breaking news
sankarrao
-
ఆ విగ్రహాలు ఆంధ్రులవి కావు....తెలుగువారివి
హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలు తెలుగువారివే కానీ...ఆంధ్రులవి కావని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కొందరు విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలుగువారి గౌరవానికి నిదర్శనంగా ఎన్టీఆర్ ....మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్రవారి విగ్రహాలను తొలగిస్తామన్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలను శంకర్రావు ఖండించారు. కాగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న అనవసర ఆంధ్రావాళ్ల విగ్రహాలను తొలగించి, వాటి స్థానంలో నూతన విగ్రహాలకు ప్రతిష్టిస్తామని నాయిని నిన్న సికింద్రాబాద్‌లోని వీర శైవ లింగాయత్ లింగబలిజ సమావేశంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
'సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వద్దు'
-
'సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వద్దు'
హైదరాబాద్ : రాష్ట్రంలో అప్పుడే రాజకీయ చదరంగం ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో టిక్కెట్లపై ఇప్పటి నుంచే వ్యూహా ప్రతి వ్యూహాలు మొదలయ్యాయి. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకి సొంతపార్టీ ఎమ్మెల్యేలే పొగబెడుతున్నారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సర్వే..గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అవినీతిని ప్రోత్సహిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడుతున్నారు. మాల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సర్వే వ్యవహారశైలిపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఇప్పటికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు, ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి హస్తినకు చేరుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ అపాయింట్మెంట్ కోసం దొరికిన వెంటనే వీరిద్దరు సర్వేపై ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అప్పాయింట్మెంట్ లభించిన వెంటనే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వందని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు సర్వే మాత్రం తాను మళ్లీ మల్కాజ్గిరి నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు. రాహుల్ గాంధీ మంత్రివర్గంలో పనిచేయాలనే అభిప్రాయాన్ని ఆయన తరచూ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.