breaking news
Soundarya (25)
-
బాలకృష్ణ, సౌందర్య నటించిన నర్తనశాల రిలీజ్
నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకత్వం వహించాలనుకున్న 'నర్తనశాల' సినిమా మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. కేవలం ఈ సినిమాను 17 నిమిషాల పాటు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. దాంతో సినిమా షూటింగ్‌ను బాలకృష్ణ పక్కన పెట్టేశారు. అయితే అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బుధవారం 12.30 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో అర్జునుడు, కృష్ణుడు, ధుర్యోధనుడిగా బాలయ్య త్రిపాత్రాభినయం చేయాలనుకున్నారు. అయితే అనుకోని విధంగా ఏప్రిల్ 17, 2004న ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వెళుతూ నటి సౌందర్య ప్రమాదానికి గురై చనిపోయింది. ఆ ప్రమాదంలోనే ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా సజీవ దహనమయ్యిన విషయం తెలిసిందే. దీంతో నర్తశాల మరుగున పడిపోయింది. తాజాగా ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇన్నాళ్లకు ఓటీటీ ద్వారా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను విడుదల చేయబోతున్నారు. చదవండి: ‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు! -
పరీక్ష రాసేందుకు వెళుతూ..
భర్త కళ్ల ముందే భార్య దుర్మరణం వికారాబాద్ రూరల్: వివాహమైన తర్వాత కూడా ఉన్నత చదువులు చదవాలనుకుంది. అదే తపనతో డిగ్రీలో చేరింది. గురువారం పరీక్ష రాసేందుకు భర్తతో కలసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఆమెను కబళించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పూడూరు మండలం కడ్మూర్‌కు చెందిన చంద్రయ్యకు మూడేళ్ల క్రితం మేడిపల్లికి చెందిన సౌందర్య(25)తో వివాహమైంది. వీరు వికారాబాద్‌లోని సాకేత్‌నగర్‌లో ఉంటున్నారు. చంద్రయ్య మర్పల్లి మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా.. సౌందర్య పట్టణంలోని సరస్వతీ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం డిగ్రీ మొదటి సంవత్సరం చివరి పరీక్ష ఉండడంతో చంద్రయ్య ఆమెను బైక్‌పై కూర్చోబెట్టుకుని పరీక్ష కేంద్రానికి బయల్దేరాడు. మార్గమధ్యలో వికారాబాద్ వంతెనపై వేగంగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌందర్య అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రయ్యకు గాయాలయ్యాయి. వీరికి రెండేళ్ల కూతురు డింపు ఉంది. కళ్ల ముందే భార్య చనిపోవడంతో చంద్రయ్య విలపించాడు.