breaking news
Sink building
-
జోషిమఠ్ బాటలో...
ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కొండల్లో రాళ్లు, మట్టి వదులుగా మారి ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తోందన్న భయంతో స్థానికులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ జూలై 2020 నుంచి మార్చి 2022 మధ్య చేసిన అధ్యయనంలో జోషిమఠ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏడాదికి 6.5 సెంటీమీటర్లు కుంగిపోతున్నట్టుగా గుర్తించారు. ఒకప్పుడు ఇళ్లకు చిన్న పాటి చీలికలు కనిపించేవి. ఇప్పుడు భారీగా పగుళ్లు మాదిరిగా ఏర్పడుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పది అడుగుల లోతుకు కుంగిన భవనం
♦ తప్పిన ప్రమాదం ♦ 14 మంది రక్షింపు అన్నానగర్: రెండు అంతస్తుల భవనం కుంగిన ప్రమాదంలో అదృష్టవశాత్తు 14 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన అంబత్తూర్లో శనివారం చోటుచేసుకుంది. అంబత్తూరు వెంకటాపురం, మోనస్వామి మఠం వీధిలో రెండు అంతస్తుల ప్రయివేటు భవనం ఉంది. ఈ భవనంలో ఆరు పోర్షన్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చంద్రశేఖరన్(69) రిటైర్డ్ ఎల్ఐసీ ఉద్యోగి. ఇతని భార్య ఉమా(60). వీరి కుమారుడు విశ్వనాథన్(32), కోడలు భువన(30), మనవడు మనువరాలితో నివసిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం బంధువుల ఇంటికి విశ్వనా«థన్ కుటుంబంతో సహా వెళ్లారు. ఇంట్లో చంద్రశేఖర్, ఉమా ఉన్నారు. చంద్రశేఖర్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 7 గంటల సమయంలో నిద్రపోయాడు. ఉమా వంట చేస్తుండగా భవనం హఠాత్తుగా పది అడుగుల లోపలికి కుంగిపోయింది. వీరి కేకలు విని ఉమా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె కూడా పది అడుగుల గుంటలో పడి పోయింది. వీరిద్దరి కేకలు విని మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వారు బిల్డింగు నుంచి వచ్చి చంద్రశేఖర్, ఉమ ఇద్దరు గుంటలో చిక్కుకుని ప్రాణాలకు పోరాడుతుండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. తరువాత ఇద్దరిని నిచ్చెన వేసి సురక్షితంగా వెలుపలికి రప్పించారు. ఈ భవనంలో నివసిస్తున్న 14 మంది ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. ఇందులో భవనం నిర్మించిన స్థలం బావిలో ఉన్నట్లు తెలిసింది. బావిని సరిగ్గా మూయకపోవడంతో ఈ ప్రమాదం ఏర్పడిందని అధికారులు తెలిపారు.