breaking news
Seventh Pay Commission recommendations
-
దీపావళి కానుక.. 3 శాతం డీఏ పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. డీఏ, డీఆర్ వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70 కోట్లు భారం పడనుంది. 47.14 లక్షల కేంద్ర ఉద్యోగులు, 68.62 లక్షల పింఛనర్లు లబ్ధి పొందనున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది కరువు భత్యం నిలిపివేసిన విషయం విదితమే. ఈ ఏడాది జూలైలో పునరుద్ధరిస్తూ 17% నుంచి 28 శాతానికి పెంచారు. తాజా పెంపుతో అది 31 శాతానికి చేరుకుంది. మూడంచెల పర్యవేక్షణ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) అమలుకు మార్గం సుగమమైంది. గురువారం భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) రూ.100 లక్షల కోట్ల విలువైన పీఎం గతిశక్తికి ఆమోదం తెలిపింది. మూడంచెల పద్ధతిలో దీన్ని పర్యవేక్షించనున్నట్లు కేంద్రం పేర్కొంది. పీఎం గతిశక్తి మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలో అంతర్ మంత్రిత్వశాఖల సహకారంతో పాటు అంతర్ విభాగాల సహకారం ఓ గేమ్ చేంజర్ కానుందని తెలిపింది. పీఎం గతిశక్తి ని ప్రధాని 13న ప్రారంభించారు. రాబోయే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళికతో పునాది వేస్తున్నట్లు చెప్పారు. -
టీచర్లకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : ఏడవ వేతన సంఘం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ అకడమిక్ స్టాఫ్, ప్రభుత్వ ఎయిడెడ్ సాంకేతిక విద్యాసంస్ధల ఉద్యోగులకూ వర్తింపచేయాలనే ప్రతిపాదనను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ 1241.78 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా పెరిగిన వేతన బకాయిలను ఆయా సంస్థలకు కేంద్రం రీఎంబర్స్ చేయనుంది. మరోవైపు ఫిబ్రవరి 1న మోదీ సర్కార్ ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లో వేతన పెంపుపై 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో వేతన పెంపు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ 18,000ను రూ 26,000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఫిట్‌మెంట్‌ను సైతం ప్రస్తుతమున్న 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లకు పెంచాలని పట్టుబడుతున్నాయి. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు బొనాంజా..
సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వేతన, పెన్షన్ సవరణలతో పాటు వారి ప్రధాన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలకు అనుకూలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని టెలికమ్యూనికేషన్ల మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని మంత్రి చెప్పారు. కాగా, బీఎస్ఎన్ఎల్లో ప్రస్తుత ఉద్యోగుల వేతన సవరణతో ముడిపెట్టకుండా తమకు వేరుగా పెన్షన్ సవరణ చేపట్టాలన్నరిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్‌కు టెలికాం మంత్రిత్వ శాఖ అంగీకరించిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 15 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణకు మార్గం సుగమం కానుంది. బీఎస్ఎన్ఎల్కు మార్కెట్ వాటా బలోపేతం కోసం సంస్థకు 4జీ స్పెక్ర్టమ్ కేటాయించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ డిమాండ్‌ను నొక్కిచెబుతూ నిరవధిక సమ్మెకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవగా బీఎస్ఎన్ఎల్కు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు కోరుతూ టెలికాం శాఖ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేయడం గమనార్హం. -
వినియోగం... వృద్ధికి ఊతం!
♦ 7వ వేతన సంఘం సిఫారసుల అమలుపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ ♦ 7.9% వృద్ధి రేటు అంచనాలు ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ అంతంతమాత్రమే న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులు 23.5 శాతం పెంపుదలకు సంబంధించి ఏడవ వేతన సంఘం సిఫారసులకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటయిన కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సిఫారసుల అమలుకు దాదాపు రూ. లక్ష కోట్లను(జీడీపీలో 0.7%) కేంద్రం కేటాయించాల్సి ఉం టుంది. ఆర్థిక వ్యవస్థలో ఆయా పరిణామాలు ఎలా ఉం టాయన్న అంశంపై చర్చ ప్రారంభమైంది. సిఫారసుల అమలుతో ద్రవ్యోల్బణం కొంత పెరిగినా.. మొత్తంగా వీటి అమలు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందులో కొన్ని అంచనాలు క్లుప్తంగా చూస్తే... ⇒ వినియోగం 0.3 శాతం పెరుగుతుంది. పొదుపులు 0.2 శాతం పెరుగుతాయి. పన్ను ఆదాయం 0.9 శాతం వృద్ధి చెందుతుంది. ⇒ పెరిగిన వేతనాలు, అలవెన్సులు డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే దీనివల్ల ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఒక మోస్తరుగా ఉన్నా... మొత్తంగా ఈ పరిణామం ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ⇒ దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవల వినియోగ డిమాండ్ మెరుగుపడుతుంది. 2015-16లో 7.6%గా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.9%కి పెరిగే వీలుంది. పరిశ్రమల హర్షం కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి ఈ నిర్ణయం వల్ల దేశ మధ్య తరగతి ప్రజ వినియోగ డిమాండ్ ఊపందుకుంటుందని, తద్వారా ఈ వృద్ధికి ఊపు లభిస్తుందని సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ పేర్కొన్నారు. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నది సైతం తమ అభిప్రాయమని అన్నారు. తాజా నిర్ణయం జీడీపీ వృద్ధి 8 శాతం స్థాయికి పెరిగేందుకు దోహదపడుతుందని ఫిక్కీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికితోడు తగిన వర్షపాతమూ నమోదయితే ఆటోమొబైల్, కన్జూమర్ ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, హౌసింగ్ వంటి రంగాల్లో చక్కటి వృద్ధి తీరు నమోదవుతుందని అసోచామ్ మరో ప్రకటనలో తెలిపింది. అయితే ప్రభుత్వం ద్రవ్యలోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలనీ సూచిం చింది. కాగా గృహ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని రియల్టీ ప్రముఖ సంస్థలు క్రెడాయ్, ఎన్ఏఆర్ఈడీసీఓలు వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నాయి. ఇది చక్కటి నిర్ణయమని క్రెడాయ్ అధ్యక్షుడు గీతాంబర్ ఆనంద్, ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ చైర్మన్ రాజీవ్ తల్వార్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యలోటుపై ప్రభావం: ఎస్బీఐ సిఫారసుల అమలు వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం)పై ప్రభావం చూపుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక పరిశోధనా విభాగం అభిప్రాయపడింది. ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటూనే 2017-18లో ద్రవ్యలోటుపై ప్రభావం తప్పదని స్పష్టం చేసింది. ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల (జీడీపీలో 0.7 శాతం) భారం పడుతుందని ఎస్బీఐ అంచనా. అయితే 2016-17లో కేటాయింపులు రూ.53,844 కోట్లు కావడం గమనార్హం. కార్ల కంపెనీల ఆశలు.. వేతన సంఘం సిఫారసుల అమలు తమకు లాభాలను పంచుతుందని ఆటో కంపెనీలు భావిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండాసహా పలు కార్ల తయారీ కంపెనీలు అమ్మకాల మెరుగుదల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ⇒ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్ల అమ్మకాల్లో 25 శాతం వృద్ధి నమోదవుతుందనీ, దీనితో ఇందుకు సంబంధించి 2.5 లక్షల కార్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్ల అమ్మకాలకు సంబంధించి కీలకమైన విభాగమని తెలిపింది. మొత్తం అమ్మకాల్లో ఈ విభాగం వాటా దాదాపు 17 శాతం. 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్లకు అదనపు ఆదాయం కార్ల అమ్మకాల పెరుగుదల దోహదపడుతుందని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంస్థ 2 లక్షల కార్లను విక్రయించింది. ‘వీల్స్ ఆన్ ఇండియా’ కార్యక్రమం కింద కంపెనీ ప్రభుత్వ ఉద్యోగులకు 2006 నుంచీ మొత్తం 15 లక్షల వాహనాలను విక్రయించింది. ⇒ హోండా కార్స్ ఇండియా: ఆటో పరిశ్రమకు ఇది ఒక సానుకూల అంశమని సంస్థ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్ ) జ్ఞానేశ్వర్ సేన్ పేర్కొన్నారు. దీనివల్ల అమ్మకాల్లో వృద్ధి కనబడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ⇒ హోండా కార్స్ ఇండియా:హ్యుందాయ్ మోటార్స్: మార్కెటింగ్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ మాట్లాడుతూ, దీర్ఘకాలంలో సైతం కార్ల అమ్మకాలు పెరగడానికి తాజా పరిణామం దోహదపడుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో కస్టమర్లను మరింత ఆకర్షించడానికి తమ ప్రైడ్ ఆఫ్ ఇండియా ఆఫర్ కింద ప్రస్తుతం ఇస్తున్న ప్రోత్సాహకాలకు అదనంగా మరో రూ.7,000 విలువైన ప్రోత్సాహకాలను అందించనున్నట్లూ తెలిపారు. వినియోగం 45 వేల కోట్లు వృద్ధి... 7వ వేతన సంఘం సిఫారసుల వల్ల దేశీయ వినియోగం రూ. 45,110 కోట్లు (జీడీపీలో 0.30%) పెరుగుతుంది. రూ. 30,710 కోట్ల (జీడీపీలో 0.20 శాతం) గృహ పొదుపు పెరుగుతుంది. మా అంచనా ప్రకారం ప్రభుత్వంపై తక్షణ భారం రూ.94,775 కోట్లు (జీడీపీలో 0.63 శాతం) ఉంటుంది. అయితే వినియోగంపై ఎక్సైజ్ పన్నుల వంటి రాబడులు మినహాయిస్తే., నికరంగా ఈ భారం కేంద్రంపై రూ.80,641 కోట్లని (జీడీపీలో 0.54 శాతం) అంచనా ఉంది. - ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ద్రవ్యోల్బణంపై ఎఫెక్ట్... సిఫారసుల అమలు ద్రవ్యోల్బణం స్వల్ప పెరుగుదలకు దారి తీస్తుంది. ప్రత్యేకించి సేవలు, తయారీ రంగాల్లో ఈ ప్రభావం కనిపించే వీలుంది. ఇక సానుకూలతకు వస్తే... వినియోగ వస్తువులు, సేవలకు డిమాండ్ పెరగడం ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే అంశం. - అతిది నయర్, ఐసీఆర్ఏ సీనియర్ ఎనకమిస్ట్ అయినా ఇబ్బంది లేదు... ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నా... అంతర్జాతీయంగా క్రూడ్ ధరల కట్టడి, అలాగే రుతుపవనాల వల్ల తగిన వర్షపాతం వంటి సానుకూల అం శాలు ద్రవ్యోల్బణాన్ని ఉపశమింపజేయడానికి దోహదపడతాయి. సిఫారసుల అమలుతో విని యోగ డిమాండ్ పెరగడం 7.9% వృద్ధికి దోహదపడే అంశం. - డీకే జోషీ, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్