breaking news
Shivajirao
-
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలాంగేకర్ (88) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో పూణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివాజీరావు మరణించారు. శివాజీరావుకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడంతో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నా కిడ్నీ ఫెయిలవ్వడంతో బుధవారం తెల్లవారుజామున మరణించారని వైద్యులు చెప్పారు. శివాజీరావు మధుమేహం, బీపీ, కరోనాలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు వివరించారు. కాగా 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు శివాజీరావ్ పాటిల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎండీ పరీక్షలో తన కుమార్తెకు అక్రమంగా మార్కులు వేయించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు బాంబే హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా శివాజీరావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం స్వస్థలం నీలాంగాలో జరగనున్నాయి. -
నేడు ఎన్సీపీ నేత పాటిల్ కాంగ్రెస్‌లో చేరిక
యవత్మాల్ : జిల్లాలో గట్టి పట్టున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఉత్తమ్రావ్ పాటిల్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన సొంత గ్రామమైన అర్ని తాలూకా లోనీలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని మంగళవారం యవత్మాల్ జిల్లా కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (వైడీసీసీ) చైర్మన్, ఉత్తమ్రావ్ పాటిల్ కుమారుడైన మనీష్ పాటిల్ తెలిపారు. జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల మన్కర్ కూడా పాటిల్‌తోపాటు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. డిప్యూటీ స్పీకర్ వసంత్ పర్కే, మంత్రి శివాజీరావ్ మోఘే సూచన మేరకు వారం కిందట సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసి తాము కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపామని మనీష్ వివరించారు. ఇంతకుముందు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ పాటిల్ దియోసర్కార్ సైతం పార్టీని వీడి శివసేనలో చేరిన విషయం తెలిసిందే. ఎన్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సందీప్ బజోరియా తిరిగి అక్కడ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. ఆయనపై అసంతృప్తితో జిల్లాలోని చాలామంది ఎన్సీపీ నాయకులు పక్క పార్టీల్లో చేరిపోతున్నారు.