breaking news
Sahasam swasaga saagipoo
-
ఒక్కటే తెలుగు సినిమా.. హీరోతో ప్రేమ పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా?
ఒక్కటే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసింది. అది కూడా నాగచైతన్యతో. కానీ ఏం లాభం. బాగుందన్నారు కానీ ఎందుకో ఆ మూవీ సరిగా ఆడలేదు. దీంతో టాలీవుడ్లో లీడ్ రోల్లో మరో సినిమా చేయలేదు. అదే టైంలో తమిళ, మలయాళంలో మాత్రం నటించేసింది. రెండేళ్ల క్రితం తమిళ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మంజిమ మోహన్. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? 'ఏ మాయ చేశావె' లాంటి హిట్ తర్వాత నాగచైతన్య-గౌతమ్ మేనన్.. 'సాహసం శ్వాసగా సాగిపో' అనే మూవీ చేశారు. రోడ్ జర్నీ స్టోరీతో తీసిన ఈ లవ్ స్టోరీతోనే మంజిమ తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఫేమస్.(ఇదీ చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)మలయాళ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ కూతురైన మంజిమ.. 1997-2001 మధ్య పలు మలయాళ చిత్రాల్లో బాలనటిగా చేసింది. పెద్దయిన తర్వాత పిల్లల షోకు హోస్ట్‌గా చేసి బోలెడంత క్రేజ్ సొంతం చేసుకుంది. అలా హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.తెలుగులో హీరోయిన్ గా చేసిన మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'. ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాల్లో భువనేశ్వరి పాత్ర పోషించింది. 'బూ' అనే హారర్ మూవీ కూడా చేసింది. కాకపోతే వీటిలో అతిథి పాత్రలే. వ్యక్తిగత విషయానికొస్తే తమిళ హీరో గౌతమ్ కార్తిక్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మంజిమ.. 2022లో అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి సినిమాలకు దూరమైపోయింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?) -
క్యాష్ కంటే...క్యారెక్టర్ ముఖ్యం!
నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్న మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ చెప్పిన ముచ్చట్లు... ► నాన్న విపిన్ మోహన్ ప్రముఖ మలయాళీ సినిమాటోగ్రాఫర్. ఆయన వల్లే యాక్టర్నయ్యా. నాన్నతో కలసి ఓరోజు షూటింగ్‌కి వెళ్లా. చిన్న అమ్మాయి ఎవరో రాలేదు. నాన్న చెప్పినట్టు కెమేరా ముందు పరిగెత్తాను. అలా మూడేళ్ల వయసులోనే తొలిసారి నటించా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 8 సినిమాలు చేశా. ► నాన్నకు నేను హీరోయిన్ కావడం ఇష్టం లేదు. ఇండస్ట్రీ గురించి ఆయనకు బాగా తెలుసు. హీరోయిన్లు ఎలాంటి కష్టాలు పడతారు, వాళ్ల ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసు. బహుశా.. నా కూతురుకి అటువంటి కష్టాలెందుకు? అని వద్దన్నారేమో! (నవ్వుతూ..) చివరకు, ‘నీ ఇష్టాన్ని కాదనను. కానీ, ముందు డిగ్రీ కంప్లీట్ చేయ్’ అన్నారు. ► ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యా. ఆ సినిమా ట్రైలర్ చూసి గౌతమ్ మీనన్ ఆడిషన్‌కి పిలిచారు. తమిళ సినిమాకే నన్ను సెలెక్ట్ చేశారనుకున్నా. అగ్రిమెంట్ మీద సంతకం చేసేటప్పుడు తమిళం, తెలుగు - రెండు భాషల్లో అని అర్థమైంది. చెన్నైలో చదివా కాబట్టి తమిళ్ వచ్చు. తెలుగు రాదు. సో, తెలుగులో నటించలేనని చెప్పా. గౌతమ్ మీనన్ నువ్వు చేయగలవని ప్రోత్సహించారు. నిజానికి, ‘ఏ మాయ చేసావె’ విడుదలైన తర్వాత ఓ కెఫేకి వెళ్లా. అక్కడికి గౌతమ్ మీనన్ వచ్చారు. నేను ఎగ్జయిటయ్యా. కానీ, ఏదో ఒక రోజు ఆయన సినిమాలో నటిస్తానని అనుకోలేదు. నాగచైతన్య వెరీ ఫ్రెండ్లీ కో-స్టార్. ► ఓసారి చేసిన సీన్లో మళ్లీ సేమ్ ఫీలింగ్‌తో నటించడం చాలా కష్టం. రెండు భాషల్లో డైలాగులను గుర్తు పెట్టుకోవాలి. షూటింగ్‌కి ఓ రోజు ముందు తెలుగు డైలాగ్స్ నేర్చుకునేదాన్ని. తమిళ్ సీన్ షూట్ చేసిన తర్వాత తెలుగు తీసుంటే బాగుండేదేమో! కానీ, ఫస్ట్‌డే చైతన్యతో ఓ సీన్ షూట్ చేశాం. రెండో రోజు శింబుతో తమిళ్ సీన్ షూటింగ్... సినిమా అంతా ఇంతే. ► క్యాష్ కంటే సినిమాలో నా క్యారెక్టర్ ముఖ్యం. కమర్షియల్ సినిమాలు కూడా ముఖ్యమే. నాకు అసౌకర్యంగా అనిపించే సినిమాలు చేయను. గ్లామర్ పేరుతో చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడం నాకిష్టం లేదు.