breaking news
sedans
-
ఫోక్స్‌వ్యాగన్ కొత్త ‘పసాట్’@ రూ.29.99 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ వాహన తయారీ కంపెనీ ‘ఫోక్స్‌వ్యాగన్’ తాజాగా తన ప్రీమియం సెడాన్ ‘పసాట్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎంక్యూబీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిన ఈ కారులో 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఎంట్రీ లెవెల్ కంఫర్ట్‌లైన్ వేరి యంట్ ధర రూ.29.99 లక్షలుగా, టాప్ ఎండ్ హైలైన్ వేరియంట్ ధర రూ.32.99 లక్షలుగా ఉందని తెలిపింది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కొత్త పసాట్ బుకింగ్స్‌ను ప్రారంభించామని, వచ్చే ఏడాది జనవరి నుంచి వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసెంజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టిఫెన్ నాప్ తెలిపారు. ఇందులో 6 స్పీడ్ ఆటోమేటిక్ డీఎస్జీ గేర్‌బాక్స్, 9 ఎయిర్ బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, 360 డిగ్రీ వ్యూ రివర్స్ కెమెరా, పార్క్ అసిస్ట్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు. -
మోత మోగనున్న కార్ల ధరలు
న్యూఢిల్లీ: అంచనాలకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లగ్జరీకార్లు, ఎస్‌యూవీలపై పన్ను భారాన్ని విధించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేవంలో నిర్ణయం జరిగింది. కొత్త జీఎస్టీ చట్టం కింద 15 శాతం నుంచి 25 శాతం వరకు మధ్యతరహా, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను, వ్యాట్ లాంటి స్థానంలో జులై 1 నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి రావడంతో చాలా వివిధ కార్ల ఉత్పత్తి సంస్థలు తమ ఎస్యూవీ, తదితర లగ్జరీ కార్ల ధరలను రూ 1.1 లక్షలు, రూ .3 లక్షల మధ్య తగ్గింది. తాజా నిర్ణయంతో ఈ ఇది రివర్స్ కానుంది. ప్రస్తుతం అమలవుతున్న సెస్ 15నుంచి గరిష్టంగా 25 శాతానికి పెరగడంతో ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్ల ధరలు మోత మోగనున్నాయి. మరోవైపు ఈ సెస్ పెంపు నేపథ్యంలో మారుతీ, టాటా మోటార్స్ షేర్లు 1 శాతం చొప్పున ఎగిశాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు), లగ్జరీ కార్లన్నింటిపైనా పెరిగిన సెస్ అమలు కానుంది. సెస్ పెంపు కారణంగా ఈ మేరకు పలు పెద్ద(విలాసవంత) కార్ల ధరలు పెరగనున్నట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. అయితే సెప్టెంబర్ 9న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత దీనిపై నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదం, అనంతరం పార్లమెంట్ అమోదం లభించాల్సి ఉంటుంది.