breaking news
Samsung Mobiles Fest
-
శాంసంగ్ మొబైల్ ఫెస్ట్: దండీగా ఎక్స్చేంజ్ ఆఫర్స్
ఇటీవలే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ తో షియోమి స్మార్ట్ ఫోన్ వినియోగదారులను మైమరిపించిన సంగతి తెలిసిందే. షియోమి తర్వాత వెంటనే దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కూడా మొబైల్ ఫెస్టివల్ కు తెరలేపింది. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తో కలిసి శాంసంగ్ మూడు రోజుల పాటు మొబైల్ ఫెస్ట్ ను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 13 వరకు ఫ్లిప్ కార్ట్ పై ఈ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ ఫెస్ట్ లో భాగంగా శాంసంగ్ ఫోన్లపై డిస్కౌంట్లు, భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రవేశపెట్టారు. గెలాక్సీ ఆన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. 18,490 రూపాయలు కలిగిన ఈ ఫోన్ ను 3 వేల రూపాయల డిస్కౌంట్ పై 15,490లకు అందుబాటులోకి తెచ్చింది. అదే ఎక్స్చేంజ్ పై అయితే రూ.14,500 ధరను తగ్గిస్తోంది. ఈ మొబైల్ ఫెస్టివల్ లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ జే5 ధర రూ.10,990నే. ఈ ఫోన్ పై కూడా ఎక్స్చేంజ్ పై 10వేల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ జే5 అసలు ధర రూ.13,290. ఎలాంటి ఈఎంఐ ధరలు లేకుండా ప్రారంభ ధర 1722 రూపాయలకు శాంసంగ్ ఫోన్లను పొందవచ్చు. ఇలా మిగతా శాంసంగ్ ఫోన్లు గెలాక్సీ ఆన్7, గెలాక్సీ ఆన్8, గెలాక్సీ ఆన్9, గెలాక్సీ సీ9ప్రొ పై కూడా కంపెనీ ఎక్స్చేంజ్, డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. దీనిలో భాగంగా టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ కూడా 1జీబీ డేటా ఖరీదుపై 14జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అయితే ఎక్స్చేంజ్ ఏ ఫోన్ తో చేసుకోవాలో కంపెనీ తెలుపలేదు. -
గెలాక్సీ ఫోన్ల ధరలు తగ్గించిన ఫ్లిప్ కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ శాంసంగ్ మొబైల్స్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. తన పోర్టల్ పై 'శాంసంగ్ మొబైల్స్ ఫెస్ట్' ను నిర్వహిస్తున్న ఈ ఈ-కామర్స్ దిగ్గజం పలు ఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఫెస్ట్ కింద శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్, శాంసంగ్ గెలాక్సీ ఆన్8, శాంసంగ్ గెలాక్సీ ఆన్7, శాంసంగ్ గెలాక్సీ ఆన్5, శాంసంగ్ గెలాక్సీ జే5(2016), శాంసంగ్ గెలాక్సీ ఏ9 ప్రొ, గెలాక్సీ సీ9 ప్రొల తక్కువ ధరకు లభించనున్నాయి. గెలాక్సీ ఆన్5పై ఈ దిగ్గజం రూ.2860 వరకు ధరను తగ్గించింది.రూ.9850గా ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం రూ.6990కు అందుబాటులో ఉంచింది. గెలాక్సీ ఆన్ నెక్ట్స్ పై కూడా రూ.2590 ధరను తగ్గించి, బ్లాక్, గోల్డ్ వేరియంట్లు రూ.15,900 కొనుక్కునే విధంగా ఫ్లిప్ కార్ట్ అవకాశం కల్పిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.18,490. ఈ ఫెస్ట్ కింద రూ.15,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఐడియా సబ్ స్క్రైబర్లు 1జీబీ రీఛార్జ్ తో 14జీబీ పొందనున్నారు. ధర తగ్గిన మిగతా గెలాక్సీ ఫోన్ల వివరాలు గెలాక్సీ జే5(2016) ధర రూ.2300 తగ్గింపు, ప్రస్తుతం బ్లాక్, గోల్డ్ వేరియంట్లు రూ.10,990కు అందుబాటు(ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండదు). గెలాక్సీ ఆన్8 పై రూ.2000 తగ్గింపు, గెలాక్సీ ఆన్7పై రూ.1700 తగ్గింపు గెలాక్సీ ఆన్8పై రూ.13వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటు గెలాక్సీ ఆన్8, గెలాక్సీ ఆన్7 ఏది కొన్నా ఐడియా 1జీబీ రీఛార్జ్ తో 14జీబీ డేటా పొందవచ్చు. గెలాక్సీ ఆన్9 ప్రొ, గెలాక్సీ సీ9 ప్రొలపై ధరలు తగ్గించనప్పటికీ, భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఎక్స్చేంజ్ లో కొన్నవారికి రూ.16వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్ల ధర రూ.29,900, రూ.36,900గా ఉన్నాయి.