ఒక్కటే తెలుగు సినిమా.. హీరోతో ప్రేమ పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా? | Manjima Mohan Childhood Pic And Husband Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: తండ్రి సినిమాటోగ్రాఫర్.. తల్లి డ్యాన్స్.. ఈమె హీరోయిన్

Sep 18 2024 1:42 PM | Updated on Sep 18 2024 2:58 PM

Manjima Mohan Childhood Pic And Husband Details

ఒక్కటే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అది కూడా నాగచైతన్యతో. కానీ ఏం లాభం. బాగుందన్నారు కానీ ఎందుకో ఆ మూవీ సరిగా ఆడలేదు. దీంతో టాలీవుడ్‌లో లీడ్ రోల్‪‌లో మరో సినిమా చేయలేదు. అదే టైంలో తమిళ, మలయాళంలో మాత్రం నటించేసింది. రెండేళ్ల క్రితం తమిళ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మంజిమ మోహన్. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? 'ఏ మాయ చేశావె' లాంటి హిట్ తర్వాత నాగచైతన్య-గౌతమ్ మేనన్.. 'సాహసం శ్వాసగా సాగిపో' అనే మూవీ చేశారు. రోడ్ జర్నీ స్టోరీతో తీసిన ఈ లవ్ స్టోరీతోనే మంజిమ తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఫేమస్.

(ఇదీ చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)

మలయాళ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ కూతురైన మంజిమ.. 1997-2001 మధ్య పలు మలయాళ చిత్రాల్లో బాలనటిగా చేసింది. పెద్దయిన తర్వాత పిల్లల షోకు హోస్ట్‌గా చేసి బోలెడంత క్రేజ్ సొంతం చేసుకుంది. అలా హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.

తెలుగులో హీరోయిన్ గా చేసిన మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'. ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాల్లో భువనేశ్వరి పాత్ర పోషించింది. 'బూ' అనే హారర్ మూవీ కూడా చేసింది. కాకపోతే వీటిలో అతిథి పాత్రలే. వ్యక్తిగత విషయానికొస్తే తమిళ హీరో గౌతమ్ కార్తిక్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న మంజిమ.. 2022లో అతడిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి సినిమాలకు దూరమైపోయింది.

(ఇదీ చదవండి: Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement