై గెలిచారు. అంతకు ముందు ఈ పోటీల ప్రారంభ వేడుకలకు రాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్. గోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ టి.అమర్‌కాంత్‌రెడ్డి, ఏపీసీఏ ఉపాధ్యక్షుడు మేజర్ కె.ఎ.శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.కన్నారెడ్డి, ఏవీ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ పి.యాదగిరిరెడ్డి, డాక్టర్ జి.జలంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండర్-9 బాలుర విభాగం: తొలి రౌండ్ ఫలితాలు: చైతన్య సాయి(1) అభినవ్ చంద్ర(0)పై, సాయి ప్రణవ్(1) అభిరామ్‌రెడ్డి(0)పై, వెంకట రఘునందన్(1) పంకజ్ దత్(0)పై గెలుపొందారు. అండర్-9 బాలికల విభాగం: సి.హెచ్.వైష్ణవి(1) కాత్యాయని దాట్ల(0)పై, నాగ విజయకీర్తి(1) హంసిక(0)పై, నాతుర బేతి(1) రోచిష్నరెడ్డి(0)పై, కె.జాహ్నవి(1) డి.మణుశ్రీ(0) ఎన్.సాత్విక(1) దాట్ల అనన్య(0)పై నెగ్గారు. -
సత్తాచాటిన కృష్ణ, రవితేజ
గుర్గావ్: అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు సీఆర్జీ కృష్ణ, ఎస్.రవితేజ సత్తాచాటారు. ఇక్కడి సన్‌సిటీ వరల్డ్ స్కూల్లో జరుగుతున్న ఈ పోటీల్లో ఇద్దరూ మూడున్నర పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ పోటీల్లో కృష్ణ (3.5)... భారత్‌కే చెందిన అంతర్జాతీయ మాస్టర్ ప్రసన్న రఘురామ్ (3.5)తో డ్రా చేసుకోగా, రవితేజ (3.5)... విక్రమ్‌జిత్ సింగ్ (3.5)తో గేమ్‌ను డ్రాగా ముగించాడు. మిగతా ఏపీ క్రీడాకారుల్లో చొల్లేటి సహజశ్రీ (2.5)... ఓమ్ బాత్రా (1.5)పై విజయం సాధించగా, తొషాలి (2)...శంతను (3) చేతిలో పరాజయం చవిచూసింది. మట్ట వినయ్ కుమార్ (2.5)... రాజేశ్ (3.5) చేతిలో, రామకృష్ణ (2)... గగునశ్వి మెరాబ్ (జార్జియా, 3) చేతిలో ఓటమి పాలయ్యారు. అభిలాష్ రెడ్డి (3)... పొంక్షే సారంగ్ (2)పై, దీప్తాంశ్‌రెడ్డి (3)... మోత పంకిత్ (2)పై, కార్తీక్ (3)... సిద్ధార్థ్ (2)పై విజయం సాధించారు. రాహుల్ శ్రీవాస్తవ్ (2)కు అరాధ్య గార్గ్ (3) చేతిలో పరాజయం ఎదురైంది. ఈ టోర్నీలో ఢిల్లీ ఆటగాడు సహజ్ గ్రోవర్ (4) నాలుగు విజయాలతో ఐదుగురితో కలిసి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానంలో ఏపీ ఆటగాళ్లు కృష్ణ, రవితేజ మూడున్నర పాయింట్లతో మరో 17 మందితో కలిసి రెండో స్థానంలో ఉన్నారు. ఈ టోర్నీలో ఇంకా ఆరు రౌండ్లు మిగిలున్నాయి.