breaking news
salary account
-
శాలరీ అకౌంట్ ఉంటే ఇవన్నీ ఉన్నట్టే..
వివిధ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ఉంటుంది. ఇది సాధారణ బ్యాంకు ఖాతా లాగే పనిచేస్తుంది. ఇందులో కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెలా జీతాన్ని జమ చేస్తారు. ఈ డబ్బును ఖాతాదారులు ఉపసంహరించుకుంటారు.. లావాదేవీలు చేస్తారు.. ఖర్చులను నిర్వహిస్తారు. అయితే శాలరీ అకౌంట్ తో వచ్చే ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఖాతా తెరిచే సమయంలో చాలా బ్యాంకులు ఈ ప్రయోజనాలను వెల్లడించవు.క్లాసిక్ శాలరీ అకౌంట్స్, వెల్త్ శాలరీ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-శాలరీ, డిఫెన్స్ శాలరీ అకౌంట్స్ ఇలా వివిధ రకాల శాలరీ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో దాగిఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.యాక్సిడెంటల్ డెత్, హెల్త్ ఇన్సూరెన్స్చాలా శాలరీ అకౌంట్లు యాక్సిడెంటల్ డెత్ కవర్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ను అదనపు భద్రతా ఫీచర్ గా కలిగి ఉంటాయి. ఖాతాదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందిస్తాయి.రుణాలపై తక్కువ వడ్డీ రేట్లుశాలరీ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలపై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీనివల్ల రుణ కాలపరిమితిలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీఅత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాలలో ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీ ఖాతా బ్యాలెన్స్ జీరో ఉన్నప్పటికీ కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తుంది.ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలువేగవంతమైన ప్రాసెసింగ్, డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్, ఎక్స్ క్లూజివ్ బ్యాంకింగ్ ఆఫర్లతో సహా అనేక బ్యాంకులు శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రాధాన్యతా సేవలను అందిస్తున్నాయి.ఉచిత క్రెడిట్ కార్డులు, రివార్డులుబ్యాంకులు తరచుగా శాలరీ అకౌంట్లతో కాంప్లిమెంటరీ క్రెడిట్ కార్డులను అందిస్తాయి. వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తాయి.ఆన్ లైన్ షాపింగ్ & డైనింగ్ డీల్స్శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఆన్లైన్ షాపింగ్, డైనింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో సహా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. జీవనశైలి ఖర్చులను మరింత చౌకగా చేస్తాయి.ఉచిత డిజిటల్ లావాదేవీలుసాధారణ ఖాతాల మాదిరిగా కాకుండా, చాలా బ్యాంకులు శాలరీ ఖాతాదారులకు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలను మాఫీ చేస్తాయి.ఫ్రీగా చెక్ బుక్, డెబిట్ కార్డులుశాలరీ అకౌంట్ కస్టమర్లకు చాలా వరకు బ్యాంకులు ఎటువంటి రుసుములు లేకుండా చెక్ బుక్ లు, డెబిట్ కార్డులను అందిస్తుంటాయి. ఇవి చిన్నపాటివే అయినా పునరావృతమయ్యేవి కాబట్టి ప్రయోజనం ఉంటుంది.ఉచిత ఏటీఎం లావాదేవీలుఅనేక బ్యాంకులు ప్రతి నెలా ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం ఉపసంహరణలను అనుమతిస్తాయి. దీంతో అదనపు ఛార్జీల గురించి ఆందోళన లేకుండా నగదును యాక్సెస్ చేసుకోవచ్చు.జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీచాలా శాలరీ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ ఫీచర్‌తో వస్తాయి. అంటే కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఇది సాధారణ సేవింగ్స్ ఖాతాలకు లేని ప్రయోజనం. -
ఎస్బీఐ వినియోగదారులకు తీపికబురు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఇక నుంచి లోన్ కోసం బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఎస్బీఐ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ కింద కేవలం 5 సెకన్లలో 20లక్షల రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ లోన్ కోసం వినియోగదారులు మిస్డ్ కాల్ లేదంటే ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. దీనితో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. పెళ్లి, ఎమర్జెన్సీ, ఏదైనా ప్రొడక్టుల కొనుగోలు వంటి వాటికీ త్వరితగతిన రుణం లభిస్తుంది. ఈ విషయాన్నీ ఎస్బీఐ తన ట్విటర్ ద్వారా పేర్కొంది. తక్కువ డాక్యుమెంటేషన్‌తో వినియోగదారులు వెంటనే లోన్ పొందడానికి ఈ సేవలను ప్రారంభించినట్లు ఎస్బీఐ పేర్కొంది. ఈ ఎస్బీఐ వ్యక్తిగత రుణలపై వడ్డీ రేటు 9.60 శాతంగా ఉంటుంది. ఇది అన్ని భారతీయ బ్యాంకులతో పోలిస్తే చాలా తక్కువ. ఎస్బీఐ శాలరీ అకౌంట్ గల ఖాతాదారుడు మొదట ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ సర్వీసు ద్వారా పొందగలిగే ఎస్బీఐ రుణ మొత్తం రూ.25 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. వినియోగదారుడు మొదటి రుణ ఈఎంఐలను సకాలంలో చెల్లించినట్లయితే తర్వాత రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ రుణాలను పొందవచ్చు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఎస్బీఐ వ్యక్తిగత రుణం ఎటువంటి హామీ లేదా భద్రత లేకుండా ఇవ్వబడుతుంది. పూర్తీ వివరాల కోసం ఈ లింకు క్లిక్ చేయండి. Personal loans made convenient! Give a missed call on 7208933142 and get a call bank from us. To know more: https://t.co/TH5bnGWu1V pic.twitter.com/OIBfuBcyW4 — State Bank of India (@TheOfficialSBI) February 15, 2021 ఈ లోన్ పొందాలంటే కచ్చితంగా వినియోగదారుడు ఎస్బీఐ శాలరీ అకౌంట్ కలిగి ఉండటంతో పాటు కనీస నెలవారీ ఆదాయం రూ.15వేలు ఉండాలి. ఈ ఎస్బీఐ రుణాన్ని పొందాలని భావించే వారు PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది. లేదంటే 7208933142 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీకు రుణం లభిస్తుంది. అయితే రుణ గ్రహీత రుణ అర్హత ప్రాతిపదికనే రుణ మంజూరీ ఉంటుంది. మీరు తీసుకునే రుణమొత్తాన్ని బట్టి వడ్డీ రేటు కూడా 9.60 శాతం నుంచి నిర్ణయించబడుతుంది. చదవండి: మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్ -
నౌకాదళ సిబ్బందికి హెచ్డీఎఫ్సీ వేతన అకౌంట్లు
హైదరాబాద్: భారత నౌకాదళ సిబ్బందికి వేతన అకౌంట్ సదుపాయాన్ని హెచ్డీఎఫ్సీ కల్పించనున్నది. ఈ మేరకు భారత నావికాదళంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నవారితో పాటు రిటైరైన వారికి కూడా ఈ వేతన అకౌంట్ సదుపాయాన్ని కల్పిస్తామని హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ (నార్త్) గుల్టార్ సింగ్ పేర్కొన్నారు.