breaking news
Shiv Sena chief Uddhav Tirkey
-
ఏ ముహూర్తంలో ప్రమాణం చేశారో?
- బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఠాక్రే - ఫడ్నవీస్ ప్రభుత్వానికి చురకలంటించిన ఉద్ధవ్ - సీఎం ఇబ్బందుల్లో పడే అవకాశముందని వ్యాఖ్య సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ మంత్రులపై వస్తున్న ఆరోపణ లు, వివాదాలపై శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం ఫడ్నవీస్, మంత్రి మండలి ఏ ముహుర్తంలో ప్రమాణస్వీకారం చేశారో మరోసారి పరిశీలించాలని ఎద్దేవా చేశారు. సామ్నా దినపత్రికలో ‘ఆది బసూ మగ్ బోలూ’ (ముందు కూర్చుందాం, ఆ తర్వాత మాట్లాడదాం) అనే శీర్షికతో వచ్చిన సంపాదకీయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ మంత్రులకు తనదైన శైలిలో ఉద్దవ్ ఠాక్రే చురకలంటించారు. కొద్ది రోజులుగా ఫడ్నవీస్ కేబినె ట్లోని మంత్రులపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఫడ్నవీస్ వల్లే గంటన్నరపాటు ఆలస్యమైందన్న వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లిన రోజున ప్రవీణ్ పరదేశి అనే ఐఏఎస్ అధికారి వీసా, పాస్‌పోర్టుతోపాటు మరికొన్ని పత్రాలు ఇంటివద్ద మరిచిపోయారని, దీంతో విమానం గంటపాటు ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై పీఎంఓ కార్యాలయం కూడా నివేదిక కోరింది. అయితే సీఎం ఫడ్నవీస్ ఘటన విషయమై సహనం కోల్పోయి మీడియాపై రుసరుసలాడారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని ఉద్ధవ్ పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఫడ్నవీస్ మంత్రిమండలిలోని నీటిపారుదల శాఖ మంత్రి లోణికర్ నకిలీ డిగ్రీ వివాదం, అనంతరం వినోద్ తావ్డే బోగస్ యునివర్సిటీ అంశం బయటికివచ్చింది. దీంతోపాటు తావ్డే శాఖలో రూ. 191 కోట్లు, పంకజా ముండే శాఖలో రూ. 206 కోట్ల కాంట్రాక్టుల కుంభకోణం విషయంపై వివాదాలు బహిర్గతమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఫడ్నవీస్ ప్రభుత్వంపై విమర్శలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ.. శివసేన లేకుండానే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ఇలా జరగడం మహారాష్ట్ర కులదైవమైన శివాజీ మహారాజుకు నచ్చలేదేమోనన్నారు. అందుకే ఫడ్నవీస్ ప్రభుత్వం అనేక వివాదాల్లో చిక్కుకుంటోందని సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రమాణస్వీకారం ఎప్పుడు చేశారనేదానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. -
సేన, కాంగ్రెస్ డిష్యూం డిష్యూం
* ఉద్ధవ్‌ఠాక్రే సమక్షంలోనే జరిగిన వివాదం * ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ఇరుపక్షాల వాగ్వాదం సాక్షి, ముంబై: ఓ భూమి పూజ కార్యక్రమంలో శివసేన, కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు. దాదర్‌లోని నాయ్‌గావ్‌లో ఆదివారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్ సమక్షంలో ఇరుపార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. వివరాల్లోకె ళితే.. బాంబే డయింగ్కు చెందిన 8.15 ఎకరాల స్థలంలో భారీ థీం పార్క్ ఏర్పాటు చేయాలని మహానగ ర పాలక సంస్థ(బీఎంసీ) నిర్ణయించింది. అందులో సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మించాలని ఏర్పాట్లు చేస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరిగిన పార్క్ శంకు స్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళిదాస్ మాట్లాడుతూ..బాంబే డయింగ్ స్ప్రింగ్ మిల్లు కార్మికుల ఇళ్ల కోసం గత 22 సంవత్సరాలుగా పోరాడుతున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆగ్రహించిన శివసైనికులు కోలంబ్కర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అంతరాయం క లిగించారు. దీంతో ఆయన మద్దతుదారులు ఉద్ధవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. నినాదాలు కాస్తా గొడవకు దారితీసాయి. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితి సద్దుమనగలేదు. ఉద్ధవ్, కోలంబ్కర్లు కలగజేసుకుని ఇరుపక్షాల వారిని శాంతపరిచారు. కొద్ది రోజుల కింద కూడా మాటుంగాలోని ఫైవ్ గార్డెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శివసేన, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇలాగే వాగ్వాదం జరిగింది.