breaking news
september 26th
-
26 నుంచి వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ఏపీలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించి దీక్ష తేదీని ఖరారు చేశారు. పార్టీ కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్ జగన్ పార్టీ నేతలను ఆదేశించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో దీక్ష చేపట్టాలని వైఎస్ జగన్ ఇంతకుముందు నిర్ణయించారు. అయితే 17న వినాయక చవితి పండగ ఉండటంతో పార్టీ శ్రేణుల సూచన మేరకు దీక్ష తేదీని వాయిదా వేసుకున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పార్టీ నేతలతో చర్చించి దీక్ష తేదీని ఖరారు చేశారు. -
26 నుంచి వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష