breaking news
South Africa tour of India
-
సౌతాఫ్రికాతో సిరీస్‌ల కోసం భారత జట్టు ప్రకటన
వచ్చే నెల (జూన్) 13 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే మల్టీ ఫార్మాట్ల సిరీస్‌ల కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (మే 30) ప్రకటించారు. భారత పర్యటనలో సౌతాఫ్రికా ఓ వన్డే వార్మప్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, ఏకైక టెస్ట్, మూడు టీ20లు ఆడనుంది.మూడు ఫార్మాట్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియా సారధిగా ఎంపిక కాగా.. అన్ని ఫార్మాట్లలో స్మృతి మంధన హర్మన్‌కు డిప్యూటీగా వ్యవహరించనుంది. జెమీమా రోడ్రిగెజ్, పూజా వస్త్రాకర్లను మూడు ఫార్మాట్లలో జట్టుకు ఎంపికైనప్పటికీ.. ఫిట్నెస్ పరీక్ష నెగ్గితేనే వారికి తుది జట్టులో అవకాశం ఉంటుంది.భారత పర్యటనలో సౌతాఫ్రికన్లు తొలుత బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్‌తో వన్డే వార్మప్ మ్యాచ్ ఆడతారు. ఈ మ్యాచ్ జూన్ 13న బెంగళూరు వేదికగా జరుగనుంది. అనంతరం సౌతాఫ్రికా-భారత్‌లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. జూన్ 16న తొలి వన్డే, 19న రెండవది, 23న మూడో వన్డే జరుగుతుంది. మూడు మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ అనంతరం భారత్-సౌతాఫ్రికాలు ఏకైక టెస్ట్‌లో తలపడతాయి. చెన్నై వేదికగా జూన్ 28 నుంచి జులై 1 ఈ మ్యాచ్ జరుగనుంది. దీని తర్వాత ఇరు జట్లు టీ20 సిరీస్‌లో తలపడతాయి. జులై 5, 7, 9 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. టీ0 సిరీస్ మొత్తానికి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), ఉమా చెత్రి (వికెట్‌కీపర్), దయాళన్ హేమలత, రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ప్రియా పునియాఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), ఉమా చెత్రి (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ *, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియాటీ20 సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, ఉమా చెత్రి (వికెట్‌కీపర్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), జెమిమా రోడ్రిగ్స్ *, సజన సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, ఆశా శోభన, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డిస్టాండ్బై: సైకా ఇషాక్ -
సెప్టెంబర్‌లో భారత్‌కు రానున్న దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఇదే..!
ఈ ఏడాది చివరి వరకు వరుస సిరీస్‌లతో బిజీబిజీగా ఉన్న టీమిండియా షెడ్యూల్లో మరో సిరీస్ వచ్చి చేరింది. టీ20 ప్రపంచకప్ 2022కు ముందు దొరికిన కొద్ది గ్యాప్‌లో బీసీసీఐ ఓ పరిమత ఓవర్ల సిరీస్‌ను సెట్ చేసింది. సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనున్నట్లు బీసీసీఐ బుధవారం కన్ఫర్మ్ చేసింది. ఈ పర్యటనలో సఫారీలు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్నారు. సెప్టెంబర్ 28న టీ20 సిరీస్ మొదలు కానుండగా... అక్టోబర్ 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. భారత పర్యటనలో దక్షిణాఫ్రికా షెడ్యూల్.. సెప్టెంబర్ 28- తొలి టీ20 (తిరువనంతపురం) అక్టోబర్ 2- రెండో టీ20 (గౌహతి) అక్టోబర్ 4- మూడో టీ20 (ఇండోర్) అక్టోబర్ 6- తొలి వన్డే (లక్నో) అక్టోబర్ 9- రెండో వన్డే (రాంచీ) అక్టోబర్ 11- మూడో వన్డే (ఢిల్లీ) Check out the #INDvSA home series schedule. 👌#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq — BCCI (@BCCI) August 3, 2022 చదవండి: IND VS PAK: మౌకా.. మౌకా యాడ్‌కు మంగళం పాడిన స్టార్ స్పోర్ట్స్.. కారణం అదేనా..! -
భారత్ టూర్ కి ముగ్గురు స్పిన్నర్లు
భారత్ లో పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. టెస్టులు, వన్డేలు, టీ20 లకు వేరు వేరుగా టీమ్ లను ఎంపిక చేసినట్లు సెలక్షన్ కన్వీనర్ లిండా తెలిపారు. భారత్ పర్యటనకు ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లను ఎంపిక చేసినట్లు వివరించారు. భారత్ లోని టర్నింగ్ పిచ్ లపై బౌలింగ్ సమ తూకంగా ఉండేందుకే.. ముగ్గురు స్పిన్నర్ల ఆప్సన్ ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. సైమన్ హామర్ కి తోడుగా.. శ్రీలంక పై సత్తాచాటిన ఇమ్రాన్ తాహిర్, డానేలను భారత పర్యటకు ప్రొటీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. టెస్ట్ టీమ్ కు షమీమ్ ఆమ్లా, వన్డే జట్టుకు ఏ బీ డివిలీర్స్, టీ20 జట్టుకు ఫఫ్ డు ప్లెసిస్ లు కెప్టెన్ లు గా వ్యవహరించనున్నారు. రానున్న టీ20 వాల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని టీమ్ ఎంపిక జరిగినట్లు తెలిపారు. టీ20ల్లో ఇమ్రాన్ తమ ట్రంప్ కార్డ్ అని లిండా చెప్పాడు. రెండు నెలల పైగా జరిగే ఈ టూర్ లో ప్రోటీస్ టీమ్ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. తర్వాత మూడు టీ 20లు, 5 వన్డేలు, 4 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.