breaking news
Sajal Ali
-
వైరలవుతున్న నటి పెళ్లి ఫొటోలు
ముంబై: పాకిస్తాన్ నటి సజల్ అలీ తన చిరకాల మిత్రుడు, సహ నటుడు అహద్ రజా మీర్‌ను వివాహమాడారు. ఇటీవలే వీరి పెళ్లి వేడుక అబుదాబిలో ఘనంగా జరిగింది. నిఖా సందర్భంగా ఎరుపు రంగు లెహంగాలో వధువు సజల్ మెరిసిపోగా... తెలుపు రంగు కుర్తా ధరించిన రజా మీర్ హుందాగా కనిపించాడు. కాగా ఓ టీవీ షోలో కలిసి నటించిన వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 2019 జూన్‌లో వీరి ఎంగేజ్మెంట్ జరగగా తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సజల్.. ‘హెల్లో.. మిస్టర్ మీర్’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సజల్ అలీ.. ‘మామ్ చిత్రంలో బాలీవుడ్ తెరపై తళుక్కుమన్న సంగతి తెలిసిందే. తన సవతి కూతురి(సజల్ అలీ)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలో దివంగత, లెజెండ్ శ్రీదేవి నటించగా.. ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సజల్‌కు మంచి గుర్తింపు లభించింది. -
నేను మరోసారి అమ్మను కోల్పోయాను..
ఇది పాకిస్థానీ నటి సజల్ అలీ వ్యక్తం చేసిన ఆవేదన. శ్రీదేవి మృతి పట్ల ఆమె తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ‘నేను మరోసారి అమ్మను కోల్పోయాను’ అంటూ నివాళులర్పించారు. శ్రీదేవి తాజాగా వెండితెరపై కనిపించిన సినిమా ‘మామ్’. ఈ సినిమాలో శ్రీదేవి కూతురిగా సజల్ అలీ నటించారు. దురదృష్టవశాత్తు, సజల్ అలీ ‘మామ్’ చిత్రం షూటింగ్ సమయంలో తన తల్లిని కోల్పోయింది. ఆ సమయంలో సజల్‌ను దగ్గరకు తీసుకొని ఒక తల్లిగా శ్రీదేవి ఓదార్చింది. ఆ విషాదసమయంలో తనను అక్కున చేర్చుకుంది. ‘సజల్ తన తల్లిని ఎంతగానో ప్రేమించేది. ఆమె దూరమవ్వడంతో ఆ అమ్మాయి గుండెపగిలింది. ఆ సమయంలో సజల్‌ను దగ్గరకు తీసుకొని.. ఒక తల్లిగా శ్రీదేవి ఓదార్చింది. ఈ విషాదం తర్వాత ఓసారి సజల్ పాక్‌లోని తన స్వస్థలం నుంచి శ్రీదేవికి ఫోన్ చేసి మాట్లాడింది. తన విషాదాన్ని ఆమెతో పంచుకుంది. శ్రీదేవి ఎంతో ఓపికతో తనను ఓదార్చింది. మామూలుగా శ్రీదేవి సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉంటారు. సహ సిబ్బందితో అంతగా కలిసిపోరు. కానీ సజల్ విషయంలో మాత్రం శ్రీదేవి భిన్నంగా స్పందించారు’ అని సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. సినిమా విడుదల సమయంలో శ్రీదేవి సజల్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘సజల్ కూడా నా బిడ్డనే. తనను ఎంతో ప్రేమిస్తున్నా. తన గురించి ఎందుకింత భావోద్వేగానికి లోనవుతున్నానో నాకు తెలియదు. తనను మిస్ అవుతున్నాను. తను సినిమాలో అద్భుతంగా నటించింది. తను లేకుంటే ఈ సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయేది. ఇది మాకు స్పెషల్ మూమొంట్’ అంటూ శ్రీదేవి పేర్కొన్నారు. మహిరా ఖాన్‌తోపాటు పలువురు పాకిస్థానీ నటులు శ్రీదేవి మృతిపట్ల ట్విట్టర్లో నివాళులు అర్పించారు. Lost my mom again... A post shared by Sajal Ali Firdous (@sajalaly) on Feb 24, 2018 at 11:51pm PST This was actually a surprise to me yesterday. I felt like she was there throughout. I couldn't hold back myself from crying. I am out of words. #iloveyoushrimama ❤💋 @sridevi.kapoor A post shared by Sajal Ali Firdous (@sajalaly) on Jul 7, 2017 at 12:23pm PDT -
బాలీవుడ్ లోకి మరో ఇద్దరు పాక్ నటులు
ఇస్లామాబాద్: మరో ఇద్దరు పాకిస్తాన్ నటులు బాలీవుడ్లో తెరంగేట్రం చేయబోతున్నారు. వెటరన్ నటి శ్రీదేవి నటస్తున్న 'మామ్' సినిమాలో పాక్ నటులు అద్నాన్ సిద్దిఖీ, సాజల్ అలీ నటించనున్నారు. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఆమే నిర్మాత. ఈ సినిమాలో శ్రీదేవి భర్తగా, సాజల్ తండ్రిగా సిద్దిఖీ నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు. ప్రస్తుతం జార్జియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చాలామంది పాకిస్తాన్ నటులు ఇంతకుముందు బాలీవుడ్ సినిమాలతో పాటు దక్షిణాదిలోనూ నటించారు.