breaking news
Shirdi Yatra
-
విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి ఇండిగో సంస్థ ఆదివారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించింది. మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణికులతో విమానం షిర్డీకి బయల్దేరి వెళ్లింది. అక్కడి నుంచి 66 మంది ప్రయాణికులతో విమానం తిరిగి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంది. రోజూ అందుబాటులో ఉండే ఈ విమాన సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఇండిగో ప్రతినిధులు కోరారు. -
షిర్డీ చేరిన పల్లకి యాత్ర
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని పద్మనగర్ నుంచి ఈ నెల 11న బయలుదేరిన సాయిబాబా పల్లకి శనివారం షిర్డీ పుణ్యక్షేత్రానికి చేరుకుంది. ‘శ్రీ శ్రద్ధ సబూరి మిత్రమండలి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో దాదాపు 550 మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. ఇందులో స్థానికులతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సుమారు 50 మంది పాల్గొనడం విశేషం. వారం రోజులు సాగిన పాదయాత్ర ముగింపున సాయి భక్తులు నృత్యాలు చేస్తూ, సాయి నినాదాలు చేయడంతో బాబా సన్నిధి మారుమోగింది. సాయంత్రం 4.30 గంటలకు నిగోద్ నుంచి సాయిమందిరం వరకు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. రాత్రి తొమ్మిది గంటలకు బాబా దర్శనం చేసుకున్నారు. యాత్ర ముగింపు సందర్భంగా పట్టణం నుంచి పలువురు కార్పొరేటర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు తదితరులతో పాటు సుమారు రెండు వేల మంది భక్తులు షిర్డీకి రావడం విశేషం. శ్రావణ మాసం పురస్కరించుకొని గత ఆరేళ్లుగా ఈ పాద యాత్ర నిర్వహిస్తున్నామని మండలి అధ్యక్షుడు పోతు గంగాధర్ తెలిపారు.