breaking news
selections issue
-
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్‌లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్‌లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
షూటింగ్ సెలక్షన్స్‌పై హీనా ఫిర్యాదు
న్యూఢిల్లీ: భారత మేటి షూటర్ హీనా సిద్ధూ తనకు సెలక్షన్స్‌లో జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు శనివారం జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) తలుపు తట్టింది. అయితే రోజంతా నిరీక్షించిన ఆమెకు ఎన్ఆర్ఏఐ చీఫ్ రణీందర్ సింగ్ ఆదివారం చర్చిద్దామని హామీ ఇచ్చారు. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత షూటింగ్ జట్టులో తనను మిక్స్డ్ పెయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ నుంచి తప్పించారని 28 ఏళ్ల హీనా వాపోయింది. కేవలం వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనే ఎంపిక చేయడం అసంతృప్తికి గురిచేస్తోందని చెప్పింది. 25 మీ. పిస్టల్ ఈవెంట్లో ఆమె కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్. 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనూ హీనా రజతం నెగ్గింది. ‘ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్‌ను కలిసేందుకు రోజంతా నిరీక్షించాను. ఎట్టకేలకు ఆయన స్పందించి ఆదివారం మాట్లాడదామని చెప్పారు. ఆయన మంచి వ్యక్తి అని తెలిసే ఇక్కడికి వచ్చాను. మెరిట్‌కు విలువిస్తారని, పారదర్శకత పాటిస్తారనే నమ్మకముంది. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు సెలక్షన్ కమిటీలో సాంకేతిక అవకతవకలకు పాల్పడ్డారు’ అని హీనా విమర్శించారు. మను బాకర్‌కు మేలు చేకూర్చేందుకే తనను టీమ్ ఈవెంట్ నుంచి తప్పించారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెస్తున్న తనలాంటి షూటర్లకే ఇలాంటి పరిస్థితి రావడం ఘోరమని ఆమె వాపోయింది. -
దే..వుడా
నామినేటెడ్ పోస్టులు అవినీతిపాలు కష్టపడే వారికి నిరాశే ముందస్తు ఒప్పందాలతో చేతులు మారుతున్న రూ.లక్షలు పుణ్య క్షేత్రాలనూ వదలని అవినీతి దాహం సాక్షి ప్రతినిధి, కాకినాడ : కష్టపడే వారికి కాకుండా అధికార పార్టీలోని పెద్దలు కాసులకు కక్కుర్తిపడి పదవుల పందేరానికి తెగబడుతుండడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవస్థానం చైర్మన్లు ఇలా ఒకటేమిటి అన్నింటా వారే ప్రత్యక్షమై లక్షణంగా లక్షల రూపాయల లావాదేవీలు జరుపుతుండడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. పి.గన్నవరం, అమలాపురం, కొత్తపేట, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో ఎ.ఎం.సి. చైర్మ¯ŒS పదవులను ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు జేబులో వేసుకొన్నారనే విషయం తెలిసిన ఆ పార్టీ క్యాడరే కారాలు, మిరియాలు నూరుతోంది. ఎ.ఎం.సి. చైర్మ¯ŒSలతోపాటు పుణ్యక్షేత్రాల ట్రస్టు బోర్డు చైర్మ¯ŒS పదవులను కూడా అంగడి సరుకు చేసేశారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడిని ట్రస్టుబోర్డు నియామక ప్రక్రియను ఆ పార్టీ నేతలు వివాదాస్పదం చేసి బజారుకీడ్చిన విషయం తెలిసిందే. దీంతో ట్రస్టుబోర్డు సభ్యుల నియామకం దాదాపు పూర్తి అయిపోయే చివరి దశలో ఆ నోటిఫికేష¯ŒSనే రద్దు అయిపోయిన పరిస్థితికి దారితీసింది. కోనసీమ పుణ్యక్షేత్రల్లోనూ రాజకీయ సెగే... ఇప్పుడు కోనసీమలో రెండు ప్రధానమైన ఆలయాల ట్రస్టుబోర్డు చైర్మన్ల నియామకంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరుప్రఖ్యాతులున్న ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకట్వేరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయాల చైర్మ¯ŒS గిరీలపై ఆర్థికపరమైన లావాదేవీలతో పార్టీ జెండా భుజానమోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ రెండు ఆలయాల ట్రస్టుబోర్డు చైర్మ¯ŒS పోస్టులకు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో వాడపల్లి వెంకన్న ఆలయం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ¯ŒS గిరీ నియామకంలో ఇటువంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మ¯ŒS గిరీ కోసం ఇద్దరు నేతలు పోటీపడ్డారు. గత సంప్రదాయాన్ని అనుసరించి మాజీ చైర్మ¯ŒS తోటకూర సుబ్బరాజును నియోజవకర్గానికి చెందిన ఒక మాజీ నేత ప్రతిపాదించారు. పార్టీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న మరో నాయకుడు రావులపాలెం మండలం వెదిరేశ్వరం మాజీ సర్పంచి సయ్యపురాజు రామకృష్ణంరాజును తెరమీదకు తెచ్చారు. నియామకం దేవస్థానం ఉన్న మండలానికి చెందిన నాయకుడే అర్హుడని వైరివర్గ నేత మెలిక పెట్టడంతో lప్రత్యామ్నాయంగా ఆత్రేయపురం మండలం అంకంపాలెం సర్పంచి కరుటూరి నరసింహరావు పేరు ప్రతిపాదించారు. ఇలా ఇరు వర్గాల నేతలు ప్రారంభంలో చెరో పేరు సూచించినా చివరకు ఆర్థికంగా స్థితిమంతుడైన ఒక నాయకుడికి కట్టబెట్టేలా వారి మధ్య ఒప్పందం కుదిరిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట పంతానికిపోయిన ఇరు వర్గాల నేతలు చివరకు రూ.20 లక్షలకు బేరంతో ఒప్పందానికి వచ్చి ఎ¯ŒSఓసీ ఇచ్చారని పార్టీ కోడైకూస్తోంది. ఇందులో కొంత అడ్వాన్సు కూడా ఇచ్చుకున్నారని సమాచారం. అన్ని లక్షలు ఇవ్వడానికి అందులో ఏముందని ద్వితీయశ్రేణి నేతలు ప్రశ్నిస్తుంటే చైర్మ¯ŒS పదవి చేపట్టడం ప్రతిష్టాత్మకమని ఆశావహుడైన ఆ నేత సమర్థించుకుంటుండడం గమనార్హం. ఈ లావాదేవీల వ్యవహారం బయటకు పొక్కడంతో పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆర్థికంగా బలమైన ఒక సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. సమయం వచ్చినప్పుడు చెబుతామని అల్టిమేటమ్ ఇవ్వడంతో నియామకం ప్రస్తుతానికి వాయిదా వేశారని తెలిసింది. ర్యాలి జగన్మోహినిలో కూడా... ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయ చైర్మ¯ŒS నియామకానికి కూడా దాదాపు ఇవే కారణాలతో బ్రేక్ పడింది. ఈ చైర్మ¯ŒS గిరీ విషయంలో కూడా ఇరు వర్గాలు పేర్లు ప్రతిపాదించాయి. ఎప్పుడూ క్షత్రియ సామాజిక వర్గానికి కట్టబెడుతూ వస్తున్న క్రమంలో మాజీ చైర్మ¯ŒS సత్యనారాయణరాజును ఒక నేత, సీనియర్ నాయకుడైన కుడుపూడి ఏడుకొండలను మరో నేత ప్రతిపాదించగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ పోçస్టుకు రూ.10 లక్షలకు డీల్ నడుస్తోందని పార్టీలో చర్చనీయాంశమైంది. లక్షలు లేకుండా పని అయ్యేటట్టు కనిపించడం లేదని పార్టీలో ద్వితీయశ్రేణి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.