breaking news
saint petersburg
-
వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ బెలారస్లో కాదు.. రష్యాలోనే ఉన్నాడు
మిన్స్క్: రష్యా అధినేత పుతిన్‌పై స్వల్పకాలం తిరుగుబాటు చేసి, పెను సంచలనం సృష్టించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నారని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో గురువారం చెప్పారు. ప్రిగోజిన్ ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో ఆశ్రయం పొందుతున్నాడని తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యా ప్రభుత్వం అందజేసిన నగదు, ఆయుధాలను వెనక్కిఇచ్చేసే ప్రయత్నంలో ప్రిగోజిన్ ఉన్నాడని వెల్లడించారు. వాగ్నర్ సైనిక దళాలు వారి క్యాంప్‌ల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఆయా క్యాంప్‌లు ఎక్కడున్నాయనే విషయం లుకశెంకో బయటపెట్టలేదు. బెలారస్‌లోని తమ మిలటరీ స్థావరాలను ఉపయోగించుకోవాలని వాగ్నర్ సభ్యులకు సూచించామని, వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ సిటీలో ప్రిగోజిన్ నివసిస్తున్నట్లు చెబుతున్న ఓ భవంతి ఫొటోలు, వీడియోలను రష్యా ఆన్లైన్ పత్రిక ఫోంటాకా బయటపెట్టింది. అయితే, ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలేవీ లభించలేదు. పుతిన్ క్షమాభిక్ష పెట్టిన తర్వాత ప్రిగోజిన్ బెలారస్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. -
నాలుగు వారాల పాటు ఆ నగరమంతా మత్తులోనే..?
ఒకటీ రెండూ రోజులు కాదు ఏకంగా నాలుగు వారాల పాటు నగరమంతా మత్తులో జోగిందంటే నమ్మగలరా? రష్యాలో జరిగిందిది. 1917లో జార్ పాలనకు అంతం పలుకుతూ సోవియట్ యూనియన్ ఏర్పాటు దిశగా తిరుగుబాటు చెలరేగింది. ఆ ఏడాది అక్టోబర్‌లో బోల్ష్విక్ ప్రజావిప్లవకారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఇది అప్పటి రష్యన్ చక్రవర్తుల పరిపాలన కేంద్రమైన పెట్రోగార్డ్ (ఇప్పటి సెయింట్స్ పీటర్స్బర్గ్) నగరంలో మొదలయ్యింది. ఈ నగరంలో చక్రవర్తి అధికారిక నివాసం అయిన వింటర్ ప్యాలెస్‌ను విప్లవకారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సోవియట్ యూనియన్ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు వారు భావించారు. ఈ సందర్భాన్ని పండుగలా జరుపుకోవాలనుకున్నారు. ఈ ప్రయత్నంలో వారికి విశాలమైన వింటర్ ప్యాలెస్ భవనంలో ప్రపంచంలోనే అతిపెద్ద వైన్ సెల్లార్ కనపడింది. అందులో సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన మందు ఉంది. దీంతో బోల్ష్విక్ సైనికులు ఉత్సాహంగా ఆ మందు తాగి, చిందులు వేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నగరంలోని పౌరుల చెవిన పడింది. వెంటనే వారూ ఆ భవనానికి చేరుకొని తాగడం మొదలుపెట్టారు. ఇలా ఏకంగా నాలుగు వారాల పాటు తాగుతూ, మత్తులోనే జోగుతూ ఉండిపోయారంతా. చివరికి సెల్లార్‌లోని మందు అయిపోవడంతో వాళ్ల హ్యాంగోవర్‌కు బ్రేక్ పడింది. ఈ కారణంగానే ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం మత్తులో జోగిన సంఘటన (బిగ్గెస్ట్ హ్యాంగోవర్)గా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఈ వింటర్ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చారు. చదవండి: ఓం నమః శివాయ అంటున్న ఇజ్రాయెల్ వాసులు -
పిలిభిత్ టైగర్ రిజర్వ్‌కు అవార్డు
లక్నో :ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)కు మొట్టమొదటి టీఎక్స్2 అవార్డు లభించింది. తక్కువ సమయంలోనే పులుల సంఖ్య రెండింతలు చేసినందుకుగానూ ఈ అవార్డు లభించింది. వివరాల్లోకెళ్తే.. 2010లో పులులను రక్షించేందుకు, వాటి సంఖ్యను పెంచేందుకు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా టీఎక్స్2 గ్లోబల్ అవార్డును ఏర్పాటు చేశారు. ఇందులో టైగర్ రిజర్వ్‌లు ఉన్న 13 దేశాలు పోటీ పడ్డాయి. 2010లో ఉన్న పులుల సంఖ్యను 2022 నాటికి రెండింతలు చేయాలన్నది ఈ అవార్డు అసలు లక్ష్యం. యూపీలోని పీటీఆర్ 2018 నాటికే ఈ ఘనతను సాధించింది. 2014 లెక్కల ప్రకారం పిలిభిత్‌లో 25 పులులున్నాయి. అవి 2018 నాటికి 65కు చేరుకున్నాయి. దీంతో మొదటి గ్లోబల్ అవార్డు భారత్‌ను వరించింది. పులులను జాగ్రత్తగా పర్యవేక్షించడం, దాడులను తగ్గించడం ద్వారా పులుల సంఖ్యను పెంచినట్లు పీటీఆర్ అధికారులు చెప్పారు. -
ఐదో టైటిల్‌కు అడుగు దూరంలో...
మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో సానియా జోడి మాడ్రిడ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-0తో వానియా కింగ్ (అమెరికా)-అల్లా కుద్రెత్సోవా (రష్యా)లపై గెలిచారు. దీంతో ఈ సీజన్లో ఐదో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. స్టట్గర్ట్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సానియా ద్వయానికి వరుసగా ఇది రెండో ఫైనల్. కేవలం 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టింది. వీళ్ల దాటికి తొలిసెట్లో ప్రత్యర్థులు ఒక్కసారి కూడా సర్వీస్ నిలబెట్టుకోలేకపోయారు. సానియా ద్వయం రెండుసార్లు సర్వీస్‌ను కోల్పోవడంతో కింగ్-అల్లా జంటకు రెండు పాయింట్లు దక్కాయి. రెండోసెట్లో రెండు, నాలుగో గేమ్‌లో ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ 4-0 ఆధిక్యంలో నిలిచారు. ఆ తర్వాత కూడా అదే జోరుతో సెట్, మ్యాచ్‌ను చేజిక్కించుకున్నారు. ఈ సీజన్లో సానియా ఖాతాలో సిడ్నీ, బ్రిస్బేన్, ఆస్ట్రేలియన్, సెయింట్ పీటర్స్బర్గ్ టైటిల్స్ ఉన్నాయి. శనివారం జరిగే ఫైనల్లో సానియా-హింగిస్... ఐదోసీడ్ కరోలినా గార్సియా-క్రిస్టినా మల్డోనోవిచ్లతో తలపడతారు. -
ఉడతే కదా అని రాయేశావో..?
ఊచ్! ‘‘ఉడతా ఉడతా ఊచ్.. ఎక్కడికెళతా వోచ్’’ అంటూ సంబరంతో గెంతులేశాడు ఓ యువకుడు. దాన్ని ఆటపట్టించాలని గురి చూసి దాని మీద ఓ రాయి విసిరాడు. అంతే! ఆ ఉడత కాస్తా చచ్చూరుకుంది. దాంతో అతను కటకటాలపాలవ్వాల్సి వచ్చింది. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సిటీ పార్కులో 19 ఏళ్ల ఎలిసెయ్ వ్లాదిమిరోవ్ అనే యువకుడు అనుకోకుండా ఓ ఉడతను చంపాడు. దాంతో ఆ దేశ ప్రభుత్వం మూగప్రాణులతో క్రూరంగా ప్రవర్తించినందుకు అతనికి ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. కానీ అదృష్టవశాత్తు అతనికి ప్రభుత్వ దయాభిక్ష దక్కి బయటపడ్డాడు. అయితే ఉడతనే కదా అతను చంపింది అన్న కారణంగా వదిలేయలేదు. జర్మనీ నుంచి స్వతంత్రం సంపాదించి 70 ఏళ్లు నిండిన సందర్భంగా రష్యా సంబరాలు జరుపుకుంటోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దయాభిక్షతో లక్షాయాభైవేల మంది ఖైదీలను విడుదల చేశారురు. లక్కీగా ఆ జాబితాలో వ్లాదిమిరోవ్ కూడా ఉన్నాడు. అసలు వ్లాదిమిరోవ్ ఆ ఉడతను ఎందుకు చంపాడు అనే సందేహం వస్తుంది. ఓ రోజు ఈ యువకుడు తన స్నేహితులతో కలసి సెయింట్ పీటర్స్బర్గ్ సిటీ పార్కును సందర్శించడానికి వెళ్లాడు. అందరూ ఆ ఉడతల గుంపుకు దాణా వేస్తున్నారు. అప్పుడు ఈ వ్లాదిమిరోవ్ ఓ ఉడతను చిన్న రాయితో కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక అది గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయింది. అక్కడే ఉన్న మరో యువకుడు జరిగినదంతా అధికారులకు చెప్పాడు. దాంతో వారు వ్లాదిమిరోవ్ను పోలీసులకు అప్పగించారు. వారు కూడా కేసు నమోదు చేసి చేతులు దులుపుకోకుండా హత్యానేరం కింద కోర్టుకు పంపారు. కోర్టులో ఈ కేసు విషయమై జడ్టి, ప్రాసిక్యూటర్స్, డిఫెండెంట్స్ అందరూ విచారణ జరిపి వ్లాదిమిరోవ్ను నేరస్తుడిగా నిర్థారించారు. పార్కులో ఉడతను చంపడం చూసిన యువకుడు బలమైన సాక్షిగా నిలవడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది కోర్టు. బహుశా వ్లాదిమిరోవ్ ఓ పదిసార్లైనా నక్క తోక తొక్కుంటాడు. అందుకే అతను అరెస్టు అయిన కొన్ని రోజులకే రష్యా విక్టరీ డే వచ్చింది. ప్రతి ఏడాది లాగే దయాభిక్ష కింద మొదటిసారి నేరం చేసిన వారిని, అయిదేళ్ల లోపు జైలు శిక్ష పడినవారిని ప్రభుత్వం విడుదల చేసింది. అసలు వ్లాదిమిరోవ్ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది 70 ఏళ్ల కిందట రష్యా విముక్తికోసం పాటుపడిన వారికి. ఇలా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుణ్యమా అని ఈ వ్లాదిమిరోవ్ జైలు నుంచి దేవుడా అంటూ బయట పడ్డాడు. -
జీ-20 సదస్సు ఆర్థిక నిర్ణయాలు.. విశ్లేషణ
ప్రపంచంలో 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లకు సంబంధించిన గ్రూపును జీ-20గా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వివిధ అంశాలకు సంబంధించి ఆయా దేశాల సహకారం, చర్చల కొనసాగింపునకు వీలుగా జీ-20 గ్రూపు ఏర్పాటును కెనడా మాజీ ప్రధానమంత్రి పాల్మార్టిన్ ప్రతిపాదించారు. జీ-20ని 1999 సెప్టెంబర్‌లో ప్రకటించగా.. మొదటి సమావేశం అదే ఏడాది డిసెంబర్లో జరిగింది. తాజాగా జీ-20 దేశాల నేతలు సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సభ్య దేశాలు కలిసి పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. జీ-20 దేశాల విజయాలను పరిశీలిస్తే.. బ్రిక్స్ (BRICS) వంటి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పటిష్టంగా ఉంది. దీనివల్ల అంతర్జాతీయ విత్త సంస్థల పటిష్టత, ఆర్థిక నియంత్రణల నాణ్యతలో పెరుగుదల సంభవించింది. పీటర్‌సబర్‌గ సమావేశం- నిర్ణయాలు: ఐదు సంవత్సరాల క్రితంతో పోల్చితే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు కొంత వరకు మెరుగయ్యాయి. ఆర్థిక వృద్ధిరేటు వేగవంతమైనప్పటికీ.. మరోవైపు అనిశ్చితి కూడా పెరిగింది. ఈ క్రమంలో సెయింట్ పీటర్‌సబర్‌గలో జరిగిన జీ-20 సమావేశం పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా అధిక వృద్ధి, ఉపాధి కల్పన మెరుగుపడగలదని అభిప్రాయపడింది. సమర్థమైన నియంత్రణల అమలుతోపాటు మార్కెట్లపై విశ్వాసం పెంపొందించే చర్యలు చేపట్టాలని కూడా ఈ సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సెయింట్ పీటర్‌సబర్‌గ కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించారు. బడ్జెట్‌లోటు తగ్గుదల, సమగ్రమైన నిర్మాణాత్మక సంస్కరణల అమలును మధ్యకాలిక లక్ష్యాలుగా నిర్ణయించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా శ్రామిక మార్కెట్, పన్నుల వ్యవస్థపై నియంత్రణ, మానవ మూల ధనం పెంపు, అవస్థాపనా సౌకర్యాల మెరుగుదల, వస్తు మార్కెట్ నియంత్రణ విధానాలను అమలు చేయాలని సూచించారు. ఈ చర్యలు విత్త మార్కెట్‌ను పటిష్టపరచడంతోపాటు అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడిదారుల పాత్రను పెంచాల్సిన అవసరాన్ని వివరించాయి. అభివృద్ధి వ్యూహం: జీ-20 నేతలు సెయింట్ పీటర్‌సబర్‌గ అభివృద్ధి వ్యూహాన్ని ఈ సమావేశంలోనే వెల్లడించారు. అల్పాదాయ దేశాలకు ఆర్థిక సహాయం అందించే క్రమంలో అనుసరించాల్సిన ప్రాధాన్యత అంశాలను ఈ వ్యూహంలో పేర్కొన్నారు. అవి: ఎ)ఆహారభద్రత బి)ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సి)ఫైనాన్షియల్ లిటరసీ డి)ఆధునిక అవస్థాపనా సౌకర్యాల కల్పన ఇ)మానవ మూలధనం పెంపు, వేగంగా అభివృద్ధి చెందుతున్న (ఎమర్జింగ్) వ్యవస్థలలో స్వదేశీ వనరుల సమీకరణ. పాత్ర కీలకం: ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పురోగమనం దిశగా మళ్లించడంలో జీ-20 దేశాల పాత్ర కీలకమన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. వృద్ధి రేటును పటిష్టం చేయడం ద్వారా ఉపాధి కల్పన పెంచాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పటిష్టమైన, సుస్థిర, సంతులిత వృద్ధి సాధన దిశగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమించాలని ఆయా దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. సుస్థిర వృద్ధి సాధన పెట్టుబడులపై ఆధారపడి ఉండడంతో.. పెట్టుబడులకు సంబంధించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా భావించారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెంపుతోపాటు విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించే విధంగా సమర్థమైన నియంత్రణ విధానం ఉండాలని కూడా సమావేశం పేర్కొంది. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు సభ్య దేశాలు పరస్పర సహకారంతో పని చేయాలని ఆయా దేశాల నేతలు సూచించారు. సుస్థిరత సాధించేందుకు: విత్త యాజమాన్యాన్ని సమర్థంగా నిర్వహించడంతోపాటు విత్త మార్కెట్లో సుస్థిరత సాధించేందుకు ప్రయత్నించాలని.. తద్వారా ఆర్థిక వ్యవస్థలు పురోగమిస్తాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత పెరిగింది. ఈ నేపథ్యంలో యువత కోసం నాణ్యతతో కూడుకున్న ఉత్పాదకత గల ఉపాధిని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలని సమావేశంలో నేతలు వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రభుత్వ విధానాల మధ్య సమన్వయం ఉండాలి. స్థూల ఆర్థిక విధానాల అమలు ద్వారా విద్య, నైపుణ్యం, నవకల్పనలు, ఉపాధి, ద్రవ్య, సాంఘిక భద్రత పెంపొందించే చర్యలు అవసరమని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. శ్రామిక మార్కెట్లో సంస్కరణల అమల్లో భాగంగా సమ్మిళిత శ్రామిక మార్కెట్ల ఏర్పాటుకు అవసరమైన మద్దతు కొనసాగించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. పెట్టుబడులు పెంచే క్రమంలో దీర్ఘకాల రుణ మార్కెట్ల అభివృద్ధి ఆవశ్యకతను సమావేశంలో పేర్కొన్నారు. అవస్థాపనా రంగం, చిన్న, మధ్య తరహా సంస్థలకు పెట్టుబడుల ప్రవాహం పెరగాలని.. ఆయా రంగాల్లో పెట్టుబడుల పెరుగుదల అధికవృద్ధి సాధనకు తోడ్పడటమే కాకుండా ఉపాధి కల్పనకు దోహదపడగలదని పేర్కొన్నారు. బహుళ దేశాలతో వాణిజ్యం: పటిష్టమైన బహుళ దేశాలతో వాణిజ్యం (Multi lateral Trading) పెంపుపై దేశాలు దృష్టి కేంద్రీకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం పొందిన దేశాలు మరింత సరళీకరణ (flexibility) కనబరచి ఈ సంవత్సరంలో జరిగే మల్టీ లేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స ద్వారా ఆశించిన ఫలితాలు సాధించాలని సమావేశం పేర్కొంది. పటిష్టమైన, సుస్థిర, సంతులిత వృద్ధి ద్వారా ప్రజలందరూ లబ్ధి పొందే అవకాశం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమనాన్ని అతి ముఖ్యమైన అంశంగా ఈ సమావేశం పేర్కొంది. ఇతర చర్యలు: సెయింట్ పీటర్‌సబర్‌గ సమావేశం గవర్నెన్సకు సంబంధించి ప్రపంచీకరణ విధానాల అమలుపై దృష్టి కేంద్రీకరించింది. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరస్పర ఆధారిత వ్యవస్థగా రూపాంతరం చెంది అధిక వృద్ధి వైపు పయనించింది. భారత్‌తోపాటు అనేక దేశాలు నియంత్రణ విధానాలను విడనాడాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు, దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షల తొలగింపు, అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి, మూల ధన ప్రవాహాలపై వివిధ దేశాల ఆంక్షలు తొలగించడం, చైనా, భారత్‌తోపాటు ఇతర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధించడంలో తోడ్పడటం లాంటి పరిమాణాలు సంభవించాయి. ఆర్థిక సంక్షోభం అనంతర కాలంలో పరస్పర ఆధారిత దేశాలన్నీ లబ్ధి పొందేరీతిలో జీ-20 ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి కాలంలో బేసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్, ది ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు, ది ఫైనాన్షియల్ ఆప్షన్ టాస్క్ఫోర్స, ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషనర్స, ది ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రస్తుతం నిర్వహణలో ఉన్న పలు సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రగతిపై సమీక్ష: గత కొంతకాలంగా వరుసగా వివిధ దేశాల ఆర్థిక స్థితి క్షీణించింది. ఈ క్రమంలో అగ్రెసివ్ టాక్స్ ప్లానింగ్, పన్నులు ఎగవేతలకు ఆస్కారం లేనివిధంగా అంతర్జాతీయ సహకారం పెంపొందించడానికి జీ-20 కృషి చేసింది. సభ్య దేశాల్లో విధాన నిర్ణయాల అమలు ప్రగతిని జీ-20 సమీక్షించింది. భారత్ వస్తు, సేవలపై పన్ను విధింపును ప్రకటించింది. ఎగుమతుల తగ్గింపు ద్వారా స్వదేశీ వినియోగ పెంపునకు చైనా అనుమతించింది. జపాన్ ఆర్థిక సహాయంతో ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్‌ను పూర్తి చేయడానికి భారత్ సంకల్పించింది. పారదర్శకత పెంపు ద్వారా అవినీతి నిర్మూలనకు జీ-20 కట్టుబడి ఉంది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి అవస్థాపనా రంగంపై పెట్టుబడులు పెరగాలి. భారత్ అవస్థాపనా సౌకర్యాలపై ఆశించిన మేర పెట్టుబడులు ఆకర్షించకపోవడం అధిక ఆర్థికవృద్ధి సాధనకు అవరోధంగా మారింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అవస్థాపనా రంగంపై పెట్టుబడుల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా సమిష్టి డిమాండ్‌ను పెంచగలదు. ముగింపు: పటిష్టమైన, సుస్థిర, సంతులిత వృద్ధి సాధన లక్ష్యాన్ని సెయింట్ పీటర్‌సబర్‌గ సమావేశం సదర్భంగా జీ-20 దేశాలు ప్రకటించాయి. ఆయా దేశాల్లో సమానత్వం సాధించకుండా ప్రతిపాదిత లక్ష్యాల సాధన సాధ్యం కాదు. జీ-20 దేశాల్లో కొన్ని ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను లక్షిత వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్య సంరక్షణ, అధికవేతన స్థాయి ప్రజలు పొందగలగాలి. తలసరిశక్తి వినియోగం, తాగునీరు, స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్) వంటి సౌకర్యాలు పెంపొందించాలి. ఆయా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు వేర్వేరుగా ఉండటాన్ని ఈ సందర్భంగా గమనించవచ్చు. పన్ను ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా పన్ను ఎగవేతను నివారించే ఉద్దేశంతో పన్నుల విధానంలో సంస్కరణలను ఆయా దేశాల్లో అత్యవసరంగా ప్రవేశపెట్టాలి. రీజనల్ ట్రేడ్ ఒప్పందాలతో పారదర్శకతను పెంపొందించేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక సంక్షోభం- భారత్ చర్యలు అమెరికా సంక్షోభానికి ముందు కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థగా నిలిచింది. 2005-07 మధ్య కాలంలో 9.6 శాతం వృద్ధి సాధించగా 2008 -09లో సంక్షోభం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. సంక్షోభం కారణంగా భారత్‌లో టెక్స్టైల్, వజ్రాలు, ఆభరణాలు వంటి ఎగుమతి ప్రాధాన్యత పరిశ్రమల్లో, ఉపాధి క్షీణత సంభవించింది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ప్రభుత్వం 2008 డిసెంబర్, 2009 జనవరి, ఫిబ్రవరిలో మూడు విడతలుగా విత్త మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ విధానం ముఖ్యోద్దేశ్యం సమ్మిళిత వృద్ధి. ప్రభుత్వ వ్యయం పెంపు ద్వారా గ్రామీణ ఆదాయాలు పెరిగి తద్వారా వడ్డీరేటు తగ్గి స్వదేశీ డిమాండ్ పెరగగలదని విధాన నిర్ణేతలు భావించారు. విత్త మద్దతులో భాగంగా... ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టిన రహదారులు (హైవేస్), నౌకాశ్రయాలు, విద్యుత్ రంగానికి సంబంధించిన అవస్థాపనా ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడం. విత్త సంస్థల నిధుల సమీకరణను రీజినల్ ఇన్‌స్టిట్యూషన్‌స లేదా మల్టిలేటరల్ సంస్థల నుంచి అనుమతించారు. టెక్స్టైల్, హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్, వజ్రాలు, ఆభరణాలు, తోలు రంగానికి సంబధించి పన్ను రాయితీలు ఆర్థిక వ్యవస్థలో మూలధన ప్రవాహం పెంపు. ఆస్తుల కొనుగోలు, ప్రభుత్వం లేదా కేంద్ర బ్యాంకు రుణాలు, ద్రవ్యత్వం పెంపు వంటి చర్యల ద్వారా మూలధన ప్రవాహం పెంపు. గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచే క్రమంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, అవస్థాపనా రంగం, సుపరిపాలనా సంస్కరణలకు సంబంధించి జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఏర్పాటు, భారత్ నిర్మాణ్ కార్యక్రమాల అమలు సంక్షోభకాలంలో దేశంలో స్వదేశీ డిమాండ్ పెరుగుదలకు దోహదపడ్డాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ - ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడంతోపాటు నిరుద్యోగం పెరుగుతోంది. ఈ పరిస్థితి పలు దేశాల్లో సమ్మిళిత వృద్ధి సాధన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఐరోపాలో విత్త మార్కెట్ సంక్షోభం. వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ వ్యవస్థలో మందగించిన వృద్ధి ప్రపంచ వ్యాప్తంగా మూలధన ప్రవాహానికి సంబంధించిన ఒడిదుడుకులు నమోదు కావడం. వివిధ దేశాల్లో ప్రైవేట్ పెట్టుబడులు కావల్సినంతగా లేకపోవడంతోపాటు మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ దేశాల ప్రభుత్వ రుణ భారం అధికంగా ఉండటం. ప్రపంచవ్యాప్తంగా సమిష్టి డిమాండ్ తగ్గుదల. వివిధ దేశాల ప్రభుత్వాల కోశ విధానంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగడం వస్తు ధరల ఒడిదుడుకులతోపాటు ఫైనాన్షియల్ కండీషన్స (ఆర్థిక పరిస్థితులు) కఠినంగా ఉండటం.