breaking news
Sajja Bujji TDP
-
బయటపడ్డ టీడీపీ నేత కర్కశత్వం..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంగేటి శ్రీగౌతమి యాక్సిడెంట్ కేసు 17 నెలల తరువాత కొత్తమలుపు తిరిగింది. టీడీపీనాయకుల కర్కశత్వాన్ని బట్టబయలు చేస్తూ శ్రీగౌతమిని పక్కా పథకం ప్రకారం హత్యచేసినట్టుగా తేలినట్టు తెలిసింది. అప్పట్లో ఘోరం జరిగిన 15 రోజులకే తూతూమంత్రంగా దర్యాప్తు పూర్తిచేసి ఇది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదమేనని తేల్చేసి, హడావిడిగా ఫైల్ మూసేసిన పోలీసులు మళ్లీ కేసును సీబీసీఐడీ రంగప్రవేశంతో పునః విచారణ చేసి హత్యకేసుగా నమోదు చేసినట్టు తెలిసింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం: శ్రీ గౌతమి కేసులో టీడీపీ ముఖ్యనేత సజ్జా బుజ్జితో పాటు మరికొందరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. అప్పట్లో శ్రీగౌతమిది హత్యేనంటూ ఆమె సోదరి పావని, తల్లి అనంతలక్ష్మి ఎందరో నేతలకు తమ గోడు చెప్పుకున్నారు. పోలీసుల కాళ్లావేళ్లా పడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బుజ్జి టీడీపీ నేత కావడం, పైగా ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎవరూ శ్రీగౌతమి కుటుంబం వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటి దర్యాప్తు అధికారులు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కేసును నీరు కార్చేశారని సమాచారం. వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. జరిగిన ఘోరం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని మాత్రం ధైర్యంగా అక్కకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటానికి సిద్ధపడింది. కేసును నిస్పక్షపాతంగా విచారించి న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా సీబీసీఐడీని ఆశ్రయించింది. సీఐడీ జోక్యం చేసుకుని కేసు విచారణ ప్రాథమికంగా చేయడం, కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేయడంతో ఇది హత్యేనని నిరూపణ అయ్యింది. తరువాత మళ్లీ పోలీసులు కేసును తిరిగి విచారణకు చేపట్టడం జరిగాయి. అసలేం జరిగింది 2017 జనవరి 18వ తేదీ రాత్రి 8.30 దాటిన తరువాత పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పరిధిలోని దిగమర్రు కొత్తోట పంచాయతీ పరిధిలో నరసాపురం–పాలకొల్లు మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రి పనిపై పాలకొల్లు వెళ్ళిన అక్కాచెల్లెళ్ళుశ్రీగౌతమి, పావనిలు యాక్టివాపై నరసాపురం వస్తుండగా, వెనుక నుంచి ఇన్నోవా ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్క శ్రీగౌతమి అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందింది. చెల్లి పావని మాత్రం రెండు రోజుల తరువాత స్పృహలోకి వచ్చింది. అప్పటి వరకూ మద్యం మత్తులో ఆకతాయిలు వెంబడించి కారుతో ఢీకొట్టారని అనుకున్నారు అంతా. అయితే తెలివిలోకి వచ్చిన పావని అసలు విషయం బయటపెట్టింది. టీడీపీ నేత సజ్జా బుజ్జి తమపై హత్యా ప్రయత్నం చేశాడని చెప్పింది. తన అక్కను బుజ్జి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని అప్పటి వరకూ తన తల్లికి కూడా తెలియని విషయాన్ని బయటపెట్టింది. పెళ్లి ఫొటోలను కూడా విడుదల చేసింది. బుజ్జిని అరెస్ట్ చేయాలంటూ తీవ్ర గాయాలతోనే పోరాటం చేసింది. ఆమెకు మద్దతుగా రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నిలిచాయి. కానీ అది యాక్సిడెంట్ అని అతి తక్కువ రోజుల్లో పోలీసులు ఫైల్ క్లోజ్ చేశారు. కేసు నీరుగార్చే దిశగా జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ అప్పట్లో సాక్షిలో ప్రచరితమైన వరుస కథనాలు కాక పుట్టించాయి. ఇదంతా కుట్రంటూ టీడీపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. చివరకు చేసిన ఘోరం బట్టబయలైనట్టుగా తెలుస్తోంది. అనుమానాలు రేకెత్తించిన దర్యాప్తు పోలీసులు కేసు దర్యాప్తు సాగించిన తీరు మొదటి నుంచీ అనుమానాలు రేకెత్తించింది. అప్పట్లో ఏఎస్పీగా ఉన్న రత్న విచారణ చేశారు. సంచలనమైన ఈ కేసులో అనుమానితులుగా ఉన్న సజ్జా బుజ్జిని అతని భార్యను పట్టణంలోని ఓ గెస్ట్‌హౌస్‌కు పిలిచి నామమాత్రంగా విచారణ చేయడం, వెంటనే వారి ప్రమేయంలేదని పోలీసులు తేల్చి చెప్పడంతో సామాజికవర్గాన్ని నేపధ్యంగా ఎంచుకుని బుజ్జికి సీఎం సన్నిహితులు సహాయ పడుతున్నారనే విమర్శలు వచ్చాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బడా వ్యక్తులు వ్యవహారం నడిపారనే వార్తలు వచ్చాయి. స్వయంగా లోకేష్‌బాబు కలగజేసుకున్నారనే గుసగుసలు కూడా వినిపించాయి. అనుమానాలకు తావిస్తూ, కేవలం 15 రోజుల్లోనే యాక్సిడెంట్ కేసుగా చెప్పి పోలీసులు కేసు క్లోజ్ చేశారు. విశాఖపట్టణంకు చెందిన పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లు యాక్సిడెంట్ చేశారని అరెస్ట్ చూపించారు. సందీప్ కొత్తకారు కొనుక్కుని కోడి పందాల కోసం భీమవరం వచ్చాడని తిరిగి వెళ్లేప్పుడు, స్కూటీపై వెళుతున్న గౌతమి, పావనిల వెంటపడి మద్యం మత్తులో ప్రమాదం చేశారని తేల్చారు. దీనిలో ఎలాంటి పొంతనలు లేనప్పటికీ కేసును తొందరగా ముగించారు. ఇక తరువాత పోలీసులు పావని ఆవేదనను పట్టించుకోలేదు. పోనీ పెళ్లయిన వ్యక్తి మా అక్కను రెండో పెళ్లి మోసం చేసి చేసుకున్నాడని పావని పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. సీఐడీ రంగప్రవేశంతో సీన్ రివర్స్ అయితే పావని తన అక్కకు జరిగిన అన్యాయంపై పోరాటం కొనసాగించింది. డీఐజీ, డీజీపీలతో పాటు సీఐడీకి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కొన్ని నెలలుగా రాజమండ్రి సీఐడీ అధికారులు కేసును దర్యాప్తు చేస్తూ వచ్చారు. ఈ దర్యాప్తులో శ్రీగౌతమిది హత్యేనని తేలింది. ఇందులో అమెను రెండోపెళ్లి చేసుకున్న సజ్జా బుజ్జి ప్రమయం ఉన్నట్టుగా తేలినట్టు తెలిసింది. యాక్సిడెంట్ చేసిన వారి ఖాతాలలో రెండుసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు వేసినట్లు గుర్తించారు. ఏ ఖాతా నుంచి డబ్బులు పడ్డాయన్న వివరాల తీగ లాగితే డొంకంతా కదిలింది. అంతే కాకుండా నరసాపురం జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాపం హస్తం కూడా ఉన్నట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించినట్టు సమాచారం. దీంతో ఈ కేసును సీఐడీ పూర్తి స్థాయిలో బట్టబయలు చేసే సమయంలో తిరిగి పోలీసులు విచారణకు తీసుకున్నట్టుగా తెలిసింది. బుజ్జితో పాటుగా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెపుతున్నారు. అయితే జడ్జీటీసీని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే కేసును పూర్తిగా సీఐడీ దర్యాప్తు చేస్తే గతంలో విచారణలో చేసిన తప్పులు బయటకు వస్తాయని తిరిగి పోలీసులే విచారణకు తీసుకుని ముందుకెళుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈసారైనా శ్రీగౌతమి కుటుంబానికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మా అక్కను చంపిన వారికి శిక్ష పడాలి తను మోసపోయింది. ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని బుజ్జి చెప్పాడు. రహస్యంగా పెళ్ళి కూడా చేసుకున్నాడు. ముందు భార్యకువిడాకులు ఇచ్చేస్తానని, అది అసలు పెళ్ళికాదని చెప్పేవాడు. ఇబ్బంది వచ్చిందని చంపేశాడు. మా కుటుంబానికి అప్పుడు న్యాయం జరగలేదు. కేసును మళ్లీ విచారించే వరకూ న్యాయ పోరాటం చేశాను. మాకు ఇప్పటికైనా న్యాయం చేయాలి. – పావని విచారణలో ఉంది కేసు విచారణలో ఉంది. కొన్ని ఆధారాలతో కేసును మళ్లీ విచారణ చేస్తున్నాము. పూర్తి వివరాలను రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తాం. కేసు విచారణలో ఉండగా ఇంతకు మించి వివరాలు చెప్పలేం. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది. – కె.రజనీకుమార్, పాలకొల్లు రూరల్ సీఐ 2017 జనవరిలో ‘సాక్షి’ ప్రచురించిన కథనం మోసగించి రహస్యంగా వివాహం నరసాపురం కోవెలగుడి వీధిలో గత 26 సంవత్సరాలుగా శ్రీగౌతమి కుటుంబం నివాసం ఉంటోంది. దంగేటి నర్శింహారావు, అనంతలక్ష్మిలకు శ్రీగౌతమి, పావని ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే నర్శింహారావు నడివయసులో మూడేళ్ల క్రితం చనిపోయారు. దీంతో కుటుంబంలో అక్కా, చెల్లి, తల్లి మిగిలారు. శ్రీగౌతమి చదువుల్లో ఫస్ట్. వైఎన్ కళాశాలలో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసింది. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే, మరోపక్క చదువు కొనసాగించేది. బుజ్జి రొయ్యలమేత షాపులో శ్రీగౌతమి తండ్రి పనిచేసేవాడు. తండ్రి వద్దకు వెళ్లే క్రమంలో బుజ్జితో శ్రీగౌతమికి పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లయ్యి, పిల్లలున్న బుజ్జి తన అక్కను మోసం చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని పావని ఆరోపిస్తూ వస్తోంది. సివిల్స్‌కు సమాయత్తమవ్వడం కోసం వైజాగ్‌లో ఉంటూ సంక్రాంతి పండుగ నిమిత్తం ఇంటికి వచ్చినపుడు శ్రీగౌతమి ప్రమాదంలో చనిపోయింది. -
శ్రీగౌతమిది ముమ్మాటికీ హత్యే
మృతురాలి తల్లి అనంతలక్ష్మి ∙దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు పాలకొల్లు టౌన్: పాలకొల్లు–నరసాపురం రోడ్డులో దిగమర్రు సమీపంలో ఈ నెల 18న మరణించిన శ్రీగౌతమిది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి దంగేటి అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని శనివారం రాత్రి పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాలు యథాతథంగా.. నా రెండో కుమార్తె పావని నరసాపురంలోని దత్తగణపతి ఫీడ్స్ షాపులో పనిచేస్తున్న సమయంలో నరసాపురానికి చెందిన సజ్జా బుజ్జి రొయ్యల మేత కొనుగోలుకు తరచూ అక్కడకు వచ్చేవాడు. పావనితో పరిచయం ఉన్న అతను తర్వాత నా పెద్ద కూతురు శ్రీగౌతమిని పరిచయం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గౌతమి వాళ్ల నాన్న మరణించడంతో బుజ్జి ఆమెను ఓదారుస్తున్నట్టు నటించి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టాడు. ఇంతకు ముందే బుజ్జికి పెళ్లి కావడంతో గౌతమి దీనికి నిరాకరించింది. దీంతో బుజ్జి తన భార్య శిరీషకు, తనకు గొడవలు ఉన్నాయని, ఆమెకు విడాకులు ఇచ్చేస్తున్నట్టు నమ్మించాడు. ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బుజ్జి మొదటి భార్య శిరీష, బుజ్జి కారు డ్రైవర్ రాంబాబు, అతని అనుచరుడు బొల్లెంపల్లి రమేష్‌తో తరచూ బెదిరింపులకు పాల్పడేవారు. ఆ తర్వాత గౌతమి సివిల్ కోచింగ్‌కు విశాఖకు వెళ్లింది. దీంతో బుజ్జి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెతో సరిగ్గా మాట్లాడకపోవడం, ముఖం చాటేయడం చేశాడు. సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చిన గౌతమి కదలికలను శిరీష, రాంబాబు, రమేష్ గమనించారు. ఈ నెల 17న గౌతమి ఆరోగ్యం బాగోకపోవడంతో చెల్లెలు పావనీతో కలిసి నరసాపురం రాయపేటలో ఉన్న బుజ్జి వద్దకు వెళ్లి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరింది. అయితే బుజ్జి అతనితోపాటు అక్కడే ఉన్న అతని అనుచరుడు రమేష్ ఇప్పుడు ఖాళీ లేదని చెప్పారు. దీంతో గౌతమి, పావని ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత రమేష్ తరచూ గౌతమికి ఫోన్ చేసి ఆస్పత్రికి వెళ్లారా.. ఎన్నిగంటలకు వెళ్తున్నారని ఆరా తీసేవాడు. ఈ నేపథ్యంలోనే 18న గౌతమి, పావని ఆసుపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా, ప్రమాదానికి గురయ్యారు. గౌతమి అక్కడికక్కడే మరణించింది. గౌతమిని పథకం ప్రకారమే బుజ్జి భార్య శిరీష, అతని అనుచరుడు రమేష్, కారు డ్రైవర్ రాంబాబు కలిసి హత్య చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలి. అందుబాటులో లేని సీఐ, ఎస్సై ఫిర్యాదు చేసేందుకు గౌతమి తల్లి అనంతలక్ష్మి వచ్చిన సమయంలో సీఐ ఎ.చంద్రశేఖర్, ఎస్సై ఆదిప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో ఆమె హెడ్ కానిస్టేబుల్ కె.యెహెజ్కెలుకు ఫిర్యాదు అందజేసి రశీదు తీసుకున్నారు. ఆమె వెంట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, పాలకొల్లు డివిజన్ ఉపాధ్యక్షుడు జి.యుగంధర్ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉంటే దీనిపై మానవహక్కుల కమిషన్‌కు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ చెప్పారు. ఈ కేసును తక్షణం ప్రభుత్వం సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. -
శ్రీగౌతమిని వెంటాడి చంపేశారు
అనూహ్య మలుపు తిరిగిన రోడ్డు ప్రమాదం కేసు మీడియా ముందుకు విద్యార్థిని చెల్లెలు పావని టీడీపీ నేత బుజ్జి భార్యే ఈ హత్య చేయించింది బుజ్జితో మా అక్కకు గతేడాదే పెళ్లయ్యింది సాక్షి ప్రతినిధి, ఏలూరు (నర్సాపురం): పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు– నరసాపురం రోడ్డులో నాలుగు రోజుల క్రితం ప్రమాదంలో మరణించిన విద్యార్థిని శ్రీగౌతమి కేసు అనూహ్య మలుపు తిరిగింది. తన అక్కను వెంటాడి మరీ చంపేశారని ఆ ప్రమాదంలోనే గాయపడ్డ శ్రీగౌతమి చెల్లెలు పావని స్పష్టం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఆదివారం ఇంటికి చేరుకుని విలేకరులతో మాట్లాడింది. స్థానిక తెలుగుదేశం పార్టీ నేత సజ్జా బుజ్జి భార్య శిరీష, ఆమె డ్రైవర్ రాంబాబు కలిసి ఈ హత్య చేశారని ఆరోపించింది. (చదవండి: ఐఏఎస్ కావాల్సిన యువతి..) కేసును పక్కదోవ పట్టించే యత్నం ఈ వ్యవహారంలో తెలుగుదేశం నేత కుటుంబం ఉండటంతో పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవ తున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు దాటినా ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. కారు విశాఖపట్నం నుంచి వచ్చిందని చెబుతున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసులో పురోగతి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం గురించి పావని మాటల్లోనే... బుధవారం సాయంత్రం నేనూ, అక్క పాలకొల్లు ఆస్పత్రికి వెళ్లి వస్తున్నాం. పాలకొల్లు దాటిన తర్వాత కొందరు కారులో వెంబడించారు. కారులోంచి కొందరు నా చున్నీ పట్టుకుని లాగేందుకు యత్నించారు. తేరుకునే లోపే మా స్కూటర్‌ను కారుతో ఢీకొట్టారు. దీంతో నేను కారుపై పడ్డాను. నన్ను కొంతదూరం ఈడ్చుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. స్థానిక టీడీపీ నేత సజ్జా బుజ్జితో అక్కకు చాలాకాలంగా పరిచయం ఉంది. 2016 జనవరిలో అక్కను బుజ్జి పెళ్లిచేసుకున్నాడు. అతడికి అంతకు ముందే శిరీషతో పెళ్లయింది. ఆమెతో తనకు పడటం లేదని, త్వరలోనే విడాకులు ఇచ్చేస్తానని బుజ్జి అక్కకు చెప్పేవాడు. బుజ్జి భార్య అక్కను రోజూ వేధించేది. చంపేస్తానని ఫోన్లో బెదిరించేది. శిరీషే ఈ హత్య చేయించింది. కారులో నలుగురో, ఐదుగురో ఉన్నారు. డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని అనడం అబద్ధం. బుజ్జి, అక్క కలిసి ఉన్న ఫొటోలు, ఆసుపత్రి బిల్లులు పోలీసులు తీసుకువెళ్లారు. పెద్దవాళ్లకు చెప్పొచ్చు కదా! ‘‘నా కుమార్తెను కిరాతకంగా చంపేశారు. మా ఆయన చనిపోయారు. ఇద్దరు ఆడపిల్లలతో బతుకుతున్నాను. శ్రీగౌతమి పెద్దకొడుకుగా ఉండేది. సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. శిరీష వాళ్ల ఆయనకు మా అమ్మాయితో సంబంధం ఉంటే నాతోటో, పెద్దలతోనో చెప్పొచ్చు. లేదంటే పోలీసు కేసు పెట్టవచ్చు, కోర్టుకు వెళ్లొచ్చు. ఏకంగా చంపించేస్తారా? కచ్చితంగా శిరీషే ఈ హత్య చేయించింది. మా కుటుంబానికి న్యాయం జరగాలి’’ – టి.అనంతలక్ష్మి, శ్రీగౌతమి తల్లి