breaking news
sharif ahemmad
-
సీఎం జగన్ అప్యాయంగా పలకరించారు: మండలి చైర్మన్
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. ఈ నెలతో మండలి చైర్మన్ షరీఫ్ పదవీకాలం ముగియనుండటంతో.. సమావేశాల అనంతరం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. తన పదవి ముగుస్తోందని, సభ్యులతో కొన్ని విషయాలు పంచుకోవాలన్నారు. తనకు ఈ పదవి ఎవరో ఇచ్చారని అనుకోవడం లేదని, రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఒక దశలో రాజీనామా చేద్దామని నిర్ణయించుకున్నానని, కానీ పదవి వల్ల తనకు చెడ్డపేరు రాకూడదని ఆగిపోయినట్లు పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ‘అందరూ నాకు సహనం ఎక్కువ అంటున్నారు. కానీ నాకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సహనం ఎక్కువ. బిల్లు ఘటన జరిగిన 3 రోజులకు ఓ కార్యక్రమంలో సీఎంను కలిశా. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా హై టీ కార్యక్రమంలో కలిశా. సీఎం జగన్ చాలా అప్యాయంగా షరీఫ్ అన్న అని పలకరించారు. ఎందుకు కలత చెందారని స్వయంగా అడిగారు. గతంలో ఏ పెద్ద పదవులు చేయలేదు, నేరుగా ఛైర్మన్ అయ్యానని చెప్పాను. మండలిలో కీలక నిర్ణయాల దృష్ట్యా కలత చెందానని సీఎంకు చెప్పా. నన్ను అత్యంత గౌరవంగా చూసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు’ అని భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: ‘సీఎం రైతు పక్షపాతి అనడానికి వ్యవసాయ బడ్జెట్ నిదర్శనం’ AP Budget 2021: ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే.. -
మట్కా బ్రదర్స్ అరెస్టు
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: జ్యూవెలరీ, టైర్లు, బట్టల వ్యాపారం ముసుగులో ఆన్లైన్లో అంతర్జాతీయ స్థాయి మట్కా రాకెట్ నిర్వహిస్తున్న అన్నదమ్ములు సయూద్ అహ్మద్, షరీఫ్ అహ ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌కు చెందిన మరో నిందితుడు గఫార్ అహ్మద్ పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను నంద్యాల డీఎస్పీ అమర్నాథ్నాయుడు, టూటౌన్ సీఐ రామాంజినాయక్ ఆదివారం విలేకరులకు వెళ్లడించారు. కర్నూలు చిత్తారి వీధికి చెందిన వీరిద్దరు సయూద్ బ్రదర్స్ పేరిట బంగారు షాపు, టైర్లు, వీఎస్ టెక్స్టైల్ బట్టల షాపులు నిర్వహించారు. వీటి ముసుగులో వీరు చేస్తున్న చీకటి వ్యాపారం మట్కా. వీరు పదేళ్ల క్రితం కర్నూలులో పేరొందిన మట్కాడాన్ అసదుల్లా దగ్గర బీటర్లుగా పని చేశారు. అసదుల్లాతో విభేదాలు రావడంతో 2007లో విడిపోయి సొంతంగా కంపెనీ ప్రారంభించారు. ఆన్లైన్ నెట్ వర్క్ పెంచుకుని మట్కా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. అంతా ఆన్లైన్లోనే.. మట్కాడాన్ బ్రదర్స్ హైదరాబాద్‌లోని మలక్‌పేటలో సయూద్ అండ్ బ్రదర్స్ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఆఫీసు తెరిచారు. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ఏర్పాటుతోపాటు వాటి నిర్వహణకు ప్రవీన్‌కుమార్‌రెడ్డి, ధరణీధర్, చిన్న, రాజును నియమించారు. ప్రాంతాల వారీగా మట్కా బీటర్లకు కోడ్ నెంబర్లు కేటాయించారు. బీటర్ల నుంచి రూ.50 వేలు మొదలు రూ.5లక్షల వరకు డిపాజిట్లు సేకరించారు. కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలతోపాటు సౌదీ, మస్కట్, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ నుంచి బీటర్లు ఆన్లైన్లోనే మట్కా కోడ్ అందిస్తారు. హైదరాబాద్ శ్రీపురం, మలక్‌పేట, సలీంనగర్ ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాలకు డబ్బు జమ చేస్తారు. భారీ మొత్తంలో డబ్బు వసూలైతే ముంబాయి చైతన్షేట్కు అందజేస్తారు. వీరికి ప్రతి రోజూ కనీసం రూ.10 లక్షలు తగ్గకుండా కలెక్షన్ వచ్చేది. అయితే వీరిపై నిఘా పెరగడంతో కార్యాలయాన్ని నంద్యాల సలీంనగర్‌కు మార్చారు. నిర్వహణ బాధ్యతలను ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మిత్రుడు గఫూర్ అహ ్మద్కు అప్పగించారు. ఈ క్రమంలో 2013 నవంబర్ 21న కార్యాలయంపై దాడి చేసిన పోలీసులు కంప్యూటర్ ఆపరేటర్లు ధరణీధర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అరెస్టు చేశారు. బళ్లారి చౌరస్తా వద్ద అరెస్టు.. సయూద్ అహ్మద్, షరీఫ్ అహమ్మద్ కర్నూలు బళ్లారి చౌరస్తా వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో పూర్తి వివరాలు బయపడ్డాయి. వీరికి చెందిన 41బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కర్నూలుకు సంబంధించి సుదర్శన్‌గౌడ్(చున్నావాలిగల్లి), అన్వర్(నిమిషాబగుడి ఏరియా), కలీమ్, నాసీర్(గనీగల్లి ఏరియా), కరీమ్షేక్షా(పెద్దమార్కెట్), అన్వర్(జెమ్మిచెట్టు ఏరియా), విటల్(చిన్నమార్కెట్), అక్బర్, నిషార్‌అహ్మద్(బేకారిపేట), గని అహ్మద్(నంద్యాల), కరీమ్, పగిడ్యాలరాముడు, వహాబ్(నందికొట్కూరు), వహాబ్, శ్రీనివాసరెడ్డి(వెల్దూర్తి), మల్లికార్జున(డోన్) వీరి ఏజెంట్లుగా ఉన్నారు.