breaking news
Singavarapu Esther Anuya
-
'అనూహ్య' హంతకులను పట్టుకోండి
-
'అనూహ్య' హంతకులను పట్టుకోండి
న్యూఢిల్లీ: తన కూతురిని హత్య చేసిన హంతకులను పట్టుకుని శిక్షించాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య తండ్రి శింగవరపు ప్రసాద్ కోరారు. కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. షిండేను ఈ ఉదయం ఆయన ఢిల్లీలో కలిశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఈ నెల 4న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను ముంబై పోలీసులు పట్టుకున్నట్టు వార్తలు వచ్చినా అవి నిజం కాదని తర్వాత తెలిసింది. -
'అనూహ్య' కేసులో నమ్మలేని నిజాలు
-
'అనూహ్య' కేసులో నమ్మలేని నిజాలు
ముంబై: సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగవరపు ఎస్తేర్ అనూహ్య(23) హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. హత్యకు ముందు ఆమెను ఐదు రోజుల పాటు లైంగిక దాడికి గురిచేశారని, చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను కుంజూర్‌మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు, ఇద్దరు వ్యభిచారగృహ నిర్వాకులు ఉన్నారు. ముంబైలో దిగగానే అంధేరికి అనూహ్య క్యాచ్ మాట్లాడుకుందని పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ కారు దారి మళ్లించి మార్గమధ్యలో మరో ముగ్గురిని ఎక్కించుకున్నాడని వెల్లడించారు. ఆమె ఫోన్ లాక్కుని ఓ ఇంట్లో బంధించించి, ఐదు రోజుల పాటు దుండగులు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. తర్వాత కుంజూర్‌మార్గ్ లో నిర్జన ప్రదేశంలో యాసిడ్ పోసి ఆమెను తగులబెట్టారని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఈ నెల 4న విజయవాడలో లోక్మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే.