breaking news
Sravanamasa
-
ధనకాంక్షతో "లక్ష్మీ"ని పూజిస్తాం! కానీ ఆ తల్లి ఏమంటుందో తెలుసా!
ఈ సమాజంలో బతకాలంటే "ధనం" కావాల్సిందే. "ధనం మూలం ఇదం జగత్" అని ఊరికే అనలేదు పెద్దలు. ధనం లేనిదే ఒక పూట కూడా గడవదు. అలాంటి ఈ తరుణంలో ప్రజలంతా తమకు తెలయికుండానే ధనకాంక్షతో మంచి చెడు అన్ని మర్చిపోతున్నారు. ధనవంతులు కావాలన్నా ఆరాటంతో తెగ పూజలు, వ్రతాలు చేసేస్తుంటారు. అవన్నీ చూసి లక్ష్మీ దేవి మందహాసంతో ఏమంటుందో వింటే..కంగుతినడం ఖాయం. మన పూజలు కాదనలేక ఆమె వస్తుందంటా..కానీ ఆ మాయలో పడి ఏమవుతున్నామో తెలుసా నన్ను బంధించి బలైపోకండి "ఓయి మానవులారా ! మీరందరూ నన్నెంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. నన్ను మీ ఇంటికి రమ్మని, ధనరాశులతో సిరులపంట పండించమని వేడుకొంటున్నారు, మీ ప్రార్ధన కాదనలేక నేను మీ ఇళ్ళకు వస్తూ మిమ్మల్ని భాగ్యవంతులుగా మారుస్తున్నాను. మీకు బంగళాలు కార్లు, తోటలు, మొదలైన సమస్త సౌకర్యాలు సమకూరుస్తున్నాను. ఆ తరువాత మీరు చేసే పనులే నాకు నచ్చటం లేదు, నన్ను మీ ఇనప్పెట్టెల్లో, బ్యాంకు లాకర్లలో, బంగారం రూపంలో బంధించాలని ప్రయతిస్తున్నారు. ఎల్లప్పుడూ నన్ను మీ బందీగా వుంచుకొని నా ద్వారా స్వర్గసుఖాలు అనుభవించాలని పథకాలు వేస్తున్నారు. నిజానికి మీ స్వరూపం ఏంటో మీకే తెలియదు! మీ అసలు స్వరూపం నాకు తెలుసుగానీ, నా అసలు స్వరూపం మీకు తెలియదు. మీ నిజ స్వరూపం కూడా మీకు తెలియదని నేను భావిస్తున్నాను. మీరు తల్లి గర్భంనుండి వచ్చేటప్పుడు ఒక్క పైసా కూడా తీసుకురారు. తిరిగి భూమిగర్భంలోకివెళ్ళేమరణయాత్రలో కూడా ఒక్క పైసాతీసుకుపోలేరు, రోజు మీ కళ్ళముందు చనిపోయే ఎందరెందరో కోటీశ్వరులను, జమీందారులను చూస్తూ కూడా, రేపు మన దుస్థితి కూడా అంతే కదా, అనే అసలు నిజాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ ఆశలకు, కోరికలకు హద్దు లేకుండా | పోతుంది. ఇది మీరు తెలుసుకోలేని మీ నిజ స్వరూపం. ఇకనాస్వరూపం గురించి చెబుతాను. నేను ఎవరి దగ్గర ఎప్పుడూ నిలకడగా వుండను. ఆ పరమేశ్వరుని లీలా వినోదం.. అది ధనానికి ఉన్న సహజగుణం. ఒకచోటి నుండి మరో చోటికి తరలి పోయే చంచలత్వమే నా ధర్మం. అది మిమ్మల్ని నన్ను సృష్టించిన ఆ పర్వమేశ్వరుని లీలా వినోదం. నన్ను బంధించాలని చూసిన ప్రతి వాణ్ణి, దొంగల ద్వారానో, దాయాదుల ద్వారానో, ఇన్ కంటాక్స్ వారి ద్వారానో కొల్లగొట్టించి నేను బయట పడుతుంటాను, అయితే దేవుడు నాకొక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటంటే నేను కొందరి దగ్గర ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాను. ఎక్కడ స్థిరంగా ఉంటానంటే.. అలా నేను ఎవరి వద్ద స్థిరంగా వుంటానంటే, “ఎవరు నా ధనకటాక్షంతో విర్రవీగకుండ, అహంకారులు కాకుండ, ధనమదంతో సాటి మానవులను హింసించకుండ.. తమ అవసరాలకు మించిన ధనాన్ని పుణ్యకార్యాలకు, దైవకార్యాలకు, ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తూ వుంటారో, వారిని మరింత కుబేరులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి వద్దనే నేను శాశ్వతంగా వుండిపోతాను. వారి కుటుంబాన్ని వెయ్యికళ్ళతో కాపాడుతుంటాను. ఇప్పుడు నా నైజం మీకు అర్థమైంది కాబట్టి నన్ను బంధించి బలైపోకుండా..నన్ను మంచి కార్యాలకు వినియోగించి జీవితాలను చరితార్థం చేసుకోమని సలహాలిస్తున్నాను. వింటే మీతో వుంటా - లేదంటే టాటా చెప్పి మరోచోటికి వెళ్లిపోతా.. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తాం? వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..) -
ముగిసిన శ్రావణమాసం ఉత్సవాలు
ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో శ్రావణమాసం ఉత్సవాలు శనివారం తెల్లవారు జామున ముగిశాయి. నెల రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆలయ కార్యనిర్వాహణాధికారి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో దేవాలయంలోని ధ్వజస్తంభానికి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఎల్లెల్సీ కాలువలో గంగ పూజను చేపట్టి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. – కౌతాళం -
శ్రావణం.. శుభకరం..
శ్రావణం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో అన్ని రోజూలూ శుభకరమే.. ఆదివారం భానుడికి, సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం అయ్యప్పకు, గురువారం దక్షిణామూర్తికి, శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజులు. శ్రావణమాసంలో ఆయా రోజుల్లో ఆయా దేవతలను పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. పూజలు, వ్రతాలు చేస్తారు. ఉపవాసాలుంటారు. ఈనెలలో మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, సూర్యషష్టి, వరలక్ష్మీవ్రతం, రాఖీపౌర్ణిమ, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి పర్వదినాలు వస్తాయి. శ్రావణ బహుళ అమావాస్య (పోలాల అమావాస్య)తో శ్రావణమాసం ముగుస్తుంది. ఈనెలలో దైవధ్యానంతో గడపాలని, దేవాలయాల్లో అర్చనలు చేయాలని వేదపండితులు సూచిస్తున్నారు. సోమవారం ముక్తిప్రదాత శివుడికి ప్రీతికరమైన రోజిది. సోమవారం శివుడిని పూజిస్తే శివకటాక్షాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన శివుడిని పంచామృతాలతో అభిషేకించి బిల్వపత్రం సమర్పిస్తే ఆయుష్షు పెరుగుతుందని, ఆరోగ్యం సిద్ధిస్తుందన్నది భక్తుల నమ్మకం. సోమవారం శైవ క్షేత్రాల్లో మహాన్యాస పూర్వక అభిషేకాదులు నిర్వహిస్తారు. మంగళవారం అభయమిచ్చే ఆంజనేయుడు.. సకల విఘ్నాలనూ తొలగించే విఘ్నేశ్వరుడు.. సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మణ్యేశ్వరుడు.. మంగళవారమే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో ఈ రోజు ఆయా దేవతలను ఆరాధిస్తే.. వారు శుభాలను ప్రసాదిస్తారన్నది భక్తుల విశ్వాసం. హనుమంతుడికి చందన లేపనం ఎంతో ఇష్టం. ఆయనకు చందన లేపనం చేసి, తెల్ల జిల్లేడు పూలు, తమలపాకులు, మినప గారెల మాలతో అలంకరించి, పూజిస్తే శుభాలు కలుగుతాయని అర్చకులు పేర్కొంటున్నారు. విఘ్నేశ్వరుడికి అభిషేకం, ఎర్రని పూలతో అర్చన చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే కుజదోష నివారణ అవుతుందని వేద పండితులు పేర్కొంటున్నారు. బుధవారం హరిహర సుతుడైన అయ్యప్పను బుధవారం కొలుస్తారు. శ్రావణ బుధవారాల్లో అయ్యప్పపూజ విశేష ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతున్నారు. సర్వకార్య అనుకూలత, శివకేశవుల కటాక్షం పొందేందుకు అయ్యప్పకు అభిషేకం చేయాలని సూచిస్తున్నారు. అటుకులు, బెల్లం కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అయ్యప్ప అనుగ్రహం పొందవచ్చంటున్నారు. గురువారం ఈ రోజు దక్షిణామూర్తిని, సాయిబాబాను కొలుస్తారు. అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పిస్తే దక్షిణామూర్తి స్వామివారు సంతృప్తిచెందుతారని, పచ్చి శెనగల దండను సమర్పిస్తే కరుణా కటాక్షాలను వర్షిస్తాడని చెబుతారు. ఈ పూజలతో విద్యార్థుల్లో మేధోసంపత్తి ఇనుమడిస్తుందని, వాక్శుద్ధి ప్రాప్తిస్తుందని పేర్కొంటున్నారు. శుక్రవారం శ్రావణ శుక్రవారం వ్రతమాచరి స్తే అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసం లో ప్రతి శుక్రవారం కుంకుమార్చన, ఎర్రని పుష్పాలతో కలిపి అల్లిన మల్లెపూల మాలను అమ్మవారికి సమర్పించడం అత్యంత శుభకరం. మంగళగౌరి వ్రతం, మహాలక్ష్మి వ్రతం ఆచరించేవారికి శ్రావణ శుక్రవారం విశిష్టమైనది. ఈ వ్రతాలు ఆచరిస్తే రుణవిమోచన జరిగి లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. శనివారం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని కొలిస్తే కోరిన వరాలిస్తాడన్నది భక్తుల విశ్వాçÜం. ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం. స్వామివారికి పుష్పార్చన, తులసీదళాల మాల సమర్పిస్తే శుభం కలుగుతుందని పండితులంటున్నారు. ఆదివారం ప్రత్యక్ష భగవానుడు ఆదిత్యుడికి ప్రీతికరమైన రోజిది. సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆయనకు భక్తితో నమస్కరిస్తే కోరిన కోరిక లు తీరుస్తాడని, ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. నాగుల పంచమి సర్వదోషాలు, సర్పదోషాలు తొలగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. మహిళలు, యువతులు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో పుట్టలలో పాములకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. వెండితో నాగప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు. పుట్టలో పాలు పోసి వచ్చాక సోదరీమణులు సోదరులకు పుట్ట నుంచి తీసుకువచ్చిన పాలతో కళ్లను కడుగుతారు. సోదరులు సోదరీమణుల కాళ్లకు మొక్కి ఆశీస్సులు పొందుతారు. మంగళగౌరి వ్రతం ్రÔ>వణ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం జరుపుకుంటారు. సంపద, సౌభాగ్యాల కోసం స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహానంతరం మొదటి సంవత్సరం పుట్టింట్లో, తర్వాతి నాలుగేళ్లు మెట్టింట్లో ఈ వ్రతాన్ని ఆచరించాలని వేద పండితులు చెబుతున్నారు. వివాహ యోగాన్ని అర్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించేవారి కోరిక ఈడేరుతుందన్నది భక్తుల నమ్మకం. పసుపుతో, బంగారం, వెండితో గౌరమ్మను చేసి పూజిస్తే సుఖసంపదలు, ధనదాన్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. పేదలు మొదలు సంపన్నుల వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తయిదువులకు పసుపు, కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు. వరలక్ష్మీవ్రతం నిత్య సౌభాగ్యం కోసం మహాలక్ష్మిని ప్రార్థిస్తూ సుహాసినులు చేసే వ్రతమిది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుతారు. రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమిని రాఖీపౌర్ణమి, రక్షా బంధన్, జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. సోదరులకు ఆయురారోగ్యా లు, ఐశ్వరాలు ప్రాప్తించాలని ప్రార్థిస్తూ అక్కాచెల్లెళ్లు రక్షలు కడతారు. యజ్ఞోపవీత ధారణకు అధికారం ఉన్న ప్రతి వ్యక్తి ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు. శ్రీకృష్ణాష్టమి శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీ కృష్ణ జయంతిని జన్మాష్టమిగా జర‡ుపుకుంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున పల్లె, పట్టణం తేడా లేకుండా శ్రీకృష్ణుడిని పూజించి, ఉట్టి కొడతారు. చిన్నారులను గోపికలుగా, కృష్ణులుగా అలంకరిస్తారు. పోటీలు కూడా నిర్వహిస్తారు. -
నేడు శివచార్యమహా స్వామికి పాదపూజ
నారాయణఖేడ్: శ్రావణమాస అనుష్టాన కార్యక్రమంలో భాగంగా నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగద్గురు శ్రీ భీమశంకర లింగ శివాచార్య మహాస్వామి సోమవారం కల్హేర్ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాలోని కేతకీ సంగమేశ్వర దేవాలయానికి రానున్నారని, ఈ సందర్భంగా పాదపూజ, ఆశీర్వచనం, ఆహ్వాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు జంగమ సమాజం నారాయణఖేడ్ తాలూకా అధ్యక్షుడు సిద్దయ్యస్వామి తెలిపారు. ఆదివారం నారాయణఖేడ్‌లో జగద్గురు భీమశంకర లింగ శివాచార్య మహాస్వామి అనుష్టాన బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాజం సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని జంగమ సమాజం సభ్యులంతా విధిగా కార్యక్రమంలో పాల్గొని పాదపూజ విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 3వ తేదీనుంచి సెప్టెంబర్ 2వ తేదీవరకు హైదరాబాద్‌లోని శంకర్‌మఠ్, బిచ్కుంద సంస్థానమఠ్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో వీరశైవులంతా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఖేడ్ మండలశాఖ అధ్యక్షుడు ప్రవీణ్‌స్వామి, ప్రధాన కార్యదర్శి రేవణయ్య స్వామి, నరేష్‌స్వామి, జగదీశ్వర్ స్వామి, మన్మథకిషోర్, సిద్దయ్యస్వామి, విజయ్‌కుమార్ స్వామి, శివకుమార్ స్వామి, పర్వయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.