breaking news
somasekhar reddy
-
ప్రభుత్వానికి కియా 10 లక్షల మాస్క్‌లు
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: కరోనా విపత్తుపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా పది లక్షల మాస్క్‌లను అందించింది. దీనికి సంబంధించిన పత్రాన్ని, శ్యాంపిల్ మాస్క్‌లను సోమవారం ఏపీ విపత్తుల శాఖ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబుకు కియా ఇండియా సీఈవో కబ్ డాంగ్ లీ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా మాస్క్‌లను అందించడం అభినందనీయమన్నారు. ఈ మాస్క్‌లను అన్ని జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా లీగల్ కార్పొరేట్ హెడ్ జూడ్ లీ, ముఖ్య సలహాదారు డాక్టర్ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నేడే ఉప పోరు
సర్వం సిద్ధం చేసిన అధికారులు పోలింగ్‌కు బూత్‌లకు ఈవీఎంలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ భారీగా పోలీస్ బందోబస్తు సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. ఓటరు దేవుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతాడోనని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఓబులేసు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్వై. గోపాలకృష్ణ బరిలో ఉన్నారు. వీరు నామినేషన్లు సమర్పించినప్పటి నుంచి బళ్లారిలో ప్రచారం హోరెత్తింది. రెండు పార్టీలకు చెందిన అతిరథ మహారథులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరుఫున సీఎం సిద్ధరామయ్య రెండుసార్లు బళ్లారిలో ప్రచారం చేశారు. ఇక యావత్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటా ప్రచారం చేశారు. వారికి ధీటుగా బీజేపీ నేతలు కూడా కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, సదానందగౌడ, మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, ఎంపీ శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం మీద బహిరంగ, చివరి రోజు ఇంటింటా ప్రచారం ముగిసింది. గురువారం ప్రజలు తమ తీర్పును ఇవ్వబోతున్నారు. ‘బళ్లారి’లో 1,88,307 మంది ఓటర్లు.. బళ్లారి గ్రామీణ ఉప ఎన్నికల్లో 1,88,307 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 94,665 మంది మహిళలు, 93,619 మంది పురుషులు, 23 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 203 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ను నిర్వహిస్తారు. జిల్లా యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసింది. స్థానిక ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల వద్ద పోలింగ్ బూత్‌ల వారీగా సిబ్బంది నియామకం, అందుకు అవసరమైన ఈవీఎంల అప్పగింత, భద్రతా సిబ్బంది, వాహనాల కేటాయింపు ప్రక్రియ ఉదయం నుంచి ఆరంభమైంది. సిబ్బందిని, ఈవీఎం బాక్సులను తరలించడానికి కేఎస్ఆర్టీసీ బస్సులను కళాశాల ముందు బారులు తీరాయి. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే ఎన్నికల పోలింగ్ సందడి మొదలైంది. మధ్యాహ్నానికల్లా సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొన్నారు. -
అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాలు!
అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చేందుకు ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి సోమశేఖరరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నెహ్రు జూలాజికల్ పార్క్‌లో ఆదివారం జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సోమశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... అటవీశాఖలో 3,820 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అటవీశాఖ సిబ్బంది విరాళంగా ఇచ్చిన రూ. 2.2 లక్షల చెక్కును ఇటీవల నిజామాబాద్ జిల్లాలో స్మగ్లర్ల దాడిలో చనిపోయిన గంగయ్య కుటుంబానికి ఆయన అందజేశారు.