breaking news
Someswara Swamy Temple
-
గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!
ఆలయంలో వివాహం చేసుకుంటుంటారు చాలామంది. అలాగే కొన్ని ఆలయాలు సాముహిక పెళ్లిళ్లను జరిపిస్తుంటాయి కూడా. మరికొందరు మొక్కుల రీత్యా కూడా ఆలయంలో వివాహం చేసుకుంటారు. అలాంటిది వేల ఏళ్ల నాటి పురాతన ఆలయం ఆకస్మికంగా వివాహాలను నిషేధించాలని గట్టి నిర్ణయం తీసుకుంది. అంతేగాదు ఆలయ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా అక్కడ ప్రభుత్వానికి తెలియజేసింది కూడా. అందుకు సుప్రీం కోర్టు కూడా సమ్మతించడం విశేషం ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే విస్తుపోతారు.బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటి, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ చాలామంది జంటలు వివాహాలు చేసుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారం కూడా. అలాంటిది గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వివాహ వేడుకులను నిలిపివేసింది. ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ ఆలయంలో వివాహాలను నిషేధించడం భక్తులలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చరిత్రసోమేశ్వరస్వామి ఆలయం సుమారు 12వ-13వ శతాబ్దాల నాటిదిగా భావిస్తున్నారు. దీని నిర్మాణంలో చోళులు, విజయనగర రాజుల నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపేగౌడ కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు లేదా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో వేలాది జంటలు పెళ్లితో ఒక్కటయ్యేవి. అయితే ఆ జంటలే మధ్య సయోధ్య కుదరక విడాకులకు దారితీయడంతో.. ఆ ఆలయ పూజారులు కోర్టుల చుట్టూ తిగరాల్సి వచ్చింది. అంతేగాదు ఆలయ ఆగమ పనులకంటే..కోర్టు చుట్టూ తిరగడమే పనైంది పూజారులకు. ఈ న్యాయపరమైన చిక్కులను నివారించేందుకు, అలాగే పూజారులు ఆయల కైంకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఇలా వివాహాలను నిషేధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. హిందూ వివాహాలకు పేరుగాంచిన ఈ ఆలయం ఏటా వందలాది జంటల వివాహాలను ఘనంగా జరిపించేది. ఆలయ గోపురం కింద ఈ వివాహాలు జరిగేవవి. వేద సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా జరిగే ఈ వివాహాలు..ఇటీవల విడాకులు కేసులు అంతకంతకు పెరిగి ఆలయ పవిత్రత మంట కలిసిపోయేలా మారింది. దానికి తోడు ఆ పెళ్లిలో సాక్షులుగా ఉన్న పూజారులు కోర్లుమెట్టాక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతరెండేళ్లలోనే ఆలయ అధికారులకు 50కి పైగా విడాకులు ఫిర్యాదుల అందాయట. చాలా వివాహాలు ఇంట్లోని కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా చేసుకోవడం, కొందరు నకిలీ డాక్యుమెంట్లతో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వాపోయారు. పూజారుల భక్తి సమయం ఆదా అయ్యేలా, అలాగే ఆలయ పవిత్రతను కాపాడుకునేలా ఇలా వివాహాలను నిషేధించక తప్పలేదని చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది అమిష్ అగర్వాల్ మాట్లాడుతూ..ఆలయం ఇతర ఆచారాలు, మతపరమైన వేడుకలను అనుమతిస్తూనే ఉంది. కానీ ప్రస్తుతానికి వివాహాలను అనుమతించబోమని నిర్ణయించింది. ట్రెండ్‌ను అంచనా వేసి, కమ్యూనిటీ వాటాదారులతో సంప్రదించిన తర్వాత భవిష్యత్తులో ఈ విధానాన్ని సమీక్షించవచ్చని యాజమాన్యం పేర్కొంది." అని చెప్పారు. నిజానికి దక్షిణ భారతదేశంలో దేవాలయాలలో వివాహాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఆ నేపథ్యంలోనే పురాతన దేవాలయాల్లో వీటిని నిర్వహించేందుకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. కానీ పెరుగుతున్న విడాకుల కేసులు, పూజారులను చట్టపరమైన చిక్కుల్లో పడేశాయి. దీంతో అధికారులు సోమేశ్వర ఆలయం మరిన్ని న్యాయమపరమైన చిక్కులను ఎదుర్కొనకుండా ఉండేలా ఈ వివాహాలకు అడ్డుకట్టవేయాల్సి వచ్చింది.(చదవండి: లెట్స్ సింగ్..ఫుల్ స్వింగ్..!) -
కార్తీకమాసంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీ ఛాయా సోమేశ్వరాలయం
చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య ఓం నమఃశివాయ స్మరణతో మారుమోగే అద్భుత దేవాలయమే శ్రీ ఛాయా సోమేశ్వరాలయం. సోమవారం వచ్చిందంటే భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం అద్భుత నిర్మాణ శైలికి నిలయం. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్లగొండ పట్టణానికి సమీపంలోని పానగల్ వద్ద ఉన్న ఛాయా సోమేశ్వరాలయం శివరాత్రి సందర్భంగా మహోత్సవాలకు సిద్ధం అవుతోంది.ఎక్కడైనా సూర్యకాంతి, విద్యుత్తు దీపాల వెలుతురులో ఏర్పడే ఛాయ (నీడ) గమనాన్ని బట్టి మారడం సహజం. కానీ ఇక్కడ శివలింగంపై పడే ఛాయ సూర్యుని గమనంతో సంబంధం లేకుండా స్తంభాకారంలో నిశ్చలంగా ఉండటం విశేషం. సూర్యరశ్మితో సంబంధం లేకుండా, వర్షం పడినా, ఆకాశం మేఘావృతమైనా ఆ నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నివేళలా ఒకేలా ఉంటుంది. అందుకే ఇది ఛాయా సోమేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది. రాజసం ఉట్టిపడే అద్భుత శిల్ప కళాసంపద, కాకతీయుల నాటి శిల్ప కళారీతులు శ్రీఛాయాసోమేశ్వర స్వామి సొంతం. ఈ ఆలయంలోని ఎంతో విశేషమైన బ్రహ్మసూత్ర లింగాన్ని భక్తులే స్వయంగా అభిషేకించడం మరోప్రత్యేకత. ఆ శివలింగాన్ని ఒక్కసారి తాకితే వేయి లింగాలను దర్శించిన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.వెయ్యేళ్ల కిందటి అద్భుత కట్టడం...భారతీయ వాస్తు, శిల్పకళా చాతుర్యంలో సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం›చేసి ఆలనాటి కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. పానగల్‌ను రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల సామంత రాజులైన కుందూరు చాళుక్య రాజు ఉదయ భానుడు ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాల్లో దీంతో పాటు సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయం కూడా నిర్మించారు. శివలింగం చుట్టూ పచ్చని వజ్రాలను పొదగడంతో ఆలయం అంతా పచ్చని వెలుతురు వెదజల్లేదని చెబుతారు.మూడు గర్భాలయాలు...చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉంటాయి. అందుకే దీనిని త్రికూటాలయంగా పేర్కొంటారు. మరోవైపు ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి. స్తంభాలపై రామాయణ, మహాభారతాలు...గుడి ఆవరణ మొత్తం 18 స్తంభాలతో ఉంటుంది. అందులో పడమరన ఉన్న సోమేశ్వరుడి ఆలయం ముందు 8 స్తంభాలు ఉంటాయి. వాటిల్లో ఏ స్తంభం నీడ శివలింగంపై పడుతుందన్నది ఇక్కడి రహస్యం. మరోవైపు ఆయా స్తంభాలపై రామాయణ, మహాభారతాలు విగ్రహ రూపంలో ఉండటం విశేషం. నాలుగు స్తంభాలపై ఉండే మండపం పైభాగంలో అష్టదిక్పాలకులు, మూడు గర్భ గుడుల ముందు గజలక్ష్మి కొలువై ఉంటుంది. అయితే సూర్యభగవానుడి భార్య ఛాయాదేవి పరమ శివుని ప్రార్థించి శివుని వరంతో ఛాయగా ఉన్నట్లు భావిస్తారు.ప్రతి సోమవారం, పర్వదినాల్లో ప్రత్యేక పూజలుఆలయంలో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు కొనసాగుతాయి. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు చేస్తారు. తొలి ఏకాదశితో పాటు నిత్యాభిషేకాలు, కార్తీక పౌర్ణమి, దసరా, మహాశివరాత్రి, ఉగాది వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం, అమావాస్య రోజుల్లోనూ విశేషంగా భక్తులు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా యజ్ఞాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, శివ పార్వతీ కళ్యాణం, అగ్నిగుండాలు, తెప్పొత్సవాలను నిర్వహిస్తారు.ఉదయ సముద్రం నీరే కోనేరులోకి పక్కనే ఉన్న ఉదయ సముద్రం చెరువులోని నీరే కోనేరులోకి రావడం ఇక్కడ విశేషం. దానికి ప్రత్యేకంగా పాయ అంటూ లేకపోయినా నీరు కోనేరులోకి రావడం ప్రత్యేకత. ఇప్పటికీ నీటి తడి (చెమ్మ) శివలింగం ఉన్న గర్భగుడిలో ఉంటుంది. – ప్రధాన అర్చకుడు ఉదయ్‌కుమార్.– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ -
పూజలు చేస్తూ శివలింగం చెంతనే...
సాక్షి, భీమవరం: పంచారామ క్షేత్రమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. గర్భగుడిలో స్వామివారికి పూజలు చేస్తూ ఆలయ ప్రధాన అర్చకుడు కందుకూరి వెంకటరామారావు శివలింగంపైనే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందడంతో గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెంది ఉంటారని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నట్టుండి కిందపడిపోయిన వెంకటరామారావు మరో అర్చకుడి సాయంతో లేచి నిల్చున్నారు. అయితే మళ్లీ కాసేపటికే ఆయన శివలింగం చెంతనే పడిపోయారు. గుడిలోని అర్చకులు అప్రమత్తమయ్యే లోపల ఆయన ప్రాణాలు వదిలినట్టు తెలుస్తోంది. గర్భగుడిలోని సీసీ కెమెరాలలో రికార్డైన ఈ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆరోజు ఏంజరిగిందనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
భీమవరం: గుండెపోటుతో ఆలయ పూజారి మృతి


