breaking news
special toilet
-
ట్రాన్స్‌జెండర్స్‌కు శుభవార్త: ప్రధాని కానుక
వారణాసి: స్త్రీ, పురుషులకు అంటూ ప్రత్యేక టాయిలెట్స్ ఉండగా ట్రాన్స్‌జెండర్స్ ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పడేవారు. దీనిపై సినిమాల్లో కూడా చాలా కామెడీ సీన్స్ పండాయి. అవి నవ్వుకునేందుకు బాగానే ఉన్నా ట్రాన్స్‌జెండర్స్‌కు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు. ఇకపై వారికి అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా టాయిలెట్‌ను నిర్మించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఈ టాయిలెట్ నిర్మించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని కామాచ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ టాయిలెట్‌ను అధికారులు నిర్మించారు. రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ టాయిలెట్‌ను గురువారం మేయర్ మృదుల జైస్వాల్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోనే ఇది మొదటి ట్రాన్స్‌జెండర్ టాయిలెట్ అని మేయర్ తెలిపారు. వారికి అవసరమైన ఇతర ప్రాంతాల్లో కూడా టాయిలెట్స్‌ను నిర్మించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ టాయిలెట్లు ట్రాన్స్జెండర్ల కోసం మాత్రమేనని.. ఇతరులు వినియోగించరాదని వారణాసి మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రతి విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మూడో వర్గానికి మరో నాలుగు టాయిలెట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మరుగుదొడ్డి నిర్మాణం పట్ల ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారణాసి మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇన్నాళ్లు తాము పడ్డ ఇబ్బందులు ఇకపై తొలగిపోనున్నాయి. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా మా కోసం టాయిలెట్స్ నిర్మించాలి’ అని ట్రాన్స్‌జెండర్ రోహణి విజ్ఞప్తి చేశారు. -
పీఎం సందేశ స్ఫూర్తి
జుగ్గీల్లో కాలం వెళ్లదీసే బాలికలతోపాటు బడికి వెళ్లే ఆడపిల్లలకు టాయిలెట్ కష్టాలకు తెరపడనుంది. ఇటీవలి పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని ఇచ్చిన సందేశం మేరకు నగరంలో ఈ వసతి కల్పించే దిశగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ముందుకు సాగనుంది. సాక్షి, న్యూఢిల్లీ:అన్ని పాఠశాలలు, జుగ్గీలకు త్వరలో టాయిలెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అన్ని పాఠశాలలు, జుగ్గీలలో ఈ వసతి ఉండాలంటూ 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ సందేశ స్ఫూర్తితో దేశంలోని అన్ని ప్రాంతాల కంటే ముందే నగరంలో నిజం చేయడానికి రాష్ర్ట భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాఖ నడుం బిగించింది. అక్టోబర్ రెండో తేదీకంటే ముందే నగంరలోని272 ప్రభుత్వ పాఠశాలలు, 272 జుగ్గీలలో ఆడపిల్లల కోసం ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ఏటీఎంలతో తాగునీటిని అందించనుంది.ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను రూపొందించి సమర్పించాలంటూ మంగళవారం జరగనున్న సమావేశంలో కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆదేశించనుంది. చింది. కాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు తమ నిధుల నుంచి వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేలకు రూ. 4 కోట్లు, కౌన్సిలర్లకు రూ. కోటి అభివృద్ధి నిధుల కింద అందుతాయి. నగరంలో బిజెపికి 29 ఎమ్మెల్యేలు, 165 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నగరంలోని కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో కనీసం ఒక పాఠశాలలో, ఒక జుగ్గీలలో బాలికల కోసం ప్రత్యేకంగా మరుగుగొడ్లను నిర్మించాలని, దీంతోపాటు ఓ వాటర్ ఏటీఎంను ఏర్పాటు చేయాలని ఆదేశించనుంది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు లేని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటుచేసే పనిని ఎంపీలకు అప్పగించారు. ఢిల్లీలోని మొత్తం లోక్‌సభ స్థానాలు తమవే అయినందువల్ల కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పూనుకుంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకగా టాయిలెట్లను ఏర్పాటు చేయొచ్చని బీజేపీ భావిస్తోంది.