breaking news
shifted to seperate cell
-
నా ప్రాణాలకు ముప్పుంది: ఛోటా రాజన్
-
నా ప్రాణాలకు ముప్పుంది: ఛోటా రాజన్
తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్ల దౌత్యపరమైన రక్షణ కావాలని ఛోటా రాజన్ కోరినట్లు తెలుస్తోంది. బాలిలో తనకు తగినంత భద్రత కల్పించలేదని ఇండోనేషియా పోలీసులకు లేఖ రాసినట్లు సమాచారం. తనకు తగిన వైద్యం కూడా అందించట్లేదని రాజన్ ఆరోపించాడంటున్నారు. అతడు చాలా ఆందోళనగా కనిపిస్తున్నాడని, తరచు సిగరెట్లు కాలుస్తున్నాడని బాలి పోలీసులు చెప్పారు. మరోవైపు.. ఛోటా రాజన్ పోలీసులకు పట్టుబడినా తన బుద్ధి మార్చుకోలేదు. బాలిలోని డెన్పసర్ పోలీసు స్టేషన్లో ఉన్న జైల్లో తోటి ఖైదీలతో అతడు గురువారం రాత్రి గొడవ పడ్డాడు. దాంతో, రాజన్ను అదే స్టేషన్లో వేరే ప్రత్యేక సెల్లోకి మార్చారు. గత రెండు రోజులుగా విచారణకు బాగానే సహకరిస్తున్నాడని పోలీసులు చెప్పినా.. తర్వాత మాత్రం మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.