స్వయం ప్రకటిత ప్రజాప్రతినిధులు..! | Self-proclaimed Public representatives | Sakshi
Sakshi News home page

స్వయం ప్రకటిత ప్రజాప్రతినిధులు..!

Jul 23 2015 10:56 AM | Updated on Sep 3 2017 6:02 AM

స్వయం ప్రకటిత ప్రజాప్రతినిధులు..!

స్వయం ప్రకటిత ప్రజాప్రతినిధులు..!

ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవ్వాలంటే ప్రజలు ఎన్నుకోవాలి.

సాక్షి, గుంటూరు :  ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవ్వాలంటే ప్రజలు ఎన్నుకోవాలి. మార్కెట్ వంటి సంస్థలకు చైర్మన్‌గా నియమితులు కావాలంటే సంబంధిత శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాలి. కానీ చిలకలూరిపేటకు చెందిన ఓ అధికార పార్టీ నేత, నరసరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులకు ఇవేమీ అవసరం లేదు. వారి పదవులను వారే ప్రకటించుకున్నారు.

చిలకలూరిపేట నేత తన స్కార్పియో వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని దర్జాగా తిరుగుతుండగా, నరసరావుపేట చెందిన నేత ఏకంగా తన ఇన్నోవా వాహనం వెనుక నంబరు ప్లేట్‌కు ఏఎంసీ చైర్మన్ అంటూ స్టిక్కర్ వేసుకుని దర్పం ప్రదర్శిస్తున్నారు. పోలీసులకు గానీ, రవాణాశాఖ అధికారులు గానీ ఇవి కనిపించకపోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement