breaking news
Satyanarayana Raju
-
ప్రాధాన్యరంగ రుణాల విక్రయం
న్యూఢిల్లీ: అధికంగా ఉన్న ప్రాధాన్యరంగ రుణాల్లో కొంత వరకు ప్రస్తుత త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) విక్రయించనున్నట్టు కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో కె.సత్యనారాయణ రాజు తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గడం కారణంగా మార్జిన్లపై పడే ఒత్తిళ్లను ఈ రూపంలో అధిగమిస్తామన్నారు. జూన్ త్రైమాసికంలో ప్రా ధాన్యరంగ రుణాల విక్రయం రూపంలో రూ.1,248 కోట్ల కమీషన్‌ను కెనరా బ్యాంక్ ఆర్జించడం గమనార్హం. అయినప్పటికీ ప్రాధా న్యరంగ రుణాలు నియంత్రణ పరిమితి 40% కంటే అధికంగా 45.63% స్థాయిలో ఉన్న ట్టు సత్యానారాయణ రాజు చెప్పారు. మార్కెట్లో ప్రాధాన్య రంగ రుణాలకు డిమాండ్ ఉందంటూ.. దీన్ని అనుకూలంగా మలుచుకుంటామన్నారు. ఆర్బీఐ 1% మేర రెపో రేటును తగ్గించడంతో నికర వడ్డీ మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు పేర్కొన్న విధంగా 2.75 శాతాన్ని సాధించడం కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం 3% లోపు కొనసాగితే మరో విడత రేట్ల కోత ఉండొచ్చన్నారు. కనుక ప్రస్తుత త్రైమాసికంపై ఒత్తిళ్లు ఉంటాయంటూ.. క్యూ3, క్యూ4లలో కొంత పురోగతి ఉండొచ్చని అంచనా వేశారు. రెండు సబ్సిడరీల్లో వాటాల విక్రయంతో వెసులుబాటు లభిస్తుందన్నారు. రెండింటిలో ఒక దానిని ప్రస్తుత త్రైమాసికంలో, మరొకటి వచ్చే త్రైమాసికంలో లిస్ట్ కానున్నట్టు చెప్పారు. కెనరా రొబెకో ఏఎంసీ, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్‌లను ఐపీవోకు తీసుకొచ్చే ప్రణాళికల్లో బ్యాంక్ ఉండడం గమనార్హం. -
సెల్ నెంబరే కీలకం!
బంజారాహిల్స్: సినీ ఫక్కీలో జరిగిన జూబ్లీహిల్స్ దొంగతనం కేసులో నిందితుడి జాడ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఒక వైపు టాస్‌్కఫోర్స్ పోలీసులు, ఇంకోవైపు క్రైం పోలీసులు ఎనిమిది బృందాలుగా రాష్ట్రంతో పాటు సరిహద్దులు, ఇతర రాష్ట్రాలను జల్లెడపడుతున్నాయి. ఎనిమిది గంటల పాటు గర్భిణిని బంధించి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలతో ఉడాయించిన ఘటనలో నిందితుడు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ కీలకంగా మారనుంది. మూడుచోట్ల ఈ సెల్‌ఫోన్ వినియోగించడంతో పోలీసులు టవర్‌డంప్ చేస్తూ నిందితుడు ఎవరెవరితో మాట్లాడాడు.. ఫోన్ నెంబర్ ఏంటి అన్నదానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితుడి ఆచూకీ పట్టుకునే దిశలో పోలీసులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. వైన్ బాటిల్ ఖాళీ చేశాడు... జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లో నివసించే ప్రముఖ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణ రాజు అలియాస్ ఎన్ఎస్ఎన్.రాజు ఇంట్లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎన్ఎస్ఎన్ రాజు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించాడు. అదే సమయంలో శుభకార్యం ముగించుకొని ఇంటికి వచ్చి న రాజు..ఆయన పెద్ద కూతురు అత్త, మామలు ఇంట్లోకి రాగా వారి వెనుకాలనే నిందితుడు కూడా ప్రవేశించాడు. కొద్దిసేపటికే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి అక్కడ నిల్చున్న ఆగంతకుడిని చూసి ఎన్ఎస్ఎన్.రాజు పెద్ద కూతురి అత్త, మామల డ్రైవర్ అని భ్రమపడి లోనికి వెళ్లిపోయింది. కొద్దిసేపట్లోనే పెద్ద కూతురు అత్తమామలు వెళ్ళిపోగా రాజు ఆయన భార్య లీల తమ గదిలో నిద్రించారు. మరో గదిలో చిన్న కూతురు నవ్య వర్క్‌ఫ్రం హోం ముగించుకొని రాత్రి 1.30 గంటల సమయంలో వాట్సాప్ మెసేజ్ చూస్తుండగా ఆగంతకుడు ఆమె బెడ్రూమ్లోకి ప్రవేశించాడు. అరిస్తే పొడిచేస్తానంటూ కత్తి చూపి బెదిరించాడు. దీంతో ఆమె నోరు మెదపలేదు. తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఇంట్లో అరకిలో ఆభరణాలు ఉన్నాయని, తన చెవులకు రూ.15 లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన కమ్మలు ఉన్నాయని, అవి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేయగా తనకు కేవలం డబ్బులే కావాలని, నగలు కాదని చెప్పాడు. ఓ వైపు ఆమెతో మాట్లాడుతూనే ఇంకోవైపు ఇంట్లోనే ఉన్న వైన్ తాగుతూ..ఆమెతో ముచ్చటిస్తూ మరో వైపు తన ఫోన్లో చాటింగ్‌చేస్తూ ఇంకోవైపు రూ.20 లక్షలు ఎలాగైనా తెప్పించాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు. మాట వినకపోతే పొడుస్తానంటూ తరచూ ఆమెను బెదిరించసాగాడు. ఆమె ఇంటి విషయాలపై కూడా చర్చించాడు. మీ అక్క నాలుగేళ్ల కూతురు ఉండాలి కదా..ఆమె ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. మీ గుట్టు మొత్తం నాకు తెలుసు డబ్బులు లేవంటే నమ్మను అంటూ లీలను హెచ్చరించాడు. ఇంట్లో నుంచే ఫోన్లో చాటింగ్ చేస్తూ వారితో మాట్లాడుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ కుటుంబ వివరాలు కనుక్కుంటూ డబ్బులు వచ్చేదాకా కాలంగడిపాడు. రెక్కీ నిర్వహించిన సమయంలో రోడ్డుపై ఒకసారి నిందితుడు ఫోన్లో మాట్లాడినట్లుగా ఇక్కడ సీసీ ఫుటేజీలు స్పష్టం చేస్తున్నాయి. ఇంట్లో ఛాటింగ్ చేసిన విషయం కూడా బాధితురాలు తెలిపింది. షాద్‌నగర్‌లో కారు దిగి బస్టాప్‌కు వెళ్లే క్రమంలో ఓ చోట ఆగి ఫోన్ మాట్లాడినట్లుగా అక్కడి సీసీఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. ఈ మూడు సంఘటనల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పైనే పోలీసులు ప్రధానంగా దృష్టిపెట్టారు. తనది నాందేడ్ అని నిందితుడు చెప్పిన క్రమంలో ఓబృందం అటు వైపు వెళ్ళింది. మరో బృందం బెంగళూరుకు, గోవాకు, ముంబైకి వెళ్ళింది. -
కార్పొరేట్ దిగ్గజాల రె‘ఢీ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కొందరు నేతలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గానికి మార్చిలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. విశ్వసనీయ సమాచారం మేరకు బరిలో దిగనున్న ఇద్దరు కార్పొరేట్ విద్యాసంస్థల దిగ్గజాలు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వారు క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడంలో తలమునకలై ఉండగా ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు ఏ సంఘంలో ఉన్నారు, కొత్తగా చేరే ఓటర్లు ఏ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, చైతన్య విద్యాసంస్థల అధినేత కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు) ఇటీవలే కేబినెట్ ర్యాంక్‌తో మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం వచ్చే మార్చి 15తో పూర్తి కానుంది. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ అయిన ఆయన వచ్చే ఎన్నికల్లోనూ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన ఇప్పుడూ స్వతంత్రునిగానే బరిలో దిగుతారా లేక టీడీపీ మద్దతుతో పోటీ చేస్తారా అనేదానిపై స్పష్టత లేదు. అదే విషయాన్ని ఆదివారం ‘సాక్షి’ ఆయన వద్ద ప్రస్తావించగా బరిలో ఉండటం ఖాయమని, మిగిలిన విషయాలు త్వరలో తెలియచేస్తానని చెప్పారు.కాగా ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు (ప్రగతి కృష్ణారావు) కూడా ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నుంచి టీడీపీ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నమే చేశారు. ఒక దశలో టిక్కెట్ ఆయనకు ఖాయమైందనే ప్రచారం జరిగినా చివరికి నిరాశే మిగిలింది. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఆయన విడుదల చేసిన ప్రకటన ఎమ్మెల్సీ పదవిపై ఆయన అభిలాషను చెప్పకనే చెబుతోంది. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో కూడా చర్చించినట్టు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు స్వతంత్ర పోరుకే ఆయన మొగ్గు చూపుతున్నారు. ఇద్దరు కార్పొరేట్ దిగ్గజాలు బరిలో దిగడం దాదాపు ఖాయమని తేలడంతో ఇక ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయపార్టీల వ్యూహం ఎలా ఉండనుందో తేలాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.ఒకప్పుడు శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బుకట్టలతో ప్రమేయం లేకుండా, పేరు, ప్రతిష్ట ఆధారంగా తలపడేవారు. అటువంటిది ఇప్పుడంతా డబ్బు, అధికారం చుట్టూనే తిరుగుతోంది. ఎంత తక్కువ లెక్కేసుకున్నా వ్యయం రూ.ఆరేడు కోట్లుంటుంది. ఈ నేపథ్యంలో మరో ఐదు నెలల్లో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయ వర్గాల్లో రాజుకున్న వేడి కాగా ఈ ఎన్నిక కోసం కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ ఈనెల 25 నుంచి డిసెంబరు 16 వరకు గడువుతో షెడ్యూల్ విడుదల చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బరిలో నిలిచే వారెవరు, ఏ పార్టీ తరఫున ఎవరుంటారు, ఏ ప్రాతిపదికన ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేదానిపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఉపాధ్యాయ వర్గాల్లో ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభుత్వ (జిల్లా పరిషత్, మున్సిపల్) ఉపాధ్యాయులంతా ఓటర్లుగా అర్హులు. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాలోని ఫొటో ఐడెంటిఫికేషన్ నంబర్‌ను శాసనమండలి ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలి. ఇందుకు ఈ నెల 10 వరకు మాత్రమే గడువుంది. ఆలోగా కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో నమోదు చేసుకోకుంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.