breaking news
Santa Barbara County
-
ఆరు అడుగుల దూరం సరిపోదు
కాలిఫోర్నియా: 'చికిత్స కన్నా నివారణ మేలు' అనే మాట కరోనాకు సరిగ్గా సరిపోతుంది. మందు లేని ఈ మాయదారి రోగానికి మనం పాటించే జాగ్రత్తలే రక్షగా నిలుస్తాయి. అత్యవసరం కానిదే బయటకు వెళ్లకపోవడం, ముఖ్యంగా మాస్కు ధరించడం, మరీ ముఖ్యంగా ఆరడగుల భౌతిక దూరం పాటించడం. అన్నీ సరే కానీ.. ఆరడుగుల దూరం కరోనాను నిలువరించలేదని బాంబు పేల్చారు సైంటిస్టులు. కొన్నిసార్లు కరోనా వైరస్ కణాలు సుమారు 20 అడుగుల దూరం వరకు ప్రయాణించవచ్చని హెచ్చరిస్తున్నారు. సాంత బర్బరాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. (లిఫ్టుల్లో ఎదురెదురుగా నిలబడొద్దు) వైరస్ వ్యాప్తిని నిర్దేశించే వాతావరణం! ఈ అధ్యయనం ప్రకారం.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కొన్నిసార్లు మనిషి సాధారణంగా మాట్లాడే సమయంలోనూ నోటి నుంచి దాదాపు 40 వేల బిందువులు సెకనుకు వంద మీటర్ల మేర వ్యాప్తి చెందుతాయి. ఈ బిందువులను అధ్యయనకారులు రెండు రకాలుగా విభజించారు. పెద్ద పరిమాణంలో ఉండే స్థూల కణాలు తక్కువ దూరం ప్రయాణించి అక్కడే స్థిరపడుతాయి. కానీ సూక్ష్మ కణాలు వైరస్‌ను ఎక్కువ దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో పాటు కొన్ని గంటల పాటు గాలిలోనే ఉండగలవన్న విషయాన్ని వెల్లడించారు. వాతావరణంలోని మార్పులు వైరస్ వ్యాప్తిని మరింత ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొన్నారు. అమెరికాలోని సీడీసీ(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సూచించిన ఆరు అడుగుల భౌతిక దూరం అన్ని వేళలా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. చల్లని వాతావరణంలో వైరస్ కణాలు ఆరు అడుగులే కాకుండా ఆరు మీటర్ల(19.7 అడుగులు) వరకు వ్యాపిస్తాయని తెలిపారు. (ఎందుకు.. ఏమిటి.. ఎలా? ) -
శాండియాగోలో కార్చిచ్చు
శాన్‌డియాగో: అమెరికాలోని శాండియాగో ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడంతో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాంతా బార్బరా కౌంటీకి 400 కి.మీ. దూరంలో సైతం కార్చిచ్చు చెలరేగింది. అక్కడి నుంచి 1,200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ మంగళవారం కార్చిచ్చు చెలరేగింది. అయితే, రెండు ప్రాంతాల్లోనూ చీకటిపడే వేళకు మంటలు చల్లారడంతో సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు తమ తమ ఇళ్లకు వెళ్లవచ్చని అధికారులు సూచించారు. కార్చిచ్చు వల్ల ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కి మించి ఉండటంతో మంట లను చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కొంత ప్రయాసపడ్డారు. శాండియాగో సమీపంలోని రాంకో బెర్నార్డో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు శరవేగంగా 280 హెక్టార్ల మేరకు విస్తరించాయి.