ఫోక్స్‌వ్యాగన్‌ కొత్త ‘పసాట్‌’@ రూ.29.99 లక్షలు | 2017 Volkswagen Passat launched at Rs 29.99 lakh | Sakshi
Sakshi News home page

ఫోక్స్‌వ్యాగన్‌ కొత్త ‘పసాట్‌’@ రూ.29.99 లక్షలు

Oct 11 2017 1:04 AM | Updated on Oct 11 2017 3:06 PM

2017 Volkswagen Passat launched at Rs 29.99 lakh

న్యూఢిల్లీ: జర్మనీ వాహన తయారీ కంపెనీ ‘ఫోక్స్‌వ్యాగన్‌’ తాజాగా తన ప్రీమియం సెడాన్‌ ‘పసాట్‌’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఎంక్యూబీ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందిన ఈ కారులో 2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఎంట్రీ లెవెల్‌ కంఫర్ట్‌లైన్‌ వేరి యంట్‌ ధర రూ.29.99 లక్షలుగా, టాప్‌ ఎండ్‌ హైలైన్‌ వేరియంట్‌ ధర రూ.32.99 లక్షలుగా ఉందని తెలిపింది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి. కొత్త పసాట్‌ బుకింగ్స్‌ను ప్రారంభించామని, వచ్చే ఏడాది జనవరి నుంచి వీటిని కస్టమర్లకు డెలివరీ చేస్తామని ఫోక్స్‌వ్యాగన్‌ ప్యాసెంజర్‌ కార్స్‌ ఇండియా డైరెక్టర్‌ స్టిఫెన్‌ నాప్‌ తెలిపారు. ఇందులో 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ డీఎస్‌జీ గేర్‌బాక్స్, 9 ఎయిర్‌ బ్యాగ్స్, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్, 360 డిగ్రీ వ్యూ రివర్స్‌ కెమెరా, పార్క్‌ అసిస్ట్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement