breaking news
shantahram
-
తెరపైకి శాంతారామ్ బయోపిక్
ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు, స్క్రీన్ రైటర్, ఎడిటర్ వి.శాంతా రామ్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘వి.శాంతారామ్: ది రెబల్ ఆఫ్ ఇండియన్ సినిమా’ టైటిల్‌తో ఈ బయోపిక్ రానుంది. సిద్ధాంత్ చతుర్వేది ఆయన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాని సోమవారం ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరితా అశ్విన్ వర్దే నిర్మించనున్నారు. ‘‘శాంతారామ్‌గారి బయోపిక్‌లో నటించడం అనేది నా జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని చె΄్పారు సిద్ధాంత్. ‘‘శాంతారామ్‌గారు చేసిన ప్రయోగాలు, ధైర్యం వల్లే ఈ రోజు సినిమా ఇంత గొప్పగా తెరపై కనిపిస్తోంది. ఈ కథకు దర్శకుడిగా న్యాయం చేయగలనని భావిస్తున్నాను’’ అన్నారు అభిజీత్. -
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన శాంతారాం
లేపాక్షి : లేపాక్షి ఆలయాన్ని హైదరాబాద్ ఆర్పీఎఫ్ డిప్యూటీ చీఫ్ సెక్యురిటీ కమిషనర్ పీవీఎస్ శాంతారాం శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆలయంలోని ఏడుశిరస్సుల నాగేంద్రుడు, ప్రసద్ధి గాంచిన నంది విగ్రహం, శిల్పాలను చూసి తన్మయత్వం చెందారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.


