breaking news
sewing
-
‘కుట్టు’రట్టు !
సాక్షి, అమరావతి: మార్కెట్లో రెడీమేడ్ దుస్తుల తాకిడి పెరిగింది. కుట్టు మెషిన్ సెంటర్లు పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో వేలాది మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి మెషిన్లు ఇచ్చినా వాటి ద్వారా వారి కుటుంబాన్ని పోషించుకునేంత ఉపాధి ఉండదనేది ఎవరినడిగినా చెబుతారు. అయినా ప్రభుత్వ పెద్దలు పంతం పట్టి మరీ కుట్టు శిక్షణ, కుట్టు మెషిన్ల పంపిణీ అంటూ రూ.కోట్లు ప్రజాధనం వృథాకు చేస్తున్న యత్నాలు అనుమానాలకు తావిస్తున్నాయి. పదేళ్ల క్రితం పాతబడిన కుట్టు శిక్షణ స్కీమ్‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ(పీఎం విశ్వకర్మ) స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల్లోనూ పరిగణనలోకి తీసుకోకపోయినా రాష్ట్రంలో చేపట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖ ద్వారా అవుట్‌డేటేడ్ స్కీమ్‌ను అమలు చేయడం ద్వారా అడ్డగోలు స్కామ్‌కు స్కెచ్ వేశారన్నది తేటతెల్లమవుతోంది. టెండర్ నుంచి శిక్షణ వరకు అనేక లోపభూయిష్ట పద్ధతులు అనుసరించడంతోపాటు నిబంధనలూ ఉల్లంఘించిన ఈ స్కీమ్‌లో ఇప్పుడు బిల్లుల కోసం పైరవీలు ఊపందుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన రెండు సంస్థలకు వర్క్ ఆర్డర్ కీలక నేతల ఆశీస్సులతో రంగంలోకి దిగిన చిత్తూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మక్కై భారీ స్కామ్‌కు కుట్ర పన్నినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.257 కోట్లతో ప్రతిపాదించిన కుట్టు శిక్షణ, కుట్టు మెషిన్ల పంపిణీ పథకానికి తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌తోపాటు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నిర్వహిస్తున్న రెండు సంస్థలను ఎంప్యానల్ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నుంచి సెక్యూరిటీ డిపాజిట్(టెండర్ మొత్తంలో 2.5శాతం) తీసుకోకుండానే వర్క్ ఆర్డర్ ఇచ్చేయడం మరీ దారుణం. వాస్తవానికి టెండర్ ఖరారైన ఏడు రోజుల్లోగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తేనే అగ్రిమెంట్ ఇవ్వాలి. అధికారుల తప్పిదం బయటకు పొక్కడంతో కాంట్రాక్టర్‌కు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నోటీస్ ఇచ్చి మసిపూసి మారేడు కాయ చేసే యత్నం చేసినట్టు సమాచారం. స్కీమ్ అమలులో డొల్లతనం బట్టబయలు బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్ శాఖ ద్వారా రూ.257 కోట్లతో మొత్తం 1,02,832 మంది మహిళలకు ప్రతిపాదించిన ఈ స్కీమ్ అమలులో డొల్లతనం బట్టబయలైంది. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీ, ఈడబ్ల్యూఎస్‌కు చెందిన 3,43,398 మంది మహిళలు ఉచిత కుట్టు శిక్షణ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 72,080 మంది మాత్రమే శిక్షణ కోసం ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నేషన్) యాప్‌లో నమోదు చేసుకున్నారు. వారిలోనూ 52,513 మంది మాత్రమే శిక్షణ పొందుతున్నారని చెబుతున్నారు. వారిలో 75శాతం హాజరు ఉంటేనే ఉచితంగా కుట్టు మెషిన్ అందిస్తామని అధికారులు చెబుతున్నారు. 90 రోజుల శిక్షణకు హాజరవుతున్న వారిలో 75శాతం హాజరు ఉండేది ఎంత మందికి అనేది అధికారులకే ఎరుక. ఈ లెక్కలు గమనించినా ఈ స్కీమ్ పట్ల మహిళలు ఆసక్తి చూపడంలేదని, శిక్షణ ప్రక్రియ కూడా సక్రమంగా జరగలేదనేది జగమెరిగిన సత్యం. బిల్లుల కోసం కాంట్రాక్టర్ ఒత్తిళ్లు.. అధికారుల ససేమిరా కుట్టు శిక్షణ స్కీమ్ పేరుతో కాంట్రాక్టర్‌ను ముందు పెట్టి రూ.కోట్లు (బిల్లులు) కొట్టేసేందుకు పెద్ద ఎత్తున పైరవీలు సాగుతున్నాయి. తొలుత మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసం యత్నిoచి భంగపడిన కాంట్రాక్టర్ తాజాగా మొదటి దశ శిక్షణ పూర్తైందని, బిల్లులు చెల్లించాలని రకరకాలుగా అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. టెండర్ నుంచి శిక్షణ వరకు నిబంధనల్లో తీవ్ర ఉల్లంఘన ఉండటంతో బిల్లులు చెల్లిస్తే.. అది భవిష్యత్‌లో తమ మెడకు చుట్టుకుంటుందని ఆందోళన చెందుతున్న ఆర్థిక శాఖ అధికారులు అందుకు ససేమిరా అంటున్నారు. రంగంలోకి కీలక అధికారులు ఆర్థిక శాఖ అధికారులు బిల్లుల మంజూరుకు ఒప్పుకోకపోవడంతో అధికారపార్టీ నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన కీలక అధికారులు ఎలాగోలా బిల్లులు ఇప్పించేందుకు శక్తివంచన లేకుండా యత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల ఈడీలతో సమావేశం నిర్వహించి కుట్టు శిక్షణ హాజరు, తదితర అంశాలను ఆమోదించేలా ఒత్తిడి తెచ్చారు. ఎంపిక ప్రక్రియలో గ్రామ, మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారుల అనుమతి తీసుకునే రాష్ట్ర స్థాయి అధికారులు, డబ్బులు చెల్లింపు విషయానికి వచ్చేటప్పటికి జిల్లా స్థాయిలో ఒక బీసీ కార్పొరేషన్ ఈడీ సంతకం ఉంటే చాలు అనే నిబంధన విధించారు.ఈ నిబంధన వల్ల తాము ఇరుక్కుంటామని ఈడీలు ససేమిరా అంటున్నారు. తమ నియోజకవర్గంలో శిక్షణ పూర్తి అయ్యిందని కుట్టు మెషిన్లు ఇవ్వాలని ఎమ్మెల్యేల లేఖలు తీసుకుని బిల్లుల కోసం యత్నించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కుట్టు స్కీమ్ బిల్లుల విషయమై ఇటీవల మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు వద్ద కొందరు అధికారులు ప్రస్తావించినప్పుడూ ఆరి్థక శాఖ అధికారులు ససేమిరా అన్నట్టు విశ్వసనీయ సమాచారం. -
ఉద్యోగం కోల్పోతేనేం కుట్టు పనితో ఏకంగా..!
‘చేతిలో విద్య ఉంటే ఎడారిలో కూడా బతికేయవచ్చు’ అంటారు పెద్దలు. ఉద్యోగం కోల్పోయిన మంజూషకు కుట్టుపని బాగా తెలుసు. ఆ విద్యతో అతి తక్కువ పెట్టుబడితో ఫ్యాబ్రిక్ డిజైన్లకు సంబంధించిన ‘తోఫా’ బ్రాండ్‌కు శ్రీకారం చుట్టింది ముంబైకి చెందిన మంజూష ఆ బ్రాండ్ ద్వారా ఇప్పుడు లక్షలు అర్జించే స్థాయికి ఎదిగింది. ఎంతోమంది మహిళలకు ఉపాధి ఇస్తోంది.యాభై రెండేళ్ల వయసులో మంజూష ఉద్యోగం కోల్పోయింది. బతకడానికి, కుమార్తెను చదివించడానికి మరో ఉద్యోగం వెదుక్కోక తప్పని పరిస్థితి. ‘ఈ వయసులో నాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు?’ అనుకుంది. అయితే మంజూషకు ఒక లా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రోజూ గంటల తరబడి ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లాలి. నీరసంగా ఉండేది, నిస్పృహగా ఉండేది. అయినప్పటికీ ‘ఇల్లు గడుస్తుందిలే’ అనే చిన్న సంతృప్తితో ఉద్యోగం చేసేది.కొన్నిసార్లు ఉద్యోగం మానెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చేది. ఇంతలో కూతురు చదువు గుర్తుకు వచ్చి తన నిర్ణయాన్ని మార్చుకునేది. తల్లి మౌనవేదనను గమనించిన కూతురు ఆమెతో వివరంగా మాట్లాడింది. ‘నాకు ఉద్యోగం చేయాలని లేదు. కానీ తప్పదు’ అన్నది మంజూష. ‘ఉద్యోగం లేకుండా బతకలేమా!’ అన్నది కూతురు నజూక. ‘ఎలా?!’ అన్నది తల్లి.‘కుట్లు అల్లికలు నీ హాబీ. మనం హాయిగా బతకడానికి ఈ విద్య చాలు’ అన్నది నజూక ఆత్మవిశ్వాసంతో. ఇంటిలో ఒక మూలన వన్స్ అపసాన్ ఏ టైమ్ కుట్టుమిషన్ ఉంది. ‘నీ కూతురు చెప్పింది నిజమే. ముందుకు వెళ్లు’ అన్నట్లుగా అభయం ఇచ్చింది ఆ పాత కుట్టు మిషన్.కుమార్తె నజుకా జేవియర్‌తో కలిసి ‘తోఫా’కు శ్రీకారం చుట్టింది మంజూష. ‘ఒకవేళ ఈ వ్యాపారంలో విఫలమైతే! ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందా....’ ఇలా రకరకాల సందేహాలు వచ్చేవి మంజూషకు. అయితే ఒక్కసారి పనిలో మునిగి΄ోయాక ఆ సందేహాలు దూరం అయ్యేవి. ఎంతో ధైర్యం వచ్చేది.చెన్నైలో జరిగిన ఎగ్జిబిషన్లో పాల్గొన్న తరువాత తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఇంటి అలంకరణలు, ఫ్యాబ్రిక్ డిజైన్లకు సంబంధించి తన బ్రాండ్‌కు అక్కడ మంచి స్పందన వచ్చింది. రెండు వేల రూపాయల పెట్టుబడితో మొదలు పెట్టిన ఈ బ్రాండ్ ఇప్పుడు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది.‘సొంతంగా ఏదో ఒకటి చేయాలని ఎప్పటినుంచో అనుకునేదాన్ని. కాని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. మరిచిపోయాను అనుకున్న కళ మళ్లీ నా దగ్గరకు వచ్చింది. కుట్టుపని నాలో ఆత్మవిశ్వాసాన్ని, నా జీవితంలో వెలుగుల్ని నింపింది’ అంటుంది మంజూష.మార్కెంటింగ్‌లో పట్టా పుచ్చుకున్న కూతురు నజూక బ్రాండ్ రూపకల్పనలో, విజయవంతం చేయడంలో తల్లికి సహాయం అందించింది. ‘అమ్మ దుబారా ఖర్చు చేసేది కాదు. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చేది. చిన్నప్పుడు నాకోసం బట్టలు కొనేది కాదు. పాత చీరలు, ఇతర దుస్తుల నుంచి నాకు అందమైన డ్రెస్‌లు కుట్టేది. అప్పటి ఆ విద్య వృథా పోలేదు. మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది’ అంటుంది నజూక.‘కుమార్తె రూపంలో యువతరంతో కనెక్ట్ కావడం వల్ల ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను. అప్డేట్ అయ్యాను. మా వ్యాపారంలో ఇప్పటి వరకు ప్లాస్టిక్ వాడలేదు’ అంటుంది మంజూష. ‘తోఫా’ ద్వారా తాను ఉపాధి పొందడమే కాదు ఎంతోమంది చేతివృత్తి కళాకారులకు ఉపాధిని ఇస్తోంది మంజూష. వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న మహిళలను ఉద్దేశించి... ‘భయం, సందేహాలు ఎప్పుడూ ఉండేవే. అయితే అవి మన దారికి అడ్డుపడకుండా చూసుకోవాలి’ అంటుంది.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది సిగరెట్ అంటించకండి!) -
అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అనంతపురంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేసింది. స్థానిక ఆదిమూర్తి నగర్‌లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రాంగణంలో నిరుపేద మహిళలకు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. మహిళలు స్వశక్తితో ఎదగాలనేదే నాట్స్ ఆశయమని బాపు నూతి అన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్ కృషి చేస్తుందన్నారు. అనంతపురం ఆర్డీటితో కలిసి నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళల కోసం కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బాపు నూతి తెలిపారు. ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల అధినేత ఆంజనేయులు, నాయుడు, సాయి, అనిల్ కుమార్ నాట్స్ సభ్యులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చేయూత అందిస్తున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్ -
రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్‌బర్గ్ ఫోటో వైరల్
ముగ్గురు ఆడపిల్లల మురిపాల తండ్రి మెటా సీయివో మార్క్ జుకర్‌బర్గ్. మాగ్జిమా (7), ఆగస్ట్(5)లకు తోడుగా గత మార్చి నెలలో ఈ లోకంలోకి వచ్చింది ఔరేలియ. ‘వెల్కమ్ టూ ది వరల్డ్’ అంటూ ఆ చిట్టి ఫోటోను పోస్ట్ చేసి స్వాగతం పలికాడు జుకర్‌బర్గ్. తాజా విషయానికి వస్తే... పెద్దమ్మాయి, రెండో అమ్మాయిల కోసం తానే స్వయంగా త్రీడీ ప్రింటింగ్ డ్రెస్‌లను డిజైన్ చేయడంతో పాటు కుట్టుపని కూడా నేర్చుకున్నాడు జుకర్‌బర్గ్. తాను డిజైన్ చేసిన గౌన్‌ను పిల్లలు ధరించారు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు జుకర్‌బర్గ్. ఈ ఫొటో బాగా వైరల్ అయింది. చదవండి: కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల.. ‘జుకర్ బర్గ్... మీరు ఎన్ని గొప్ప విజయాలు సాధించినా సరే, పిల్లల డ్రెస్ కోసం కేటాయించిన సమయం అత్యంత విలువైనది. భవిష్యత్‌లో మీ పిల్లలకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలువైన సందర్భం ఇది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
కుట్టుపట్టు
ముందే పట్టు పట్టుకుందామన్నా పట్టు దొరకదుఅలా జారిపోయే సిల్క్ ఇది.దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్!ఈ చేతి కుట్టు తర్వాతచీర మీదపట్టు దొరుకుద్ది గానీధరే పట్టు చిక్కదు.చూసి ఆనందిద్దాంవీలైనప్పుడు కొందాంలేదంటే...ఈ కుట్టు పట్టుకే కాదుఅన్ని చీరలకూక్రియేటివ్గా కుట్టితక్కువలో కొట్టేద్దాం. ⇔ నలుపు రంగు చీరకు వెడల్పాటి అంచులా ఎంబ్రాయిడరీ పనితనం జిలుగులు పోతోంది. చిరు నగవులతో పోటీపడుతూ కొత్త అందాలు విరబూస్తోంది. ⇔ జరీతో అల్లిన మామిడిపిందెల డిజైన్ అంచుజత చేస్తే ఏ రంగు చీరైనా ఇలా ముచ్చటగారూపుకట్టాల్సిందే! ⇔ రాణీపింక్ చీరపై జరీ దారాలు, ముత్యాల వరుసలు కొంగొత్తగా రూపుకట్టి కొత్త కళను మోసుకొచ్చాయి. ⇔ పట్టుచీరే బంగారం. ఇక ఎంబ్రాయిడరీ హంగులు తోడైతే వేడుకకే సింగారం. ⇔ పచ్చని చీరకు గులాబీ రంగు అంచు సంప్రదాయాన్ని కూడా సై్టలిష్‌గా మార్చేస్తుంది. ⇔ జరీ జిలుగులతోనూ, అద్దాలతోనూ అంచుగా రూపు కట్టిన బంగారు రంగు చీర వేదికపై వెలుగు పూలు వెదజల్లుతుంది. -
ఆభరణాల కుట్టు!
న్యూలుక్ సంప్రదాయ సాదాసీదా జాకెట్టుకు అద్భుతమైన ‘కుట్టు’తో ఆకట్టుకోవడం మనకు తెలిసిందే! అలాగే పాశ్చాత్య ప్లెయిన్ టీ షర్ట్లు, ట్యూనిక్‌లు, క్రాప్ టాప్స్‌ను తీర్చిదిద్దితే... వాటికి ఆభరణాల సొగసు అద్దితే వచ్చే అందమే వేరు. ప్యాంట్, స్కర్ట్స్ మీదకు వీటిని ధరిస్తే... వచ్చే లుక్కే వేరు! ⇔ మెటల్ పూసలు, చమ్కీలు, స్టోన్స్ ఇందుకోసం ఎంపిక చేసుకోవాలి. వీటిని గుచ్చడానికి ప్లాస్టిక్ దారం, సూది, గమ్ అవసరం అవుతాయి. ⇔ డిజైన్ చేసుకున్న చోట ముఖ్యంగా నెక్, స్లీవ్స్‌కి ఎలాంటి డిజైన్ బాగుంటుందో ముందే మార్క్ చేసుకోవాలి. ⇔ షర్ట్, లేదా ట్యూనిక్ కలర్ దానికి పూర్తి కాంట్రాస్ట్ పూసలు లేదా స్టోన్స్ ఎంచుకోవాలి. ⇔ దారంతో పూసలను గుచ్చి, మార్క్ చేసుకున్న చోట పెట్టి కుట్టు వేయాలి. స్టోన్స్ అయితే గమ్ (మార్కెట్లో దుస్తులకు అతికించి ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుతుంది)తో అతికించాలి. ⇔ సృజనకు ఆకాశమే హద్దులా దుస్తులకు ఆభరణాల సొగసు తేవడంలో హద్దులే లేవు.


