breaking news
Sana Saeed
-
ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్
కుచ్ కుచ్ హోతా హై ఫేమ్ సనా సయీద్ న్యూయర్ వేళ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. లాస్ ఏంజిల్స్‌లో తన ప్రియుడు సబా వాగ్నర్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది బాలీవుడ్ భామ. కరణ్ జోహార్ నిర్మించిన 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రంలో షారూఖ్, రాణి కుమార్తెగా అంజలి పాత్రలో సనా కనిపించింది. ఆమె తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేస్తూ లవ్ సింబల్‌తో ఎంగేజ్మెంట్ గుర్తుగా రింగ్‌ను జతచేసింది. ఆమె పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే పలువురు ప్రముఖులు ఈ జంటను కంగ్రాట్స్ తెలిపారు. సనా కెరీర్..: కాగా.. కాజోల్, రాణి ముఖర్జీ కూడా నటించిన కరణ్ జోహార్ చిత్రంలో సనా షారూఖ్ కుమార్తెగా అంజలి పాత్రను పోషించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో తర్వాత రాణి ముఖర్జీతో కలిసి మరో చిత్రంలో నటించింది. ఆ తర్వాత కరణ్ జోహార్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లోనూ కనిపించింది. ఈ చిత్రంలో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. 2012 చిత్రం తర్వాత, సనా అనేక టెలివిజన్, రియాల్టీ షోలలో కూడా కనిపించింది. సబా వాగ్నర్ ఎవరు?:సనా ప్రియుడు సబా వాగ్నర్ ఒక సౌండ్ డిజైనర్. అతను లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నాడు. అతను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో సనాతో ఉన్న ఫోటోలు, వీడియోలను పంచుకుంటాడు. View this post on Instagram A post shared by Sana Saeed (@sanaofficial) -
షూటింగ్‌లకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చింది
ముంబై: మూవీ షూటింగ్ లకు కొద్దిరోజులు బ్రేక్ పెట్టింది బాలీవుడ్ సుందరి సనా అబ్దుల్ అహద్ సయీద్. 'స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్' మూవీతో గ్లామర్ పాత్రలో రీఎంట్రీ ఇచ్చిన సనా, నటనకు సంబంధించిన ఓ వర్క్ షాప్‌కు హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్ వెళ్లనుంది. అందుకే కొన్ని రోజులు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. తొలి మూవీకి ముందే లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ అకాడమీ వర్క్ షాప్‌కు అప్లై చేసుకున్నట్లు తెలిపింది. అయితే తనకు అకాడమీలో చాన్స్ దొరికేలోగా మూవీలో నటించేందుకు అవకావం ఉంటే వదులుకోకుడని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చేశానని వివరించింది. 2012లో రిలీజైన 'స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన విషయం విదితమే. షారుక్ నటించిన 'కుచ్ కుచ్ హోతా హై' మూవీతో బాలనటిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటి సనా సయీద్. రియాల్టీ షోలు సెలబ్రిటీలు తాము ఎలా ఉంటారన్నది తెలిపేందుకు చక్కని వేదిక అని చెప్పింది. టీవీ షో, బాలీవుడ్ ఇండస్ట్రీలలో దేనిని ఎంచుకుంటారన్న విలేఖరి ప్రశ్నకు.. కచ్చితంగా బాలీవుడ్ మూవీలనే ఎంచుకుంటానన్నది. టీవీ షోలు 'ఝలక్ దిక్ లాజా', 'నాచ్ బలియో 7' లలో సనా పాల్గొన్న విషయం అందరికి విదితమే. లాస్ ఏంజిల్స్ వెళ్తున్నానని, తన దగ్గర టిక్కెట్లు కూడా ఉన్నాయంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.