breaking news
Shop license
-
సిక్కోలు వాకిట్లో సిండికేట్ల రాజ్యం
తాగు నీరు దొరకని గ్రామాలు ఉన్నాయేమో గానీ మద్యం దొరకని చోటు లేదు... వేల సంఖ్యలో బెల్టు షాప్‌లు... దర్జాగా లిక్కర్ దందా... ఎవరికి అందాల్సిన మొత్తం వారికి... వాటాలు కుదరనిచోట నెలవారీ ముడుపులు..! సిక్కోలు వాకిట్లో ఇదీ మద్యం సిండికేట్ల రాజ్యం..! మద్యం ద్వారా ఆదాయం ముంచెత్తాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు గేట్లు ఎత్తారు...!శ్రీకాకుళం జిల్లాలో మద్యం షాపుల నిర్వాహకులు, సిండికేట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో షాప్ పరిధిలోని గ్రామాల్లో 10 నుంచి 40 బెల్ట్ షాప్‌లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 10 వేలపైనే అని అంచనా. ఇవన్నీ బార్లను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల నివాస గృహాలు, చిన్న చిన్న దుకాణాల్లోనూ మద్యం దొరుకుతోంది. క్వార్టర్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 అదనంగా అమ్ముతున్నారు. కొన్నిచోట్ల లైసెన్స్ దుకాణాల కౌంటర్లలోనే రూ.10 నుంచి రూ.20 వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. వైన్ షాప్‌లు, బార్లలో నిర్దేశిత వేళల్లో మద్యం దొరుకుతుంటే బెల్ట్‌షాపుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటోంది. ఇక బార్లలో మాదిరిగా బెల్ట్‌షాప్‌లలో ఆహార పదార్థాలు లభ్యమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం⇒ బెల్ట్ షాప్‌లు, లైసెన్స్ దుకాణాల వద్ద అనధికారికంగా పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు, ఎంఆర్పీకి మించి అమ్మకాలకు నాయకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తమవంతు సాయం చేసినందుకు షాప్‌ల యజమానులు, సిండికేట్ల నుంచి ముడుపులు, వాటా తీసుకుంటున్నారు. సిండికేట్ ఏర్పాటైనచోట నేతలు అదనపు వాటా పొందగా, అది లేనిచోట లైసెన్స్ షాప్‌నకు నెలకు రూ.లక్ష చొప్పున తీసుకుంటున్నారు.రాజాంలో మొదలై జిల్లా అంతటికి విస్తరణ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటే రాజాం నియోజకవర్గంలో లిక్కర్ దందా మొదలైంది. లైసెన్స్ షాపుల యజమానులందరినీ సిండికేట్ చేశారు. ఇందులో సభ్యుడిగా నియోజకవర్గ కీలక నేతను చేర్చారు. లాభాల్లో వాటాను కీలక నేతకు ఇస్తున్నారు. అంతా ఏకం కావడంతో ఎంఆర్పీకి మించి విక్రయాలే కాదు ఎక్కడికక్కడ బెల్ట్ షాపులూ నడుపుతున్నారు.నెలకి షాపునకు రూ.లక్ష శ్రీకాకుళం నియోజకవర్గంలోనైతే సిండికేట్ లేదు కానీ బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు, ఎంఆర్పీకి మించి విక్రయాలు జరుగుతున్నాయి. చూసీ చూడనట్టున్నందుకు నియోజకవర్గ నేతకు ఒక్కో షాపు నుంచి నెలకు రూ.లక్ష ముట్టజెబుతున్నారు. అధికారులే సూత్రధారులై ఆ ఒప్పందం అమలు చేస్తుండడం గమనార్హం. టెక్కలి, ఆమదాలవలసలో సోదరుల పెత్తనం టెక్కలి, ఆమదాలవలసల్లో కీలక నేతల సోదరులే అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఆమదాలవలసలో కొన్ని షాపులు సిండికేట్‌లో కలవలేదు. వాటి యజమానులు నెలవారీ ముడుపులిస్తున్నారు. పాతపట్నంలో కూడా వ్యాపారులంతా సిండికేటై, అక్కడున్న నేతకు వాటా ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్‌పై రూ.30 అదనంగా పిండుకుంటున్నారు. ఇచ్ఛాపురంలో నెల వారీ మామూళ్లు కొనసాగుతున్నాయి.నరసన్నపేటలో మొత్తమంతా కీలక నేతకేనరసన్నపేటలో కీలక నేత పంట పండింది. కలిసి మద్యం వ్యాపారం చేసుకుందామని నమ్మబలికి అనుచరులు, నాయకుల దగ్గరి నుంచి రూ.20 కోట్లకు పైగా సేకరించారు. వారికి వ్యాపారంలో వాటా ఇస్తామని చెప్పారు. నాయకుల పేరునే దుకాణాలకు దరఖాస్తులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. తీరా తన కుటుంబ సభ్యుల పేరునే ఎక్కువగా దరఖాస్తులు చేశారు. వారి కుటుంబసభ్యులకే లాటరీలో ఎక్కువ దుకాణాలు వచ్చాయి. రూ.20 కోట్లు ఇచి్చన నాయకులు, అనుచరులను దూరంపెట్టారు. వారి డబ్బూ తిరిగివ్వలేదు. వాటాలూ ఇవ్వలేదు. దీంతో ఆగకుండా.. నియోజకవర్గంలో మిగతావారికి దక్కిన షాపులను సైతం బెదిరించి సిండికేట్‌లో కలిపారు. పైసా పెట్టుబడి లేకుండా తానొక వాటా తీసుకుంటున్నారు.పలాసలో అల్లుడి దందా పలాసలో సీనియర్ నేత అల్లుడే చక్రం తిప్పుతున్నారు. వ్యాపారులందరినీ సిండికేట్‌గా చేయడమే కాక లైసెన్స్ షాపుల కౌంటర్లలోనే క్వార్టర్ బాటిల్‌పై రూ.20 అదనంగా అమ్మేలా దారి చూపించారు. ప్రతిఫలంగా సిండికేట్‌లో వాటాతో పాటు షాపుల నుంచి నెల వారీ ముడుపులు తీసుకుంటున్నారు. జిల్లాలో లైసెన్స్ షాప్‌ల కౌంటర్లలో ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపట్టడం పలాసలోనే మొదలవడం గమనార్హం.మద్యం మత్తులో గ్రామాలు ప్రభుత్వం తీసుకొచి్చన విధానంతో పాటు బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా పుట్టుకొచ్చి సిక్కోలు గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. మత్తులో హత్యలు, అత్యాచారాలు, గొడవలు జరుగుతున్నాయి. జనవరి 19న శ్రీకాకుళం న్యూకాలనీలో పొందూరు మండలానికి చెందిన పూజారి లలితను అతి కిరాతకంగా ఓ యువకుడు చంపేశాడు. ఫిబ్రవరి 10న సోంపేట సమీప జింకిభద్ర బీసీ కాలనీలో మద్యం మత్తులో సాహుకారి ఢిల్లీశ్వరరావు భార్యను హత్య చేశాడు. మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42)ను భర్త అప్పలరెడ్డి దారుణంగా నరికి చంపాడు. కాశీబుగ్గలో మద్యం మత్తులో ఇద్దరు బాలికలపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం బలగ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ వద్ద బీరు సీసాలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. -
నకిలీ విత్తనాలమ్మితే షాప్ లైసెన్స్ రద్దు
ఎరువుల దుకాణాల తనిఖీలో జేడీఏ మణిమాల గార్ల : నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఎరువులు, పురుగులమందు దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు (జేడీఏ) పి.మణిమాల దుకాణాల డీలర్లను హెచ్చరించారు. ఇటీవల గార్ల మండలంలో నకిలీ విత్తనాలను వ్యాపారులు విక్రయించారని, వాటిని విత్తుకుంటే నారు మొలవలేదని పలువురు రైతులు సదరు విత్తన ప్యాకెట్లను జేసీ దివ్యకు చూయించి, న్యాయం చేయాలని వేడుకున్నారు. జేసీ ఆదేశాలతో జేడీఏ సోమవారం గార్లలోని ఎరువుల, పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేసి.. స్టాక్ రికార్డులను పరిశీలించి, గోదాంలను సందర్శించారు. ఎరువుల ధరల పట్టిక లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం తగ్గించిన ధరలకే ఎరువులను అమ్మాలని, ఎవరైనా అధిక రేట్లకు అమ్మితే ఫోన్‌ద్వారా రైతులు ఫిర్యాదు చేయొచ్చని, వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. ఆమె వెంట ఏఓ పి.నాగయ్య ఉన్నారు. -
పంటపొలాల్లో ఇటుకబట్టీలా
బీమా చెల్లించిన రైతులకు పరిహారం ఏదీ? నాలుగు లెసైన్స్షాపులకు 48 బెల్ట్‌షాపులా...! వ్యవసాయ, ఎక్సైజ్శాఖాధికారులపై జెడ్పీటీసీల ఫైర్ జెడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా మహారాణిపేట(విశాఖ): జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎక్సైజ్, వ్యవసాయశాఖలను కుదిపేసింది. ఆ రెండుశాఖల అధికారులపై సభ్యులు ధ్యజమెత్తారు. నాలుగు లెసైన్స్ షాపులకు 48 బెల్ట్దుకాణాలా? పంటపొలాల్లో ఇసుకబట్టీలా అంటూ నిలదీశారు. చైర్పర్సన్ లాలం భవాని అధ్యక్షతన ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతిరాజు మృతికి ప్రారంభంలో సంతాపం తెలిపారు. వ్యవసాయశాఖ నివేదికను చదివిన వెంటనే ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు లేచి జిల్లాలో 2012 నుంచి రైతులు పంటలకు బీమా చెల్లిస్తున్నప్పటికీ పరిహారానికి నోచుకోలేదని, ఎంతమంది బీమా చెల్లించాలని నిలదీశారు. దీనికి అనుబంధంగా మునగపాక జెడ్పీటీసీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన మండంలో 33వేల ఎకరాల్లో సాగుభూమి ఉందని, ఇందులో 2వేల ఎకరాలు నీరు లేక ఇటుకబట్టీలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటుకబట్టీలకు ఎవరు అనుమతులిచ్చారని ప్రశ్నిం చారు. ఎస్.రాయవరం ఎంపీపీ వినోద్‌రాజు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయశాఖ ఉన్నట్టు తెలియడం లేదన్నారు. పద్మనాభంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ జెడ్పీటీసీ కోరారు. కోటవురట్ల మండంలో ఆదర్శరైతులకు ఏడాదిగా జీతాలివ్వలేదని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తెచ్చారు. గొలుగొండలో దళారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని, ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ మండల జెడ్పీటీసీ జేసీ నివాస్‌ను కోరారు. డీసీసీబీ చైర్మన్ సుకుమారవర్మ మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించకపోవడం వల్లే బ్లాక్మార్కెట్లో ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. బెల్ట్‌షాపుల జోరు... గ్రామాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, నాలుగు లెసైన్స్ షాపులకు 48 బెల్ట్‌షాపులు చొప్పున ప్రతిమండంలో వీధి వీధికి మద్యం ఏరులై పారుతోందని, సీసాకు రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టిం చు కోవడం లేదని మునగకపాక జెడ్పీటీసీ సభ్యు డు లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. మన్యం లో సారా ఏరులైపారుతోందని ఏజెన్సీ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశంలో పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో సిబ్బంది లేరు. నర్సీపట్నం ఆస్పత్రిలో ఫ్మార్మాసిస్టులు లేక రోగులకు మందులు ఇచ్చేవారే కరువయ్యారని నర్సీపట్నం జెడ్పీటీసీ తెలిపారు. ఒకే ఒక్క డాక్టర్ ఉండడంతో రాత్రిళ్లు సేవలు అందడం లేదన్నారు. ఆస్పత్రుల్లో ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎస్.రాయవరం ఎంపీపీ వినోద్‌బాబు సభకు తెలిపారు. రాయవరం ఆస్పత్రి శిథిల స్థితికి చేరిందన్నారు. భీమిలి మండంలో నాలుగు ఎకరాల స్థలం ఉన్నా పీహెచ్సీ భవన నిర్మాణానికి వైద్య, ఆరోగ్యశాఖ ముందుకు రావడం లేదని భీమిలి జెడ్పీటీసీ అప్పారావు ఆరోపించారు. దీనిపై జేసీ నివాస్ వైద్యాధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పాఠశాల భవనం పూర్తిచేయరా... చీడికాడ మండలం తరువోలు జెడ్పీ హైస్కూల్లో ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు రూ. 36లక్షలతో చేపట్టిన భవనం ఎప్పుడు పూర్తవుతుందని ఆ మండల జెడ్పీటీసీ పి.సత్యవతి సభ దృష్టికి తెచ్చారు. వసతి కొరతతో విద్యార్థులు చెట్టు నీడన చదువుతున్నారన్నారు.మునగపాక మండలం పాటిపల్లి పంచాయతీ నారాయుడుపాలెంలో ఏడాదిన్నరగా నీటిపథకం మూలకు చేరినా బాగు చేయడం లేదని ఆ జెడ్పీటీసీ వాపోయారు. ఈ సమావేశానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుతో సహా ఎమ్మెల్యేలంతా డుమ్మాకొట్టారు. జేసీ నివాస్, జెడ్పీ సీఈవో ఆర్.జయప్రకాష్ నారాయణ్ తో పాటు వివిధశాఖల అధికారులు హాజరయ్యారు. -
అర లక్ష ఇస్తే...అంతా ఓకే ఇదీ నేతల వైన్ం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారం అడ్డం పెట్టుకుని దండుకునే కార్యక్రమంలో కొందరు నేతలు నిమగ్నమయ్యారు. ముగ్గురు ప్రజాప్రతినిధులైతే నైతికమా, అనైతికమా అన్నది పక్కన పెట్టి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అనుకున్నది జరగని చోట తమ పవర్ చూపిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులను ఉసిగొల్పి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. దీనికి మద్యం వ్యాపారస్తులతో జరుగుతున్న లోపాయికారీ ఒప్పందాలే ఉదాహరణ. బెల్ట్‌షాపులు మూసేస్తుండడం వల్ల తమ వ్యాపారాలు తగ్గిపోయాయని, మరోవైపు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే దాడులు నిర్వహిస్తుండడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని గగ్గోలు పెడుతున్న మద్యం వ్యాపారస్తులతో డీల్ కుదుర్చుకునే పనిలో పలువురు అధికార పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. మధ్యవర్తుల జోక్యంతో రంగంలోకి దిగిన నేతలుఒప్పందాలు చేసుకుంటు న్నారు. ఒక్కొక్క లెసైన్స్ షాపు ప్రతి నెలా రూ.50 వేలు చొప్పున ఇస్తే ఆ షాపు పరిధిలో నాలుగు బెల్ట్‌షాపులు నడుపుకోవడానికి, ప్రతి బాటిల్‌పై రూ.5 నుంచి 10 అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆఫర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల అం గీకారం కుదరడంతో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు జరగడమే కాకుండా బెల్ట్‌షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఎక్కడైతే డిమాండ్ చేసినట్టు రూ.50 వేలు ఇవ్వడం లేదో ఆ షాపులపై అధికారులతో దాడులు చేయిస్తున్నట్టు తెలిసింది. అడిగినంతా ఇచ్చేందుకు ఆసక్తి చూపని చోట (బేరసారాలు కొలిక్కిరాని ఏరియా) దారికితెచ్చుకునే వ్యూహంలో భాగంగా వారికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. బెల్ట్షాపులన్ని మూసేయాలని, ఎంఆర్పీకి మించి విక్రయాలు చేస్తే చర్యలు తీసుకో వాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశిస్తున్నారు. అది కూడా హెచ్చరించినట్టు ఉండాలని పరోక్షంగా అధికారులకు సూచిస్తున్నారు. దీం తో తూచ తప్పకుండా అధికారులు దాడులకు ఉపక్రమించి హడావుడి చేస్తున్నారు. ఈక్రమంలోనే దారికి తెచ్చేలా రాయబేరాలను సాగిస్తున్నారని సమాచారం. సందట్లో సడేమియా...పట్టుబడుతున్న తెలుగు తమ్ముళ్లు నేతలు డీల్ కుదుర్చుకునే పనిలో నిమగ్నమవగా క్షేత్రస్థాయిలో ఉన్న తెలుగు తమ్ముళ్లు సందట్లో సడేమియాలా అనధికారంగా మద్యం రవా ణా చేస్తున్నారు. తమ పార్టీ నేతల షాపుల నుంచి కేసులను తీసుకుని అనధికార విక్రయాలు చేపడుతున్నారు. దొరకకుండా దర్జాగా వ్యాపా రం చేసుకుంటున్నారు. దొరికితే తమ నేతల సిఫారసులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పూసపా టిరేగ మండలం చల్లవానితోట పరిధిలో అదే జరిగింది. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తమకు సమీపంలో ఉన్న టీడీపీ నేత వైన్‌షాపు నుంచి పెద్ద ఎత్తున మద్యం సీసాలు తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. కానీ, వారి నుంచి పట్టుకున్న సీసాలు సొం తంగా తాగేందుకు తీసుకెళ్తున్నవే తప్ప విక్రయించడానికి కాదనే కోణంలో కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. అయితే, దీని లోగుట్టు సదరు ఎక్సైజ్ అధికారులకే ఎరుక. ఇక్కడొక చోటే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే తరహా తంతు నడుస్తోంది.