breaking news
sportive
-
Kanala hindola: ఆటలకు మానసిక బలం
ఆటల్లో ఒకరు గెలిస్తే మరొకరు ఓడాలి. గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉండగలిగేవారు స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నావారు. కాని అందరూ అలా ఉండరు. ఆటల్లో రాణించాలంటే వారిని ఓటమి భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రత్యర్థి గురించి ఆందోళనలు ఉంటాయి. చిన్నపిల్లల దగ్గరి నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకూ ఈ ఒత్తిడి తప్పించుకోని వారు ఉండరు. మరి వీరికి సాయం? హిందోళ వంటి స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ను కలవడమే. ‘మైండ్ లీడ్’ అనే ప్రోగ్రామ్ ద్వారా ఆటగాళ్ల ఒత్తిడిని తొలగిస్తూ వారికి అవసరమైన మానసిక బలం అందిస్తోంది హైదరాబాద్ వాసి హిందోళ. ‘స్పోర్ట్స్ సైకాలజీ అనేది ఒకటుంటుందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. దాని అవసరం ఏముందిలే అనుకోవచ్చు. కానీ ఈ రంగంలో ఈ సైకాలజీ అవసరం ఎంతో ఉంది’ అంటోంది హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న హిందోళ. అందుకు డియర్ కామ్రెడ్‌లోని ఒక సీన్‌ను ఉదాహరిస్తూ.. ‘లిల్లీ క్రికెటర్‌గా రాణిస్తున్న అమ్మాయి. రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. మంచి నైపుణ్యం ఉన్న అమ్మాయి సడెన్‌గా డిప్రెషన్ బారిన పడుతుంది. ఎవరికీ అర్థం కాదు. ఎవరూ అర్థం చేసుకోలేరు. క్రికెట్టే లోకంగా బతికిన ఆ అమ్మాయి మూడేళ్లపాటు మానసికంగా ఒంటరైపోతుంది. ఆసుపత్రి పాలైన ఆ అమ్మాయిని హీరో వచ్చి ఆమెను మానసిక వేదన నుంచి బయటికి తీసుకొస్తాడు. అందరి జీవితాల్లోనూ అలాంటి హీరోలు ఉండకపోవచ్చు. కానీ, మానసిక స్థైర్యం ఇవ్వగలిగేవాళ్లు ఉండాలి. ఇటీవల తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడేది. సడెన్‌గా అకాడమీకి రావడం మానేసింది. ఆ స్పోర్ట్స్ అకాడమీకి సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న నేను ఏమైందని తెలుసుకోవడానికి వారి తల్లిదండ్రులను సంప్రదించాను. తనను కష్టపెడుతున్న సమస్యలు ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది. తోటి వారి నుంచి వస్తున్న కామెంట్స్ ఆమెను ఆ ఆట నుంచి తప్పుకునేలా చేశాయి. ఈ విషయంపై కొన్నిరోజుల పాటు చేసిన కౌన్సెలింగ్ ఆమెలో మార్పు తీసుకువచ్చింది. లేదంటే, ఇదే ప్రభావం ఆమె చదువుమీద ఆ తర్వాత తన కెరియర్ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి. అవి కోచ్‌ల ద్వారా కావచ్చు, తోటి క్రీడాకారుల ద్వారా కావచ్చు, ఆత్మన్యూనత కావచ్చు, మరేవిధమైన మానసిక సంఘర్షణ అయినా కావచ్చు. ఇలాంటప్పుడు స్పోర్ట్స్ సైకాలజిస్టుల మద్దతు అవసరం అవుతుంది’ అని వివరించింది ఈ మైండ్లీడ్ ఛాంపియన్. అకాడమీలో సైకాలజిస్ట్‌గా.. తను చేస్తున్న వర్క్స్, ప్రణాళికల గురించి వివరిస్తూ – ‘బెంగళూరులోని పదుకొనే ద్రావిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్’లో పనిచేస్తున్నాను. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్స్తోనూ మాట్లాడుతుంటాను. దీంతో ఏ స్థాయిలో స్పోర్ట్ సైకాలజీ అవసరం అనేది మరింత క్షుణ్ణంగా అర్ధమవుతుంది. చాలామంది క్రీడలలో మానసిక అంశాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ పక్కన పెట్టేస్తారు. మన దేశంలో అయితే చాలా వరకు దీనిని విస్మరిస్తుంటారు. అందుకే, క్రీడాకారులందరికీ మానసిక శిక్షణను అందుబాటులో ఉంచాలని ఆన్లైన్లో మైండ్లీడ్ ప్రోగ్రామ్ ద్వారా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను. బలమైన స్థితి క్రీడలకు మానసిక బలం అవసరమని విదేశీయులకు బాగా తెలుసు. అందుకే వారు ప్రతి పోటీలో స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ల గైడెన్స్ తప్పక తీసుకుంటారు. మన దేశంలో కూడా దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఇంకా రకరకాల భావజాలాలు ఉన్నాయి. అమ్మాయిలను ఓ స్థాయి వరకే క్రీడలకు పరిమితం చేస్తుంటారు. కుటుంబం, బయట, అకాడమీ, స్కూల్, కాలేజీ.. ప్రతిచోటా వెనక్కి లాగడానికే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విధానంలో మార్పులు తీసుకురావడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాను. దీని ద్వారా అథ్లెట్లు, కోచ్‌లు, బృందాలు, తల్లిదండ్రులకు, సహాయక సిబ్బందికి వినూత్నమైన విధానంలో మానసిక శిక్షణతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాను. రాహుల్ ద్రావిడ్‌తో... ఈ భిన్నమైన కోర్సును ఎంచుకున్నప్పుడు మా అమ్మ మాలతి, నాన్న సుధాకర్ల మద్దతుగా నిలిచారు. వారి వల్లే ఈ రంగంలో మరింతగా కృషి చేయగలుగుతున్నాను. ఈ మైండ్ లీడ్ ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ కాలేజీలలో వర్క్‌షాప్స్ నిర్వహించబోతున్నాను. గ్రామీణ స్థాయి క్రీడాకారులలోనూ మానసిక చైతన్యం నింపే దిశగా కృషి చేస్తున్నాను’ అని వివరించింది ఈ యువ స్పోర్ట్స్ సైకాలజిస్ట్. ఆటలు పరిచిన బాట ‘చిన్నప్పటి నుంచి నాకు ఆటల్లో ఆసక్తి ఎక్కువ. బహుశా కేంద్రీయ విద్యాలయంలో చదవడం, అక్కడ అన్ని ఆటల్లో పోటీపడటం వల్ల క్రీడలు నా జీవితంలో కీలకమయ్యాయి. నా దృష్టి ఎక్కువగా బ్యాడ్మింటన్‌పై ఉండేది. అదే నన్ను ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్‌కి పరిచయం చేసింది. ఈ రంగంలో కొత్త కొత్త వ్యక్తులను కలిశాను. గెలుపు కోసం ప్రయత్నించేవారితో కలిసి ఉండటం వల్ల ప్రతిరోజూ నన్ను నేను కొత్తగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇందులో ఉండే చేదు అనుభవాలు, పంచుకున్నవారి వేదనలు.. ఇవన్నీ నా కెరియర్ని డిసైడ్ చేసుకునేలా చేశాయి. అందుకే, స్కూల్ చదువు పూర్తవగానే స్పోర్ట్స్ సైకాలజీ దిశగా అడుగులు వేశాను. దీనికోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్ నుండి సైకాలజీ, జర్నలిజం అండ్ ఉమన్ స్టడీస్‌లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత స్పోర్ట్స్ సైకాలజీలో మాస్టర్స్ చేయడానికి మణిపూర్ వెళ్లాను. ఇక్కడే క్రీడలలో మైండ్‌ఫుల్‌నెస్‌పై ప్రయోగాత్మక పరిశోధన చేశాను. భారతదేశంలోని అథ్లెట్ల కోసం సొంతంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాను.’ కె.హిందోళ, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి -
జర్నలిజం స్ఫూర్తిదాయకంగా ఉండాలి
ప్రస్తుతం సంచలనాత్మక జర్నలిజం కొనసాగుతోంది పీఐబీ నిర్వహించిన వార్తాలాప్ వర్క్‌షాప్‌లో జిల్లా జేసీ దివ్య ఖమ్మం గాంధీచౌక్: జర్నలిజం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ప్రజలను చైతన్య పరిచేదిగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.దివ్య పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం గాంధీచౌక్ బడ్జెట్ హోటల్లో పత్రికా సమాచార కార్యాలయం నిర్వహించిన వార్తాలాప్ మీడియా వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. పూర్వం జర్నలిజం ద్వారా ప్రజలకు మంచి సమాచారం అందేదని, చైతన్యవంతమైన జర్నలిజం ఉండేదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పత్రికలు తమ పాత్రను పోషించాయన్నారు. రానురాను అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, గత కొద్ది కాలంగా సంచలనాత్మక జర్నలిజం కొనసాగుతోందన్నారు. ఈ సందర్భాల్లో తప్పుడు సమాచారం కూడా ప్రజల్లోకి వెళుతుందని, దీంతో ఇబ్బందులు చోటుచేసుకుంటాయన్నారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించటానికి జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. ఆక్షేపించే విధంగా వార్తాలను రాయటంతోపాటు, ఆ వార్త ద్వారా మార్పుకు బాటలు వేసే విథంగా కథనాలు ఉండాలన్నారు. పత్రికా సమాచార కార్యాలయం(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీ.జే సుధాకర్ మాట్లాడుతూ సమాజంలో ప్రధాన భూమిక మీడియాదేనని, సమాజంలో గొప్ప వాళ్లంతా జర్నలిస్టులు, న్యాయవాదులేనన్నారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, తిలక్ ఇలా చూస్తూ పోతే అనేక మంది జర్నలిస్టులు, న్యాయవాదులే ఉన్నారన్నారు. పీఐబీ డైరెక్టర్ పి.విజయ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్లు, అధికారులు, వివిధ పత్రికల సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు స్టీఫెన్ సన్, రమేష్, గోవింద రెడ్డి, శివశంకర్ తదితరులు వివిధ అంశాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. -
అబ్దుల్‌కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి
రామన్నపేట కలలు కనండి వాటిని సాకారం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం చెప్పిన మాటలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని శ్రీహిందూ కళాశాలల చైర్మన్ డాక్టర్ పనకంటి భాస్కర్‌రావ్ తెలిపారు. ఏపీజే అబ్దుల్‌కలాం ప్రథమ వర్ధంతిని బుధవారం మండలకేంద్రంలోని శ్రీహిందూడిగ్రీ జూనియర్కళాశాలల్లో, క్రిష్ణవేణిహైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన మేధాశక్తితో దేశఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత కలాంకు దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.చంద్రశేఖర్, వైస్‌ప్రిన్సిపాల్ వి.దేవేందర్‌రావ్, సయ్యద్, సుధాకర్, నర్సింహ, శ్రీను, వెంకటేష్, మహేష్, ప్రభాకర్, జా‘నేశ్వరి, ముజాహిద్, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, మమత, శాంతి, క్రిష్ణవేణిహైస్కూలు ప్రధానోపాధ్యాయులు మణి, నరేందర్‌రెడ్డి, రమేష్, రాంబాబు, రశీద్, నరేష్‌లు పాల్గొన్నారు.