breaking news
SANATHNAGAR MLA
-
గెలుపు తంత్రం... ‘గులాబీ’ మంత్రం
నగర చరిత్రలో తొలిసారిగా విపక్ష సభ్యుడికి స్థానం నలుగురికి అమాత్య పదవులతో సామాజిక సమతూకం వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు మంత్రమే లక్ష్యం ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామాపై తర్జనభర్జనలు హైదరాబాద్: నగర రాజకీయాల్లో మంగళవారం ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. టీడీపీ తరఫున సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రెండు రోజుల క్రితమే క్యాబినెట్ బెర్త్ ఖరారు కావటంతో తలసాని నివాసం సోమవారం కిటకిటలాడింది. ఆయన అనుచరులు నగరాన్ని అభినందనల ఫ్లెక్సీలతో ముంచెత్తారు. 24 శాసనసభ స్థానాలు కలిగిన గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచింది కేవలం మూడు స్థానాల్లోనే. దీంతో పార్టీని పునాది నుంచినిర్మించాలనేది అధినేత కేసీఆర్ వ్యూహం. అందులో భాగంగా టీఆర్ఎస్లోకి వచ్చిన తలసానికి క్యాబినెట్ పదవిని కట్టబెట్టారు. తద్వారా వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు భారం ఆయనపైనే మోపాలని పార్టీ అధినేత నిర్ణయించినట్లు సమాచారం. సమతూకం గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కుల,మతాల సమతూకంతో క్యాబినెట్ పదవుల పంపకం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే క్యాబినెట్లో మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్ అలీని డిప్యుటీ సీఎంగా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయిని నర్సింహారెడ్డిని హోంమంత్రిగా, గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మారావును ఎక్సైజ్ మంత్రిగా నియమించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంగళవారం క్యాబినెట్లో చేర్చుకోబోతున్నారు. దీంతో నగరంలో ప్రధాన సామాజిక వర్గాలన్నింటికీ ప్రాధాన్యమిచ్చినట్లవుతుందని టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే 1986లో జరిగిన మోండ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల నుంచిఉప్పు-నిప్పుగా వ్యవహరిస్తున్న తలసాని -పద్మారావుల మధ్య రాజకీయ సఖ్యత ఎలా కుదురుతుందన్న అంశం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. 1986లో మోండా డివిజన్ నుంచిపద్మారావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా...జనతా పార్టీ తరఫున బరిలోకి దిగిన తలసాని ఓటమి పాలయ్యారు. అనంతరం సికింద్రాబాద్ శాసనసభ ఎన్నికల్లో ఇద్దరూ రెండుసార్లు తలపడి... చొరొకసారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో ఇరువురు వేర్వేరు నియోకజవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించినా, ఇద్దరి మధ్య పాత వివాదాలు సమసిపోలేదు. రాజీనామాపై తర్జన భర్జనలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి... టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామాపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న తలసాని... ఒకటి, రెండు రోజుల్లో పదవికి రాజీనామా చేసి, మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చే సే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆర్నెళ్ల లోపు జరిగే ఎన్నికల్లో తలసానిని టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించి... గెలిచిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు సమాచారం. -
రేపు ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా
హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఉదయం రాజీనామా చేయనున్నారు. న్యాయపరమైన సమస్యల నుంచి తప్పించుకునేందుకు ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవికి ఖాయమైంది. 2014 ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజా కేబినెట్ విస్తరణలో తలసానికి మంత్రి పదవికి ఖాయమైంది. మరోవైపు విప్ ధిక్కరించినందుకు తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), చల్లా ధర్మారెడ్డి (పరకాల)లపై అనర్హత వేటు వేయాలని టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ముగ్గురికి స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తలసాని నిర్ణయించారు. -
తలసాని దారెటు.. ?
హైదరాబాద్: పండుగ.. ఫంక్షన్.. ఊరేగింపు.. ఇలా కార్యక్రమం ఏదైనా సరే.. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనదైన శైలితో రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ గందరగోళం రేపుతున్నారు. కొంత కాలంగా టీడీపీ సైకిల్ వీడి.. టీఆర్ఎస్ కారెక్కుతారనే ప్రచారం జరుగుతుండగా, ఆయన వ్యవహార శైలి సైతం అందుకు అనుగుణంగానే ఉంటోంది. టీడీపీలో సీనియర్ నాయకునిగా, హైదరాబాద్ జిల్లా పా ర్టీ అధ్యక్షునిగా ఉన్న ఆయన టీఆర్ఎస్తోనూ అంతే సఖ్యతతో ఉండడం అయోమయానికి గురిచేస్తోంది. దసరా రోజున తమ కుమార్తె శ్వేత వివాహ నిశ్చయ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబును, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నూ ఆహ్వానించడంతో ఇద్దరూ హాజరయ్యారు. ఇలాంటి ఘటనలే గతంలోనూ చోటు చేసుకున్నాయి. ఐడీహెచ్ కాలనీలో పేదల ఇళ్ల కోసమని నెలరోజుల క్రితం చంద్రశేఖర్‌రావును అక్కడకు రప్పించారు. ఆ హామీ మేరకు దసరా రోజున సదరు ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. టీడీపీలో తాను కోరుకున్న పార్టీ శాసనసభాపక్ష నేత పదవి దక్కనప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారుతోంది. టీడీపీ- టీఆర్ఎస్ రెండు పార్టీలతోనూ సమదూరం పాటిస్తున్నారు. రెండు పడవల వైఖరి చివరకు ఏమజిలీకి చేరుతుందో అర్థం కాక పలువురు వేచి చూస్తున్నారు. కేసీఆర్‌తో గతంలో ఉన్న సాన్నిహిత్యం.. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదనే అంచనాలు.. తదితర పరిణామాలతో తలసాని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నప్పటికీ.. ఆ విషయాన్ని స్పష్టం చేయకుండా.. కాదని ఖండిం చకుండా.. వ్యవహారాన్ని నడుపుకొస్తున్నారు. కాగా, టీఆర్ఎస్ ప్లీనరీ లోగా తలసాని టీఆర్ఎస్లో చేరేదీ, లేనిదీ స్పష్టం కానుందని రాజ కీయ పరిశీలకులు భావిస్తున్నారు.