breaking news
Sankaranthi celebrations
-
ఉత్తర టెక్సాస్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు!
తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్.. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఫ్రిస్కోలోని రీడీ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. సంస్థ అధ్యక్షులు సతీష్ బండారు ఆధ్వర్యంలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను బావితరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాలలో పలు కార్యక్రమాలు చేపట్టింది టాంటెక్స్. సంక్రాంతి పాటలు, ముగ్గులు, ముచ్చట్లతో పాటు అత్యంత సుందరంగా బొమ్మల కొలువుతో వేదికను అలంకరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, దీప్తి తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి గొప్పతనం చాటిచెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండగ వాతారవరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌కు విశేష స్పందన వచ్చింది. ఇక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్చంద మరియు సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మార్చిలో నాట్స్ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డల్లాస్‌లో జరిగే నాట్స్ తెలుగు వేడుకల్లో అందరికీ పాల్గొని విజయవంతం చేయాలని సంస్థ సభ్యులు కోరారు. ఇక సంక్రాంతి సంబరాలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ మద్దతుగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న దాతలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు) -
అలంకరణ మెండుగా.. మది నిండుగా.. సంక్రాంతి పండగ!
'ప్రకృతి పండగ సంబరంగా జరుపుకోవాలంటే ఆ కళ కూడా మన ఇంటికి కొత్త కళాకాంతులు తీసుకురావాలి. అప్పుడే పండగ మరింత అందంగా, శోభాయమానంగా మారిపోతుంది. సంక్రాంతి రోజున ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి కొన్ని సంక్రాంతి అలంకరణలు ఇవి.' సంక్రాంతి, పొంగల్ ఈ రెండింటినీ హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున, ఇళ్లను అందంగా అలంకరించడానికి పోటీపడుతుంటారు. సంప్రదాయ పద్ధతులే కాకుండా, పొంగల్ లేదా మకర సంక్రాంతికి ఇంటిని అలంకరించుకోవడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. వాటిలో ఇంటీరియర్ నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలు.. రంగుల రంగోలి ఏ భారతీయ పండుగకైనా ఇంటి ముందు అందమైన రంగోలీ ముచ్చటగొలుపుతుంది. ముగ్గుల పండగగా పేరొందిన సంక్రాంతికి ఇంటి గుమ్మం వద్ద, పూజ గది, పొంగల్ కోసం బయట రంగోలి డిజైన్లను రూపొందించడానికి మీ సృజనాత్మకతను చూపచ్చు. అందరూ వేసేదిగా కాదు అనుకుంటే వినూత్నమైన డిజైన్లను ప్రయత్నించవచ్చు. దీంతో పొరుగువారిని మించిపోవచ్చు. అపార్ట్మెంట్ల కోసం ఇన్డోర్.. అందరూ అలంకరించుకోవడానికి విశాలమైన పచ్చికతో కూడిన పెద్ద బంగ్లాలలో నివసించరు. అనేక మంది పట్టణవాసులు పట్టణాలు, నగరాల్లోని అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు. కానీ ఇన్డోర్ డెకరేషన్ అవుట్‌డోర్‌లో చేసినట్లే ఆహ్వానించదగినదిగా ఉంటుంది. మీ గదిని ఆకులతో పొడవాటి చెరకుతో అలంకరించండి. బియ్యం పాలు, బెల్లం ఉడకబెట్టడాన్ని సూచించే మట్టి కుండలతో అలంకరించండి. సంక్రాంతి లేదా పొంగల్ జరుపుకోవడానికి మీకు పెద్ద బాల్కనీ లేదా తోట అవసరం లేదని గ్రహించాలి. ఆకులతో అందంగా.. పొంగల్, సంక్రాంతి అనేది శ్రేయస్సు వేడుక, ఈ థీమ్‌లో ఆకుపచ్చ రంగుదే అగ్రతాంబూళం. అందుకని, పొంగల్ రోజున మామిడి ఆకుల తోరణాలను ఇంటి ప్రవేశద్వారం వద్ద వేలాడదీయడం శుభప్రదమైనది. రంగు రంగు కాగితాలను ఉపయోగిస్తూ చేతితో పర్యావరణ అనుకూలమైన అలంకరణ చేయచ్చు. థీమ్ డెకరేషన్లో గాలిపటం గాలిపటాల హంగామా ఈ పండగ ప్రత్యేకం. కాబట్టి, పేపర్ క్రాఫ్ట్తో రంగురంగుల గాలిపటాల తయారీ ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకు వస్తుంది. వీటిని తయారు చేయమని పిల్లలను ప్రోత్సహించవచ్చు. వాల్ హ్యాంగింగ్లను అందమైన అలంకరణలుగా ప్రయత్నించవచ్చు. కాగితంతో తయారు చేసిన సీతాకోకచిలుకలు, పువ్వులు, జంతువుల బొమ్మలు ఇంటీరియర్‌కు అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. మార్కెట్లో కూడా గాలిపటాలు అన్ని ఆకారాలు, పరిమాణాలలో లభిస్తాయి. బాల్కనీ అయితే గాలిపటాలను వేలాడదీయవచ్చు. లివింగ్ రూమ్‌లోని ఓ వాల్ని ఎంచుకుని రంగు రంగుల గాలిపటాలతో ఆకర్షణీయమైన అలంకరణ కోసం అతికించవచ్చు. వీటికి పువ్వులు, చెరకు డిజైన్లను కూడా జోడించవచ్చు. వాల్ పేపర్స్ పొంగల్ అలంకరణ చిటికేసినంత సులువుగా నట్టింటికి రావాలంటే ఇప్పుడు అందమైన ఫెస్టివల్ వాల్ పేపర్లు, వాల్ డెకార్ బ్యాక్‌డ్రాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నచ్చిన వాల్పేపర్ని ఎంచుకొని, డెకార్ చేయడమే తరువాయి. పండగ పిండివంటలు ఒక టేబుల్‌పైన కాగితం లేదా చెక్కతో తయారుచేసిన ఎడ్ల బండ్ల బొమ్మలు, అరిశెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు.. వంటివి పలహారాల పేట్లు, కొయ్య బొమ్మలను ఉంచితే చాలు పండగ కళ వచ్చేసినట్టే. ఇవి చదవండి: 'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి.. -
పాలకొల్లులో పండగ
‘మావయ్యది మొగల్తూరు.. మా నాన్నది పాలకొల్లు...’ అంటూ ‘గంగోత్రి’ సినిమాలో సందడి చేశారు అల్లు అర్జున్. ఆయనది పాలకొల్లు అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ స్టైలిష్ స్టార్ ఈసారి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగను పాలకొల్లులో జరుపుకోనున్నారు. తెలుగువారికి పెద్ద పండగ సంక్రాంతి. మామూలుగా సంక్రాంతి అంటే సిటీలో కాకుండా పల్లెల్లో బాగుంటుంది. పండగ సందడంతా అక్కడే ఉంటుంది. అందుకే బన్నీ పాలకొల్లు వెళ్లాలని అనుకుని ఉంటారు. ఈ మధ్య హైదరాబాద్‌లో క్రిస్మస్ సంబరాలు చేసుకుని, న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యామిలీతో లెబనాన్ వెళ్లారు బన్నీ. ఇప్పుడు సంక్రాంతికి పాలకొల్లుని సెలెక్ట్ చేసుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందు ఇలా ఫ్యామిలీతో పండగలు, ముఖ్యమైన వేడుకలను మిస్ కాకుండా చేసుకుని, ఆ తర్వాత సినిమాతో బిజీ అయిపోతారు బన్నీ. -
కాస్త నిలవండీ!!!
సంక్రాంతి... తెలుగువాళ్లకి పెద్ద పండగ... కాస్త పెద్దగానే జరుపుకుంటాం. అందుకే ఈ పండగకి నోట్లో వేసుకోగానే కరిగిపోయే పిండివంటలు చేస్తామా! అరిశలు, పనసతొనలు, గులాబీ గుత్తులు, కొబ్బరి బూరెలు, రిబ్బన్ పకోడా, సకినాలు, మురుకులు లాంటి దక్షిణాది పిండివంటలను ఓపిగ్గా తయారు చేసి, డబ్బాల్లో దాచుదాం. పండక్కే కాదు, పండగ వెళ్లిపోయిన తర్వాత కూడా అందరినీ కాస్త నిలవండీ అంటూ ప్రేమగా తినిíపిద్దాం. బాదం పూరీ కావలసినవి: మైదాపిండి – కప్పు, బియ్యప్పిండి – అర కప్పు, బాదం పప్పులు – 20, పాలు – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార – కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూను, లవంగాలు – తగినన్ని, మిఠాయి రంగు – చిటికెడు తయారి: ∙బాదం పప్పులను గంటసేపు నీళ్లలో నానబెట్టి, పొట్టు తీసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక పాత్రలో మైదాపిండి, బియ్యప్పిండి, బాదం పప్పుల ముద్ద వేసి బాగా కలపాలి ∙మిఠాయి రంగును టీ స్పూను నీళ్లలో కలిపి, జత చేయాలి ∙తగినన్ని పాలు జత చేసి చపాతీ పిండిలా కలిపి సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి ∙చిన్నచిన్న ఉండలుగా చేసి, పల్చని చపాతీలా ఒత్తి, పైన నెయ్యి పూయాలి ∙మధ్యకు మడతపెట్టి, మరోమారు నెయ్యి పూసి త్రికోణాకారంలో మడత పెట్టి, లవంగాన్ని మధ్యలో గుచ్చాలి ∙బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న బాదం పూరీలను ఒక్కొక్కటిగా వేసి వేయించి, తీసి పక్కన ఉంచుకోవాలి ∙పంచదారకు తగినంత నీరు జత చేసి బాణలిలో వేసి, స్టౌ మీద ఉంచి పంచదార కరిగి తీగ పాకం రాగానే దించేయాలి ∙ఏలకుల పొడి జత చేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న బాదం పూరీలను ఇందులో వేసి ఐదు నిమిషాల తరవాత తీసేయాలి. కాయి హోళిగే కావలసినవి: పూర్ణం కోసం: ఎండు కొబ్బరి తురుము – 2 కప్పులు, బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు, ఏలకుల పొడి – టీ స్పూను; పోలి తయారీ కోసం: మైదా పిండి – 2 కప్పులు, నువ్వుల నూనె – 3 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీ స్పూను తయారి: ∙ఒక పాత్రలో జల్లించిన మైదా పిండి, పసుపు వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో బెల్లం పొడి, ఏలకుల పొడి, అరకప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకు కలపాలి ∙కొబ్బరి తురుము జత చేసి బాగా ఉడికి దగ్గర పడేవరకు కలిపి, దింపి చల్లారనివ్వాలి ∙ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదాపిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను చేతితో పల్చగా ఒత్తి, కొబ్బరి పూర్ణం అందులో ఉంచి, చపాతీకర్రతో పల్చగా ఒత్తుతూ కొద్దిగా పొడి పిండి అద్దుతుండాలి. (పూర్ణం బయటకు రాకుండా జాగ్రత్తగా ఒత్తాలి) ∙స్టౌ మీద పెనం వేడయ్యాక, ఒత్తి ఉంచుకున్న కాయి హోళిగలను పెనం మీద వేసి కొద్దికొద్దిగా నూనె వేస్తూ బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చి తీసేయాలి ∙నెయ్యి జత చేసి వడ్డిస్తే రుచిగా ఉంటాయి ∙ఇవి మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటాయి. పనస తొనలు కావలసినవి: మైదాపిండి – అర కేజీ, పంచదార – అర కేజీ, ఉప్పు– తగినంత, ఏలకుల పొడి – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి కలిపి, అరగంట తరవాత చిన్న చిన్న ఉండలు చేసి, చపాతీలా ఒత్తాలి ∙చాకుతో మధ్యలోకి నాలుగైదు గీతలు పెట్టి కట్ చేయాలి. (అంచులలో కట్ చేయకూడదు) ∙పనసతొన మాదిరిగా మడవాలి ∙పెద్ద పాత్రలో పంచదార, నీళ్లు, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చాక దింపేసి, తయారుచేసి ఉంచుకున్న పనస తొనల మీద పంచదార పాకం అద్దుకునేలా కలపాలి ∙చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. మంగళూరు బన్స్ కావలసినవి: అరటిపండ్లు – 2 (మీడియం సైజువి), పంచదార – మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి – అర టీ స్పూను, ఉప్పు – చిటికెడు, బేకింగ్ సోడా – రెండు చిటికెలు, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి – ఒకటì న్నర కప్పులు, నెయ్యి – టీ స్పూను, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙ఒక పాత్రలో అరటిపండు తొక్క తీసి మెత్తగా అయ్యేవరకు మెదపాలి ∙పంచదార జత చేసి మరోమారు మెత్తగా అయ్యేవరకు కలపాలి ∙గోధుమపిండి, పెరుగు, ఉప్పు, నెయ్యి, బేకింగ్ సోడా, జీలకర్ర పొడి జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙పిండి చేతికి అంటుతున్నట్లుగా ఉంటే కొద్దిగా నూనె జత చేసి, రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి ∙మరుసటి రోజు ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, మూడు గంటలు ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చే సి, ఒక్కో ఉండను పూరీలా ఒత్తాలి ∙బాణలిలో నూనె కాగిన తరవాత ఒక్కో మంగళూరు బన్స్‌ని వేసి వేయించాలి ∙బాగా పొంగిన తరవాత పేపర్ నాప్కిన్స్ మీదకు తీసుకోవాలి ∙ ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి. మురుకులు కావలసినవి: బియ్యప్పిండి – 4 కప్పులు, పుట్నాల (వేయించిన సెనగపప్పు) పిండి – కప్పు, నువ్వులు – టీ స్పూను, ఎర్ర కారం – టీ స్పూను, ఇంగువ – అర టీ స్పూను, కరిగించిన వెన్న – 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు – టీ స్పూను, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙రెండు కప్పుల నీళ్లలో ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి నీళ్లు మరిగించాలి ∙మంట బాగా తగ్గించి, వేడి నీళ్లలో కొద్దికొద్దిగా బియ్యప్పిండి వేస్తూ ఉండ కట్టకుండా కలపాలి పిండి బాగా చల్లారాక పుట్నాల పిండి, నువ్వులు, ఎర్ర కారం, ఇంగువ, కరిగించిన నెయ్యి జత చేసి జంతికల పిండిలా కలపాలి ∙బాణలిలో నూనె పోసి కాచాలి ∙మురుక్కులు చేసే మౌల్డ్‌లో నక్షత్రంలా ఉండే ప్లేట్ ఉంచి, కలిపి ఉంచుకున్న పిండిని మౌల్డ్‌లో ఉంచి జంతికల మాదిరిగా నూనె పూసిన అరటి ఆకు మీద చుట్టాలి సుమారు ఆరేడు ఒత్తిన తరవాత, కాగిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి . ఇవి చాలా కాలం నిలవ ఉంటాయి. మోహన్ లడ్డు కావలసినవి: పంచదార పొడి – కప్పు, బొంబాయి రవ్వ – కప్పు, ఉప్పు – అర టీ స్పూను, నీళ్లు – కప్పు, నెయ్యి – కప్పు, ఏలకుల పొడి – టీ స్పూను, జీడిపప్పులు – 10 తయారి: ∙ఒక పాత్రలో బొంబాయి రవ్వ, ఉప్పు వేసి స్పూనుతో కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలిపి, తడి వస్త్రం కప్పి అర గంట సేపటి తరవాత చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా కొంచెం మందంగా ఒత్తాలి ∙బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని వేసి దోరగా వేయించి తీసేయాలి ∙పూరీలన్నీ వేయించిన తరవాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా విరిచి మిక్సీలో వేసి పొడి చేయాలి ∙పంచదార పొడి, ఏలకుల పొడి జత చేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగించి, జీడిపప్పులు వేసి దోరగా వేయించి, కలిపి ఉంచుకున్న మిశ్రమానికి జత చేసి కలపాలి ∙కొద్దికొద్దిగా నెయ్యి జత చేస్తూ లడ్డూ మాదిరిగా చేస్తే మోహన్ లడ్డూ సిద్ధమైనట్లే. గులాబీ గుత్తులు కావలసినవి: మైదా పిండి – కప్పు, బియ్యప్పిండి – రెండు కప్పులకు కొద్దిగా తక్కువ, పంచదార – ముప్పావు కప్పు, నీళ్లు లేదా కొబ్బరి పాలు – తగినన్ని, ఏలకుల పొడి – టీ స్పూను, ఉప్పు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙పదార్థాలన్నిటినీ ఒక పాత్రలో వేసి తగినన్ని నీళ్లు జత చేసి దోసెల పిండి మాదిరిగా కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙ బాణలిలో నూనె కాగాక గులాబీ గుత్తుల మౌల్డ్‌ను నూనెలో ఉంచి వేడి చేయాలి ∙గులాబీ గుత్తిని పిండిలో ముంచి తీసి, నూనెలో మునిగేలా ఉంచి, జాగ్రత్తగా చెంచాతో గుత్తి నుండి విడివడేలా చేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసుకుని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కొబ్బరి బూరెలు కావలసినవి: బెల్లం పొడి – పావుకేజీ, తడిగా ఉన్న బియ్యప్పిండి – అరకేజీ (బియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరు ఒంపేసి, పొడి వస్త్రం మీద ఆరబోసి, బియ్యం కొద్దిగా తడిగా ఉండగానే మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. జల్లించి మెత్తగా ఉన్న పిండిని తడిగా ఉండగానే వాడుకోవాలి); కొబ్బరి తురుము – అర కప్పు, నువ్వులు – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రై చేయడానికి తగినంత తయారి: ∙బెల్లం పొడికి గ్లాసుడు నీరు జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు కలిపి దించేయాలి ∙రెండు టేబుల్ స్పూన్ల నూనె, కొబ్బరి తురుము జత చేసి బాగా కలపాలి ∙నువ్వులు జత చేసి మరోమారు కలపాలి ∙బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండ కట్టకుండా కలుపుతుంటే బూరెల చలిమిడి తయారవుతుంది ∙చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాచాలి ∙అరటి ఆకు మీద లేదా ప్లాస్టిక్ కాగితం మీద కొద్దిగా నూనె పూసి, ఒక్కో ఉండను మందంగా ఒత్తి కాగిన నూనెలో వేయాలి ∙గోధుమరంగులోకి మారి బూరెల మాదిరిగా పొంగిన తరవాత చట్రంతో పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక డబ్బాలో నిల్వ చేయాలి. ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి. రిబ్బన్ పకోడా కావలసినవి: బాయిల్డ్ రైస్ – 2 కప్పులు, ఎండు మిర్చి – 10, వెల్లుల్లి ముద్ద – టీ స్పూను, ఉప్పు – తగినంత, సెనగ పిండి లేదా పుట్నాల పిండి – అర కేజీ, ఇంగువ – పావు టీ స్పూను, వేడి నూనె – 3 టేబుల్ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙బియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టి, నీళ్లు పూర్తిగా ఒంపేసి, తడి ఆరాక, గ్రైండర్లో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ సెనగ పిండి లేదా పుట్నాల పిండి, ఇంగువ, వెల్లుల్లి ముద్ద, 3 టేబుల్ స్పూన్ల వేడి నూనె జత చేసి జంతికల పిండిలా కలుపుకోవాలి ∙జంతికల గొట్టంలో రిబ్బన్లు తయారుచేసే ప్లేట్ ఉంచి, గొట్టంలో పట్టినంత రిబ్బన్ల పిండి ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక, మౌల్డ్ ఒత్తుతూ నూనెలోకి రిబ్బన్లు వేయాలి. సకినాలు కావలసినవి: కొత్త బియ్యం – కప్పు, వాము – టేబుల్ స్పూను, నువ్వులు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, బియ్యం మిక్సీలో వేసి పొడి చేసి, జల్లెడ పట్టాలి ∙వాము, నువ్వులు, ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి పిండి చేతికి అంటకుండా జంతికల పిండిలా కలుపుకోవాలి ∙కొద్దికొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, శుభ్రమైన వస్త్రం మీద గుండ్రంగా నాలుగు రౌండ్లు వచ్చేవరకు కొద్దికొద్దిగా పిండి వదులుతూ తిప్పాలి ∙సుమారు పావు గంట సేపు వీటిని ఆరనివ్వాలి ∙బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న సకినాలను గరిటెతో తీసి, నూనెలో వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. అరిసెలు కావలసినవి: పాత బియ్యం – 2 కేజీలు, అచ్చు బెల్లం – 2 కేజీల 800 గ్రా, నువ్వులు – 100 గ్రా., నూనె లేదా నెయ్యి – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙బియ్యాన్ని రెండు రోజులు నానిన తరవాత రోజూ నీళ్లు మార్చాలి. లేదంటే బియ్యం వాసన వస్తాయి) బియ్యంలో నీళ్లు ఒంపేసి, నీడలో, పొడి వస్త్రం మీద సుమారు పది నిమిషాలు ఆరబోయాలి ∙నీళ్లన్నీ పోయి, బియ్యం కొద్దిగా తడిగా ఉండగానే మిక్సీలో వేసి బియ్యం మెత్తగా చేసి, జల్లించాలి. (పిండిమరలో పట్టించగలిగితే బాగుంటుంది. రోకళ్లతో దంచినా కూడా బాగుంటుంది) ∙»ñ ల్లంలో తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు బాగా కలుపుతుండాలి ∙చిన్న పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో బెల్లం పాకం వేసి ఉండలాగ అయ్యిందో లేదో పరిశీలించుకోవాలి ∙పాకం తయారయిందనిపించగానే స్టౌ మీద నుంచి దింపేసి, 2 టీ స్పూన్ల నెయ్యి, నువ్వులు వేసి కలపాలి ∙ బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ దగ్గరపడేవరకు కలుపుతుండాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙ప్లాస్టిక్ కవర్‌కి నూనె పూసి, దాని మీద ఒక్కో ఉండను చేతితో కొద్దిగా పల్చగా ఒత్తి, కాగిన నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙అరిసెల చట్రం మీద ఉంచి, గట్టిగా ఒత్తి నూనె తీసేయాలి ∙ఈ విధంగా అరిసెలన్నీ తయారుచేసుకుని, చల్లారిన తరవాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి ∙అరిసెలు ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి. బూందీ లడ్డు కావలసినవి: సెనగ పిండి – 100 గ్రా., నీళ్లు – 110. మి.లీ., నూనె – అర టేబుల్ స్పూను పాకం కోసం: పంచదార – 150 గ్రా., నీళ్లు – 100 మి.లీ., ఏలకుల పొడి – అర టీ స్పూను, పచ్చ కర్పూరం – కొద్దిగా, కుంకుమ పువ్వు లేదా పసుపు – చిటికెడు, పంచదార – పావు టీ స్పూను, జీడి పప్పులు – 10, కిస్మిస్ – 10, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు తయారి: ∙ముందుగా సెనగపిండిని జల్లించాలి ∙పెద్ద పాత్రలో సెనగ పిండి, నీళ్లు వేసి గరిటె జారుగా వచ్చేలా పిండి కలుపుకోవాలి ∙అర టేబుల్ స్పూను నూనె జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙ఏలకుల పొడి, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు లేదా పసుపు, పావు టీ స్పూను పంచదారలను కలిపి పొడి చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక... కలిపి ఉంచుకున్న సెనగపిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి పడేలా నెమ్మదిగా దూయాలి. ఈ విధంగా మొత్తం బూందీ తయారుచేసుకోవాలి ∙జీడిపప్పులు, కిస్మిస్లను కరిగిన నెయ్యిలో దోరగా వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార వేసి, స్టౌ మీద ఉంచి, సన్నటి సెగ మీద తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ∙ జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి మిశ్రమం, బూందీలను పాకంలో వేసి బాగా కలపాలి ∙వేడిగా ఉండగానే బూందీ మిశ్రమం కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ లడ్డూలు తయారు చేయాలి ∙గంట సేపటి తరవాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి. -
‘గణతంత్రం’లో ‘సంక్రాంతి’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 66వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా ‘సంక్రాంతి సంబరాలు’ 3 డి శకటాన్ని ప్రదర్శించనున్నట్లు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. పరేడ్‌లో ప్రదర్శన కోసం రక్షణ శాఖకు అందిన 50 దరఖాస్తుల్లో ఏపీ శకటానికి అవకాశం లభించడం తెలుగువారికి సంతోషకరమన్నారు. ఏపీభవన్‌లో సోమవారం విలేకరుల సమావేశం సందర్భంగా ‘సంక్రాంతి సంబ రాలు’ 3డి శకటం నమూనాను ప్రదర్శించారు. ‘సూర్యుడు ఉదయించే రాష్ట్రం’, ‘సంక్రాంతి సంబరాలు’, ‘కూచిపూడి నృత్యం’ థీమ్‌లతో రక్షణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు కంభంపాటి చెప్పారు. యూపీఏ హయాంలో పల్లంరాజు రక్షణ శాఖ సహాయ మంత్రిగా ఉన్నా శకటం ప్రదర్శనకు అవకాశం రాలేదన్నారు.