breaking news
self-proclaimed
-
పసికూనలకు రక్షణ..లా
పసిపిల్లలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వాడుకునే నీడలు ఎక్కువ. నీడలు వారిని బంధిస్తాయి వారితో చెడు పనులు చేస్తాయి వారి పసితనాన్ని అశుభ్రం చేస్తాయి.నీడలు ఈ పనికి దేవుణ్ణో, దెయ్యాన్నో తోడు తెచ్చుకుంటాయి. తల్లిదండ్రులు స్వయంగా తీసుకెళ్లి అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో పిల్లల్ని ఈ నీడలకు అప్పగిస్తారు. పిల్లలు పులి నోటికి చిక్కుతారు. న్యాయం ఎప్పుడోగాని ఉదయించదు. జమ్ము–కశ్మీర్లో మంత్రాల పేరు చెప్పి పిల్లలను లైంగికంగా వేధించిన బాబాకుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉద్వేగంగా కవిత రాశారు. భయం లేని వేకువకై ప్రార్థించారు.జనవరి, 2021.మదనపల్లె ఘటన అందరికీ గుర్తుంది. మూఢ విశ్వాసం నెత్తికెక్కి ఇద్దరు ఎదిగొచ్చిన కుమార్తెల ఉసురు తీశారు తల్లిదండ్రులు. చనిపోయాక వారు సత్యయుగంలో జన్మిస్తారట. అందుకోసమని బతికుండగానే సమాధి చేశారు.ప్రాణం పోయడం దైవం. ప్రాణం తీయడం దెయ్యం.అక్టోబర్, 2024.చత్తిస్‌గఢ్‌లోని శక్తి జిల్లా.తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇద్దరు కుమారులను గొంతు పిసికి చంపేసింది. తర్వాత ఉజ్జయినీ నుంచి తెచ్చుకున్న ఒక ‘గురువు’ ఫొటో పెట్టుకొని ఆ చనిపోయిన కుమారులనుప్రాణాలతో లేచేందుకు మంత్రాలు చదవడం మొదలెట్టింది. ఇదంతా ఆమె తంత్ర సాధనలో భాగమట.కడుపున పుట్టిన వారినే కాటేసే గుడ్డితనమే అంధ విశ్వాసం.జూన్, 2024.తమిళనాడులోని అలియలూరు జిల్లా.లేక లేక మనవరాలు పుడితే ఆ పుట్టిన శకునం బాగ లేదని స్వయంగా తాతే ఆ పసికూన ప్రాణాలు తీశాడు. ఆ శకునం కుటుంబానికి హానికారక సూచన కనుక ఈ పని చేశాడట.చేతులతో పూజ చేయడం భక్తి. అదే చేతులతో పీక పిసకడం మూఢ భక్తి.ఫిబ్రవరి 18, 2025.జమ్ము–కశ్మీర్‌లోని సొపోర్ నగర కోర్టులో చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ మీర్ వజాహత్ ఒక 123 పేజీల తీర్పును వెలువరించారు. ఆ తీర్పు అంతా మూఢ విశ్వాసాల వల్ల చిన్నపిల్లల మీద సాగుతున్న దౌర్జన్యాల పట్ల, అకృత్యాల పట్ల ఆవేదన. కారణం? ఆ తీర్పు ఏజాజ్ అహ్మద్ అనే దొంగబాబా పసిపిల్లల మీద సాగించే అకృత్యాల మీద కావడం. ఈ ఘోరాన్ని ఆ బాబా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఉండటం. విషయం తెలియకనే తల్లిదండ్రులు అందులో భాగం కావడం.ఏం జరిగింది?జమ్ము–కశ్మీర్లో ‘పీర్ బాబా’గా పేరుబడ్డ ఏజాజ్ షేక్ దగ్గరకు చాలా మంది తమ దైనందిన బాధల నుంచి విముక్తి కోసం వచ్చేవారు. అనారోగ్యం, ఆర్థిక బాధలు, తగవులు... వీటికి విరుగుడు కోసం ఆయన దగ్గరకు మంత్ర తంత్రాలకు వచ్చేవారు. అయితే ఇక్కడే ఆ బాబా ఒక చిట్కా పాటించేవాడు– ‘మీ కష్టాలు పోవడానికి దైవ సహాయం కంటే ‘జిన్ను’ (భూతం)ల సాయం మంచిది. జిన్నులతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. అయితే జిన్నులు పెద్దల కంటే పిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడతాయి. మీరు మీ పిల్లల్ని (అబ్బాయిల్ని) తెచ్చి నాకు అప్పగిస్తే తంత్రాలు ముగిశాక మళ్లీ మీకు అప్పగిస్తాను’ అనేవాడు. అమాయక/ఆశబోతు తల్లిదండ్రులు ఈ మాటలు నమ్మి తమ పిల్లల్ని బాబా దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు. పదేళ్లలోపు మగపిల్లలుఈ బాబా చేతిలో బాధితులుగా మారిన వారందరూ పదేళ్ల లోపు అబ్బాయిలే. బాబా వారిని పూజ పేరుతో నగ్నంగా మార్చి అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాడని ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. పిల్లల్ని భయపెట్టేందుకు బాబా తనలోనే ‘జిన్’ ఉందని, అది అన్ని కష్టాల నుంచి దూరం చేస్తుందని, కోరికలు నెరవేరుస్తుందని చెప్పి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. కొందరు పిల్లలు నాలుగైదు ఏళ్లపాటు ఇతని వల్ల బాధ పడ్డారు. భయం వల్ల, ఆ బాబా స్కూల్ టీచర్ కూడా కావడం వల్ల నోరు మెదపలేక తల్లిదండ్రులు బాబా దగ్గరికెళ్దామంటే వారు మొండికేయడం మొదలెట్టారు. అప్పుడు గాని పెద్దలకు అనుమానం రాలేదు. ఒక బాలుడు తెగించి తండ్రికి జరిగేది చెప్పడంతో బండారం బయటపడింది.శిక్ష పడింది2016లో బాబా అకృత్యాలు బయటపడి బేడీలు పడ్డాయి. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబాకు ఫిబ్రవరి 18న న్యాయమూర్తి మీర్ వజాహత్ 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు భక్తి, విశ్వాసాలను జనం బలహీనతగా ఎంచి దొంగ వేషగాళ్లు పసిపిల్లలను కబళించడంపై న్యాయమూర్తి తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బాబాలు మొత్తం విశ్వాస ప్రపంచానికి విఘాతం కలిగిస్తారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం కేసు మీద ఒక లోతైన, సంకేతపూర్వకమైన కవిత రాశారు. ఎంత కదిలిపోతే ఇంత గాఢమైన కవిత వస్తుందనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జస్టిస్ మీర్ వజాహత్ రాసిన కవితవిశ్వాసపు గుసగుసలు... భయవిహ్వల పెనుకేకలువెలుగు దుస్తులు ధరించి నిలిచిన వాడుకారు చీకటిలో దారి చూపుతానని మాటిచ్చాడుగుసగుసగా మంత్రాలు జపిస్తూ తన పవిత్ర హస్తాలతోఅంగలార్చే నేలలో విశ్వాసపు బీజాన్ని నాటాడుసాంత్వనకై వెదుకుతూ అభయానికై తపిస్తూవి΄్పారిన నేత్రాలతో చేరవచ్చిందొక పసితనంకానీ ఆ వెలుగుల మాటున చీకటి నీడలుగడ్డకట్టిన మంచులా వణికించిన గుసగుసలు‘భూతమంటే భయమేలే కానీ నాపై నమ్మకముంచునిన్ను బయటపడేసే తాళంచెవి నా దగ్గరుంది’పవిత్ర వేషంలో మాటలే సంకెళ్లుఇక గొంతు దాటని రోదన... విశ్వాసం గల్లంతుచెప్పినట్టు, తాకినట్టు, దయగా చూసినట్టుమాయామంత్రాల మత్తుగాలి... ఆశలను బూడిద చేస్తూకానరాని వలయాల్లో సుళ్లు తిరిగిన ఉత్త మాటలుఇక మిగిలింది కలవర పెట్టే పీడకలలుఏళ్లు గడిచిపోతాయి... పుళ్లు సలుపుతూనే ఉంటాయికాని ఆ నొప్పి వెనుక దాగి వెంటాడే ఆనాటి గుసగుసలుచీలికలైనదేదీ అతుకు పడనే లేదునిబద్ధమై ఉండాల్సిన ఆత్మ గాలివాటుగా పరిభ్రమిస్తూకాని నిజం తలెత్తుకుని నిలబడుతుందిజాతకాలు తలకిందులవుతాయిన్యాయానికి ఎదురు నిలవక నీడలు చెదిరిపోతాయిగాయాల ఆనవాళ్లు మాసిపోవేమోలే కానీభయం లేని వేకువలో భళ్లున తెల్లారుతుంది -
ఇలాంటోళ్లు దేశానికి అవసరమా?
బెంగళూరు: కశ్మీర్‌కు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న ప్రతిపాదనపై ఆలోచించాలన్న కాంగ్రెస్ నేత, మాజీ హోం మంత్రి చిదంబరం వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. దేశ సైనికుల త్యాగాలతో రాజకీయాలు చేస్తున్న ఇలాంటి వారి వల్ల దేశానికి ప్రయోజనం ఉందా? ఎలాంటి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వేర్పాటువాదులు, పాకిస్తానీయుల తరహాలో మాట్లాడుతోందని, అది కశ్మీర్లో ప్రాణత్యాగం చేసిన వేలాది మంది సైనికులను అవమానించడమేనని ఆయన దుయ్యబట్టారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నిస్సిగ్గుగా కశ్మీర్‌పై మాట మారుస్తుందని, ఈ విషయంలో ఆ పార్టీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బెంగళూరులో ఆదివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడదని మోదీ స్పష్టం చేశారు. ‘నిన్నటి వరకూ అధికారంలో ఉన్న వారు కశ్మీరీయులకు స్వాతంత్య్రం అంటూ మాట్లాడుతున్నారు. గతంలో అధికారంలో ఉండి దేశ అంతర్గత భద్రత, జాతీయ భద్రతకు బాధ్యత వహించినవారే ఇలా మాట్లాడడంతో నేను ఆశ్చర్యపోయా’ అని చిదంబరం పేరును ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. ‘మాతృభూమి రక్షణ కోసం, కశ్మీరీయుల కోసం దేశ సైనికులు వారి ప్రాణాల్ని త్యాగం చేశారు. ఆ ప్రకటనకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. దేశం కోసం తమ కొడుకుల్ని పోగొట్టుకున్న తల్లులు, సోదరుడ్ని పోగొట్టుకున్న సోదరీమణులు, తండ్రుల్ని పోగొట్టుకున్న చిన్నారులకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు. సర్జికల్ దాడుల్ని జీర్ణించుకోలేకపోయారు గతేడాది ఎల్వోసీ వెంట భారత్ జరిపిన సర్జికల్ దాడుల్ని ప్రధాని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆ దాడుల్ని జీర్ణించుకోలేకపోయిందని విమర్శించారు. ‘మన సైనికులు శత్రువుకు గట్టిగా సమాధానమిచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నేత ప్రకటన చూశాక సర్జికల్ దాడులపై వారి ఆగ్రహం ఎందుకో నాకు అర్థమైంది. మన సైనికుల ధైర్య సాహసాలు, భారత్ దౌత్య బలం, ధైర్యం, ప్రతిఘటనా సామర్థ్యాన్ని డోక్లామ్ ఘటనలో ప్రపంచం మొత్తం చూసింది’ అని ప్రధాని పేర్కొన్నారు. కశ్మీర్లో అత్యధికుల ఉద్దేశం మరింత స్వయం ప్రతిపత్తే: చిదంబరం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం కోరుతున్న కశ్మీర్ ప్రజల్లో అత్యధికుల అసలు ఉద్దేశం మరింత స్వయం ప్రతిపత్తి కోరడమే’ అని అన్నారు. కశ్మీర్ ప్రజలతో స్వాతంత్య్రం విషయమై మాట్లాడినప్పుడు ఈ అవగాహనకు వచ్చానన్నారు. తన సమాధానాన్ని ప్రధాని అర్థం చేసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ‘నాపై విమర్శలు చేస్తున్న వారు మొత్తం సమాధానాన్ని చదవాలి. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుందో చెప్పాలి. దయ్యాన్ని ఊహించుకుని దాడిచేస్తున్నారు’ అని ప్రధానిని విమర్శించారు. మంజునాథ ఆలయం సందర్శన సాక్షి, బెంగళూరు, బళ్లారి: దక్షిణ కన్నడ జిల్లాలోని ఉజిరెలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మోదీ రూపే కార్డుల్ని అందచేశారు. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో సౌందర్యలహరి పారాయణోత్సవంలో పాల్గొన్నారు. బీదర్‌లో రూ.1500 కోట్లతో నిర్మించిన బీదర్–కలబుర్గి రైలు మార్గాన్ని ప్రారంభించారు. హైదరాబాద్– కర్ణాటక ప్రాంత సమగ్రాభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు యోచిస్తున్నట్లు మోదీ తెలిపారు. ప్రధాని ఎలాంటి ఆహారం తీసుకోకుండా ధర్మస్థలలోని మంజునాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. -
ఆర్బీఐ స్వేచ్ఛను కాపాడాలి!
మాజీ గవర్నర్ బిమల్ జలాన్ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్వయం ప్రతిపత్తిని నిలబెట్టాల్సిన అవసరం ఉందని మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆకాంక్షించారు. 1997 నుంచి 2003 మధ్య జలాన్ ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ‘ప్రతిష్ట మసకబారే సమస్య’ను ఆర్బీఐ ఎదుర్కొంటోందని మరో మాజీ గవర్నర్ వైవీ రెడ్డి చేసిన కామెంట్ నేపథ్యంలోనే జలాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘ఆర్బీఐ స్వతంత్రత ప్రాథమిక అంశం. దీనిని అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ అంశంపైనా దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం. ఇక రూ.500, రూ.1000 నోట్ల రద్దు వృద్ధిపై ఎంతశాతం ప్రభావం చూపుతుందన్నది చెప్పడం చాలా కష్టం. అయితే వృద్ధి తగ్గుతుందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. పరిస్థితిని ఊహించి చెప్పడం కన్నా... వేచి చూడడమే బెటర్’ తాజా ఇంటర్వ్యూలో జలాన్ వ్యాఖ్యానించారు. -
స్వయం ప్రకటిత ప్రజాప్రతినిధులు..!
సాక్షి, గుంటూరు : ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవ్వాలంటే ప్రజలు ఎన్నుకోవాలి. మార్కెట్ వంటి సంస్థలకు చైర్మన్‌గా నియమితులు కావాలంటే సంబంధిత శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాలి. కానీ చిలకలూరిపేటకు చెందిన ఓ అధికార పార్టీ నేత, నరసరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులకు ఇవేమీ అవసరం లేదు. వారి పదవులను వారే ప్రకటించుకున్నారు. చిలకలూరిపేట నేత తన స్కార్పియో వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని దర్జాగా తిరుగుతుండగా, నరసరావుపేట చెందిన నేత ఏకంగా తన ఇన్నోవా వాహనం వెనుక నంబరు ప్లేట్‌కు ఏఎంసీ చైర్మన్ అంటూ స్టిక్కర్ వేసుకుని దర్పం ప్రదర్శిస్తున్నారు. పోలీసులకు గానీ, రవాణాశాఖ అధికారులు గానీ ఇవి కనిపించకపోవడం విశేషం.