breaking news
Saraswat
-
సారస్వత్ బ్యాంక్‌లో న్యూ ఇండియా కోపరేటివ్ విలీనం
ముంబై: సంక్షోభం ఎదుర్కొంటున్న న్యూ ఇండియా కోపరేటివ్ బ్యాంక్ (ఎన్ఐసీబీ)ను విలీనం చేసుకుంటున్నట్టు దేశంలోనే అతిపెద్ద పట్టణ సహకార బ్యాంక్ అయిన సారస్వత్ కోపరేటివ్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో ఎన్ఐసీబీకి చెందిన 1.22 లక్షల మంది డిపాజిటర్లు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని.. వారి పొదుపు నిధులన్నీ భద్రంగా ఉంటాయని సారస్వత్ బ్యాంక్ చైర్మన్ గౌతమ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం ఎన్ఐసీబీ ఒక్కో కస్టమర్ గరిష్టంగా రూ.25,000 ఉపసంహరణకు పరిమితం చేయగా.. విలీనం తర్వాత వారి పూర్తి డిపాజిట్ మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుందని చెప్పారు. ఈ విలీనం సెప్టెంబర్ చివరికి ముగుస్తుందన్నారు. ఎన్ఐసీబీ విలీనం కోసం తామే స్వచ్ఛందంగా ఆర్బీఐని సంప్రదించినట్టు చెప్పారు. సంక్షోభంలో పడిన ఏడు బ్యాంక్‌లను గతంలో విలీనం చేసుకున్నట్టు గుర్తు చేస్తూ.. ఇదే మాదిరి ఎన్ఐసీబీ విలీనంపైనా నమ్మకం వ్య క్తం చేశారు. ఎన్ఐసీబీలో యాజమాన్యం రూ.122 కోట్ల నిధులను దుర్వినయోగం చేసిన విషయం ఇటీవలే వెలుగులోకి రావడం గమనార్హం. -
‘ఈఫ్లూటో’ స్కూటర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బ్యాటరీల తయారీకి కీలకమైన లిథియం పదార్థాన్ని దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, బొలీవియా నుంచి సేకరించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ డాక్టర్ వి.కె.సారస్వత్ తెలిపారు. ప్యూర్ ఈవీ అనే సంస్థ ఐఐటీ–హైదరాబాద్ సాయంతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సారస్వత్, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనం తరం సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలు రక్షణ రంగానికి ఉపయోగపడే పరికరాలు, టెక్నాలజీ అభివృద్ధికి ప్రయత్నించాలన్నారు. ఈప్లూటో 7జీ ప్రత్యేకమైంది.. ఐఐటీ హైదరాబాద్ సహకారంతో తాము అభివృద్ధి చేసిన ఈ ప్లూటో 7జీ విద్యుత్ స్కూటర్ ప్రత్యేకమైందని ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్ వడేరా తెలిపారు. బ్యాటరీ విడిభాగాలను దిగుమతి చేసుకున్నప్పటికీ మిగిలిన అన్ని టెక్నాలజీలను ఇక్కడే అభివృద్ధి చేశామని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఫ్యాక్టరీలో ఈప్లూటో 7జీని తయారు చేస్తున్నామని చెప్పారు. ఈ స్కూటర్ ధర రూ. 79,999లని తెలిపారు. -
దేశీయ పరిజ్ఞానంతో ప్రగతి: డాక్టర్ సారస్వత్
సాక్షి, సిటీ బ్యూరో: సుస్థిర అభివృద్ధికి దేశీయు సాంకేతిక పరిజ్ఞానం అవసరవుని, దానిని సవుకూర్చుకోవటానికి యువత కార్యోన్ముఖులు కావాలని రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ వూజీ డెరైక్టర్ డాక్టర్ వీకే సారస్వత్ పిలుపునిచ్చారు. దేశంలో పర్యావరణ అనుకూల అభివృద్ధి దిశగా పరిశోధనలు సాగాలని అభిలషించారు. పర్యావరణ సవుతుల్యం లోపించినప్పుడు సవుస్యలు ఉత్పన్నవువుతాయున్నారు. ఆ పరిస్థితులు రాకుండా జాగ్రత్త వ హించాలన్నారు. నగరంలోని గీతం విశ్వవిద్యాలయు ప్రాంగణంలో శనివారం విజ్ఞాన భారతి విద్యార్థి విభాగాన్ని ఆయున ప్రారంభించారు. ప్రదేశాలు, పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన భారతి సెక్రెటరీ జనరల్ జయుకువూర్, విద్యాలయు గవర్నింగ్ బాడీ సభ్యుడు ఎం.శ్రీ భరత్, ప్రో వైస్ చాన్స్‌లర్, రిటైర్డ్ మేజర్ జనరల్ డాక్టర్ శివకువూర్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ డాక్టర్ ఎన్.శివప్రసాద్, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ వర్మ, ఏరోనాటికల్ విభాగాధిపతి ఎన్వీ స్వామినాయుడు, సుబ్బారావులు పాల్గొన్నారు.