breaking news
Secret Super star
-
కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ సినిమా.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ను తుడిచిపెట్టింది!
ఇటీవల సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. పాన్ ఇండియా హీరోల సినిమాలకైచే నిర్మాతలు బడ్జెట్ విషయంలో అసలు వెనకడుగు వేయడం లేదు. ఇటీవల సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువా. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కేవలం రూ.100 కోట్లకు పైగా వసూళ్లతోనే సరిపెట్టుకుంది. టాలీవుడ్‌లోనూ సలార్, బాహుబలి, పుష్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైనప్పటికీ సక్సెస్ సాధించాయి.అయితే భారీ బడ్జెట్ చిత్రాలతో లాభాల కంటే నష్టాలు ఎక్కువ వచ్చిన సందర్భాలే ఉంటున్నాయి. కానీ ఓ చిన్న సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్స్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2017లో అద్వైత్ చందన్ తెరకెక్కించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ మూవీని కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నిర్మించారు. ఇండియాలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్లోనూ రూ.65 కోట్లు వసూలు చేసి విజయాన్ని సాధించింది.అయితే ఆ తర్వాత చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఆ దేశంలో ఏకంగా 124 డాలర్ల మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా పెట్టుబడి కంటే అదనంగా 60 రెట్లు కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్లో జై సంతోషి మా మూవీ రికార్డును 20 రెట్ల భారీ తేడాతో అధిగమించింది.ఈ లెక్కన సీక్రెట్ సూపర్‌స్టార్ ప్రపంచవ్యాప్తంగా రూ.966 కోట్లను ఆర్జించిందని నివేదికలు వెల్లడించాయి. ఈ వసూళ్లతో ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన స్త్రీ 2 (రూ.857 కోట్లు), పీకే (769 కోట్లు), గదర్ -2 (రూ.691 కోట్లు), బాహుబలి: ది బిగినింగ్ (617 కోట్లు) లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అధిగమించింది. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. కానీ కేవలం రూ.15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన సీక్రెట్ సూపర్‌స్టార్... భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఈ సినిమాలో పెద్ద స్టార్స్ కూడా లేరు. అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించగా.. 16 ఏళ్ల జైరా వాసిమ్ కీలక పాత్ర పోషించారు. చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం దంగల్ తర్వాత అమీర్, జైరాలకు ఆ దేశంలో లభించిన క్రేజ్ కారణమని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. నవంబర్ 2024 నాటికి ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన 10వ భారతీయ చిత్రంగా సీక్రెట్ సూపర్‌స్టార్ నిలిచింది. -
ఆయన సూపర్‌స్టార్.. ఇది ఓపెన్ సీక్రెట్!
ట్విటర్లో ఫన్నీమ్యాన్ ఎవరంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌దే.. ఇపుడు ఆ స్థానాన్ని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు. గతంలో సెహ్వాగ్ బర్త్‌డేకు ఉల్టా ట్వీట్‌తో విష్ చేసిన సచిన్ తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు కూడా ఇదేవిధంగా ఫన్నీగా విషెస్ చెప్పాడు. ‘హ్యపీ బర్త్‌డే ఆమిర్ ఖాన్.. నువ్వు సూపర్స్టార్వి.. అందులో సీక్రెట్ ఏమీలేదు.. హాహాహా’ అంటూ సచిన్ ట్వీటాడు. ఆమిర్ ఇటీవల ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరును ఉటంకిస్తూ.. సచిన్ ఇలా సరదాగా ఆమిర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ‘విష్ యూ ద బెస్ట్ ఆల్వేస్ మై ఫ్రెండ్’ అంటూ జోడించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీగా అనేక విజయాలు అందించిన సెహ్వాగ్, సచిన్‌లు ఇప్పుడు ట్విటర్లోనూ తమదైన రీతిలో ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. సూపర్‌స్టార్ బర్త్‌డే గిఫ్ట్... హిట్ల మీద హిట్లు కొడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమిర్ ఖాన్ తన అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. బుధవారం 53వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. అభిమానులకు మరింత చేరువయ్యేందుకు మంగళవారం ఫోటో షేరింగ్ మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు. మొదటి పోస్ట్‌గా తల్లి జీనత్ హుసేన్ ఫోటోను అప్లోడ్ చేశారు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విటర్లో అభిమానులతో టచ్‌లో ఉండే అమిర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ట్విటర్లో 23 మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్బుక్లో 15 మిలియన్ల లైక్స్‌తో దూసుకుపోతున్నఅమీర్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన కొద్ది గంటల్లోనే 2.41 లక్షలమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. Happy birthday, @aamir_khan. You are a superstar and that's no secret... HaHaHa 😝 Wish you the best always my friend. pic.twitter.com/qbUXsARKMI — Sachin Tendulkar (@sachin_rt) March 14, 2018 -
మేకింగ్ ఆఫ్ మూవీ - సీక్రెట్ సూపర్‌స్టార్